Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కువైట్ అమీరుతో ప్రధానమంత్రి భేటీ

PM meets the Amir of Kuwait


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్‌తో సమావేశమయ్యారు. ఈ నేతలిద్దరూ సమావేశం కావడం ఇది మొదటిసారి. బాయన్ ప్యాలెస్‌కు ప్రధాని చేరుకోవడంతోనే, కువైట్ ప్రధాని శ్రీ అహమద్ అల్-అబ్దుల్లా అల్-అహమద్ అల్-సబాహ్ ఆయనకు సంప్రదాయబద్ధ పద్ధతిలో స్వాగతం పలికి, ప్యాలెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

రెండు దేశాల మధ్య ఉన్న బలమైన చరిత్రాత్మక, మైత్రీపూర్వక సంబంధాలను నేతలు గుర్తుచేసుకొంటూ, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరింపచేసుకోవడానికీ, గాఢతరంగా మార్చుకోవడానికీ తమ పూర్తి నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక సంబంధాన్ని ఒక ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకోవాలని అంగీకరించారు.

కువైట్‌లో ఒక మిలియన్ (పది లక్షల) మంది భారతీయ సముదాయం సభ్యుల శ్రేయానికి పూచీపడుతున్నందుకు అమీరుకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ సముదాయం కువైట్ అభివృద్ధికి అందిస్తున్న తోడ్పాటును అమీరు ప్రశంసించారు.

కువైట్ తన విజన్ 2035ను సాకారం చేసుకోవడానికి చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ప్రధాని మెచ్చుకొన్నారు. ఈ నెల మొదట్లో జీసీసీ శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు అమీరుకు ప్రధాని అభినందనలు తెలిపారు. నిన్న జరిగిన అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభ కార్యక్రమానికి తనను ‘గౌరవ అతిథి’గా ఆహ్వానించినందుకు ప్రధానమంత్రి తన కృతజ్ఞత‌లను కూడా వ్యక్తం చేశారు. ప్రధాని వ్యక్తపర్చిన అంతరంగ భావనలకు అమీరు ప్రతిస్పందిస్తూ కువైట్‌లోనూ, గల్ఫ్ ప్రాంతంలోనూ ఒక విలువైన భాగస్వామిగా భారత్ పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు. భారత్ మరింత ప్రముఖ భూమికను పోషిస్తుందనీ, కువైట్ విజన్ 2035ను ఆచరణరూపంలోకి తీసుకురావడంలో భారత్ తోడ్పాటును అందిస్తుందనీ తాను ఎదురుచూస్తున్నానని అమీరు అన్నారు.

⁠అమీరును భారత్ సందర్శించాల్సిందిగా ప్రధాని ఆహ్వానించారు.

 

***