Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కీవ్ లో గాంధీ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

కీవ్ లో గాంధీ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


కీవ్ లో ఈ రోజు మహాత్మ గాంధీ విగ్రహం వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. సామరస్య పూర్వక సమాజాన్ని నిర్మించడంలో గాంధీ మహాత్ముని శాంతి సందేశానికి కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ విలువ ఉంటుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  గాంధీ మహాత్ముడు చూపిన బాట వర్తమాన ప్రపంచంలో సవాళ్ళకు పరిష్కారాలను సూచించిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 

కీవ్ లోని ‘ఒయాసిస్ ఆఫ్ పీస్’ పార్కులో కొలువుదీరిన మహాత్మ గాంధీ విగ్రహం మానవజాతికి ఒక ఆశాదీపంగా, శాంతి ప్రబోధకంగా నిలుస్తోంది.