Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కీర్తి శేషుడు శ్రీదేవ్ ఆనంద్ భారతదేశ చలనచిత్ర రంగాని కి అందించిన సేవల ను ఆయన శత జయంతి సందర్భం లో స్మరించుకొన్నప్రధాన మంత్రి


కీర్తి శేషుడు శ్రీ దేవ్ ఆనంద్ భారతదేశ చలనచిత్ర రంగాని కి అందించిన సేవల ను ఆయన శత జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో –

 

‘‘దేవ్ ఆనంద్ గారి ని నిత్యనూతన ప్రముఖుని వలె స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది. కథల ను చెప్పడం లో ఆయన కు ఉన్న అభిరుచి తో పాటు గా సినిమా అంటే ఆయన కు ఉన్న మక్కువ సైతం సాటిలేనటువంటివి. ఆయన యొక్క చలనచిత్రాలు ఒక్క వినోదాన్ని అందించడమే కాక మారుతున్న సమాజాని కి మరియు భారతదేశం యొక్క మహత్వాకాంక్షల కు అద్దం పట్టేవి కూడా ను. కాల పరీక్ష కు తట్టుకొని నిలబడిన ఆయన నటన ప్రేక్షకవర్గాన్ని కొన్ని తరాల పాటు ప్రభావితం చేసేదే. శ్రీ దేవ్ ఆనంద్ శత జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.