Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కిర్ లోస్ కర్ బ్రదర్స్ లిమిటెడ్ వంద సంవత్సరాల కాలం వేడుక లకు హాజరు అయిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కిర్ లోస్ కర్ బ్రదర్స్ లిమిటెడ్ (కెబిఎల్) కు వంద సంవత్సరాలు అయిన సందర్భం లో న్యూ ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన వేడుకల కు హాజరు అయ్యారు. కెబిఎల్ కు 100 సంవత్సరాలు అయినందుకు గుర్తు గా ఒక తపాలా బిళ్ల ను ప్ర‌ధాన మంత్రి విడుదల చేశారు. అలాగే, ‘యాంత్రిక్ కీ యాత్ర – ద మేన్ హు మేడ్ మశీన్స్’ పేరు తో కిర్ లోస్ కర్ బ్రదర్స్ వ్యవస్థాపకుడు కీర్తిశేషుడు శ్రీ లక్ష్మణ్ రావ్ కిర్ లోస్ కర్ స్వీయచరిత్ర తాలూకు హిందీ అనువాదాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి ఆవిష్కరించారు.

కిర్ లోస్ కర్ బ్రదర్స్ లిమిటెడ్ ను నూరేళ్ల కాలం వేడుకల పట్ల ప్రధాన మంత్రి అభినందిస్తూ, రిస్కుల ను తీసుకొనే వివేకశీలత్వం, నూతన రంగాల లోకి విస్తరించడం అనేవి ఈ కాలానికి కూడాను మన భారతదేశ నవ పారిశ్రామికులు ప్రతి ఒక్కరి యొక్క ముద్ర గా ఉన్నాయి అన్నారు. దేశం అభివృద్ధి చెందాలి అనే విషయం లోను, తన సామర్థ్యాల మరియు తన విజయాల పరిధి ని విస్తరించుకోవాలనే విషయం లోను భారతదేశ నవ పారిశ్రామికుడు/నవ పారిశ్రామికురాలు అవిశ్రాంతం గా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

‘‘ఇవాళ, ఎప్పుడైతే మనం ఒక క్రొత్త సంవత్సరం లోకి అడుగు పెడుతున్నామో, మనం ఒక నూతనమైన దశాబ్ది లోకి కూడా ప్రవేశిస్తున్నామో- ఈ కాలం లో ఈ దశాబ్దం భారతదేశ నవ పారిశ్రామికుల దశాబ్దమే అని చెప్పడం లో నాలో ఎటువంటి సంకోచం లేదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘భారతదేశాని కి, భారతీయులకు మరియు పరిశ్రమల కు ప్రభుత్వం ఒక అడ్డంకి గా నిలవడం కాకుండా వాటి భాగస్వామి గా నిలచినపుడు మాత్రమే దేశ ప్రజల యొక్క నిజమైన శక్తి ముందుకు వస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘ ‘సంకల్పం తో సంస్కరించడం, నిజాయతీ తో పని చేయడం, తీక్ష్ణత తో పరివర్తన ను తీసుకొనిరావడమూను’ అనేది గడచిన కొన్ని సంవత్సరాల కాలం లో మా దారి గా ఉన్నది. మేము వృత్తిపరమైనటుంటి నైపుణ్యం తో కూడిన మరియు ప్రక్రియ చోదక శక్తి గా ఉన్న పాలన కోసం యత్నించాము. చిత్తశుద్ధి తో మరియు పూర్తి పారదర్శకత్వం తో పని చేసేటటువంటి ఒక వాతావరణం గత అయిదు సంవత్సరాల లో దేశం లో నెలకొంది. ఇది పెద్ద లక్ష్యాల ను నిర్దేశించుకొని వాటి ని సకాలం లో సాధించేందుకు అవసరమైన ధైర్యాన్ని దేశాని కి ప్రసాదించింది ’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘2018-19 ఆర్థిక సంవత్సరం లో యుపిఐ ద్వారా సుమారు గా 9 లక్షల కోట్ల రూపాయల విలువైన లావాదేవీ లు చోటు చేసుకొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం లో డిసెంబరు వరకు కేవలం దాదాపు గా 15 లక్షల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు యుపిఐ ద్వారా జరిగాయి. దేశం ఎంత వేగం గా డిజిటల్ ట్రాన్జాక్శన్స్ ను అంగీకరిస్తున్నదో మీరు ఊహించగలరు. ఉజాలా పథకం నిన్ననే 5 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నది. దేశం అంతటా 36 కోట్ల కు పైగా ఎల్ఇడి బల్బుల ను పంచిపెట్టిన సంగతి మనకు అందరి కి సంతృప్తి ని ఇచ్చేటటువంటిది.’’

‘‘అదే మాదిరి గా మేక్ ఇన్ ఇండియా ప్రచార ఉద్యమం యొక్క విజయ గాథ లు మన పరిశ్రమ కు బలాన్ని ఇస్తున్నాయి. నేను భారతదేశ పరిశ్రమ లో ప్రతి ఒక్క రంగం నుండి విజయ గాథ లు వెలువడాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.