Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కిర్లోస్కర్ గ్రూపు శత వార్షికోత్సవాల లో ప్రధాన మంత్రి ఉపన్యాసం


మీ అందరి కి ఇవే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది కిర్లోస్కర్ గ్రూపు వారి కి రెండు ఉత్సవాల ను జరుపుకొనేటటువంటి సందర్భం. జాతి నిర్మాణం లో వందేళ్ళ సహకారాన్ని అందించిన ప్రత్యేకత ఈ సంస్థకు ఉంది. అందుకు కిర్లోస్కర్ గ్రూపు వారి ని నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

కిర్లోస్కర్ గ్రూపు సాధించిన విజయం భారతీయ కంపెనీ లు మరియు భారతదేశ నవ పారిశ్రామికవేత్త లు సాధించిన విజయాని కి ప్రమాణ చిహ్నం గా ఉంటుంది. సింధు లోయ నాగరికత కాలం నుండి ఇప్పటి వరకు భారతీయుల సాహస స్ఫూర్తి దేశ అభివృద్ధి కి ఒక క్రొత్త శక్తి ని మరియు ఒక క్రొత్త ఉరవడి ని ఇస్తున్నది. దేశం దాస్య శృంఖలాల లో చిక్కుకొన్న కాలం లో, శ్రీ లక్ష్మణరావు కిర్లోస్కర్ గారు మరియు ఆయన వంటి నవ పారిశ్రామికవేత్త లు భారతీయ స్పూర్తి ని సజీవం గా ఉంచారు. ఎట్టి పరిస్థితుల లో ఆ స్ఫూర్తి బలహీనపడకుండా చూశారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా దేశం ముందంజ వేసేందుకు సహాయపడింది ఆ స్ఫూర్తే . ఈ రోజు న లక్ష్మణరావు కిర్లోస్కర్ గారి భావన లు మరియు స్వప్నాల ను సంబురంగా జరుపుకొనేటటువంటి రోజొక్కటే కాదు, ఇది నవ పారిశ్రామికవేత్త లు నూతన ఆవిష్కరణ లు మరియు అంకిత భావం నుండి స్పూర్తి ని పొందడానికి అమూల్యమైన అవకాశం కూడా. ఈ రోజు న లక్ష్మణ్ రావు గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతోంది. దానికి అందమైన పేరు ను.. ‘యాంత్రిక్ కీ యాత్ర – ద మేన్ హు మేడ్ మశీన్స్’ (ఒక యాంత్రికుని యాత్ర – యంత్రాల ను తయారు చేసిన మనిషి).. కూడా పెట్టారు. ఆ గ్రంథాన్ని ఆవిష్కరించడం నాకు లభించిన ప్రత్యేక అధికారం గా కూడా నేను భావిస్తున్నాను. ఆయన వినూత్నత తోను, సాహసం తోను జరిపిన జీవనయాత్ర లోని ముఖ్యమైన ఘట్టాలు భారతదేశం లోని సామాన్య యువత కు స్పూర్తిదాయకం గా నిలుస్తాయనడం లో నాకు ఎటువంటి సందేహం లేదు.

మిత్రులారా,

ఏదో చేయాలనే ఈ అభిప్రాయం; సంకటాల ను ఎదుర్కొని ముందుకు సాగాలనే ఇటువంటి యోచన; కొత్త క్షేత్రాల కు విస్తరించాలనే ఈ చిత్తవృత్తి ఇప్పటి కీ ప్రతి భారతీయ నవ పారిశ్రమికవేత్త గుర్తింపునకు సంబంధించిన విషయం. దేశం అభివృద్ధి చెందాలని, తన సామర్ధ్యాన్ని, విజయాలను విస్తరించాలని ప్రతి భారతీయ నవపారిశ్రామికవేత్త ఆత్రుత తో ఉన్నారు. ఒకవైపు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ గురించి మరియు మన ఆర్ధికాభివృద్ధి గమనాన్ని గురించి ఎంతగానో చెబుతున్న తరుణం లో నేను ఈ విషయాన్ని ఇంత నమ్మకం గా ఎలా చెప్తున్నానో అని మీరు ఆశ్చర్యపోతుండవచ్చు.

మిత్రులారా,

భారతీయ పరిశ్రమ పైన, మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది. పరిస్థితుల ను మార్చగలిగే మరియు ప్రతి సవాలు ను ఎదుర్కోవడానికి అవసరమైన సంకల్ప బలం భారతీయ పారిశ్రామిక రంగాని కి అంతర్నిహితం గా ఉందనేదే నాలోని విశ్వాసం. మరి ఈ రోజు న మనం కొత్త సంవత్సరం లో మరియు కొత్త దశాబ్దం లో అడుగుపెడుతున్నపుడు ఈ దశాబ్దం భారతీయ నవ పారిశ్రామికవేత్తలదని చెప్పడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు.

మిత్రులారా,

ఈ దశాబ్దం లో మనం దాటవలసిన ఒకే ఒక మైలు రాయి అయిదు ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్ధిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం. మన స్వప్నాలు, ఆకాంక్షలు మరియు లక్ష్యాలు అంతకన్నా పెద్దవి. మరి 2014 నుండి భారతీయ పరిశ్రమ కల లు సాకారం కావడానికి, దాని విస్తరణ ఎలాంటి అడ్డంకులు లేకుండా జరగడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయం లో తీసుకొన్న ప్రతి నిర్ణయం మరియు ప్రతి చర్య వెనుక ఉద్దేశం భారతదేశం లో పనిచేస్తున్న ప్రతి నవ పారిశ్రామికవేత్త కు ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపారం నిర్వహించుకొనేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం.

మిత్రులారా,

ప్రభుత్వం ఒక అడ్డంకి గా కాకుండా భారతదేశం, భారతీయులు మరియు పరిశ్రమ కృషి లో భాగస్వామి గా ఉన్నప్పుడు మాత్రమే దేశ ప్రజల నిజమైన బలం, శక్తిసామర్ధ్యాలు బయటకు వస్తాయి. దేశం ఈ పంథా ను ఎంచుకొంది. ఇటీవల స్థిరచిత్తం తో సంస్కరించడానికి, నీతినియమాల తో పనిచేయడానికి, పరివర్తన లో తీవ్రత కు మరియు దేశం లో ప్రక్రియ తో, వ్యవహార నైపుణ్యం తో పాలన జరిగేలా చూసేందుకు ఇటీవలి సంవత్సరాల లో నిరంతరాయం గా ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల ను అర్ధం చేసుకొని వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు జరిగాయి.

మిత్రులారా,

ఈ రోజులలో ఇన్ సోల్వన్సి ఎండ్ బ్యాంక్ రప్టసి కోడ్ (ఐబిసి)ని గురించి ఎక్కువ గా చర్చించడం జరుగుతోంది. ఇది కేవలం కోట్లాది సొమ్ము వ్యవస్థ లోకి సొమ్ము ను తిరిగి తీసుకు రావడానికి పరిమితమైంది ఏమీ కాదు. ఇది అంతకు మించింది. కొన్ని కేసుల లో వ్యాపారం మానివేయడమే విజ్ఞత అవుతుందని అనుకోవడం గురించి మీ అందరికీ తెలుసు. ఏదైనా ఒక కంపెనీ విజయవంతం గా పనిచేయక పొతే దాని వెనుక ఏదో కుట్ర ఉందని, లేక చెడు ఉద్దేశం ఉందని, దురాశ ఉందని అనుకోవడం కద్దు; కానీ అలా ఉండవలసిన అవసరం లేదు. అటువంటి నవ పారిశ్రామికవేత్తల ను ఆదుకోవడానికి ఏదైనా పరిష్కారాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఐబిసి అందుకు పునాదుల ను వేసింది. ఎంతో మంది భారతీయ నవ పారిశ్రామికవేత్తల ను ఐ బి సి ఏవిధంగా కాపాడింది, వారు నాశనం కాకుండా ఎలాగ వారిని ఆదుకొందనే విషయం పైన ఏదో ఒక రోజు న అధ్యయనం జరుగుతుంది.

మిత్రులారా,

ఇంతకుముందు భారతీయ పన్నుల వ్యవస్థ లో ఉండిన లోపాల గురించి మీకు తెలుసు. ఇన్స్ స్పెక్టర్ రాజ్, పన్నుల విధానం లో గందరగోళం, వివిధ రాష్ట్రాల లో పన్ను చెల్లింపుదారులపై దాడులు / వల పన్ని పట్టుకోవడం వంటి చర్యల వల్ల భారతీయ పరిశ్రమ వృద్ధి వేగాని కి అవరోధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు దేశం ఆ అవరోధాలన్నిటి ని తొలగించింది. మన పన్నుల వ్యవస్థ ను పారదర్శకంగా మార్చడానికి, సామర్ధ్యాన్ని పెంచడానికి, జవాబుదారీ ని పెంచడానికి పన్నుల శాఖ కు మరియు పన్ను చెల్లింపుదారుల కు మధ్య మానవ ప్రమేయం లేకుండా చేయడానికి ఒక కొత్త వ్యవస్థ ను సృష్టించడం జరుగుతోంది. ఈ రోజు దేశం లో కార్పోరేట్ పన్ను మరియు కార్పోరేట్ పన్ను రేటు లు అతి తక్కువగా ఉన్నాయి.

మిత్రులారా,

వస్తువులు మరియు సేవ ల పన్ను సంస్కరణలు లేక ప్రభుత్వరంగ బ్యాంకు ల సంస్కరణలు తేవాలని డిమాండ్ ఉండేది; వాటి ని అందరూ కోరారు. భారతీయ పరిశ్రమ ముందు ఉన్న అన్ని అడ్డంకుల ను తొలగించాలని మరియు పరిశ్రమ విస్తరణ కు అన్ని అవకాశాల ను కల్పించాలనే యోచన తో ఆ డిమాండుల ను తీర్చడం జరిగింది.

మిత్రులారా,

భారత ప్రభుత్వం కర్ర తీసుకొని నవ పారిశ్రామికవేత్తలను తరుముతోందన్న అభిప్రాయాన్ని కలిగించడానికి కొంత మంది వారి యొక్క శక్తి సామర్ధ్యాలను ఒడ్డి మరీ పని చేస్తున్నారు. అన్యాయాని కి, అవినీతి కి పాల్పడేందుకు వెనుకాడని వారి పైన చర్య తీసుకోవడాన్ని భారతీయ పరిశ్రమ కు వ్యతిరేకం గా కఠిన చర్య లు తీసుకోవడం గా కొంత మంది వర్ణిస్తున్నారు. భారతీయ పరిశ్రమ ఎటువంటి భయం లేకుండా పారదర్శక వాతావరణం లో, ఎటువంటి అడ్డంకులు లేకుండా పని చేసి ముందంజ వేయడం ద్వారా దేశాని కి, తమ కు సంపద ను సృష్టించేలా నిశ్చయం చేసేందుకు మేము ప్రయత్నించాము. భారతీయ పరిశ్రమ చట్టాల చిక్కు ల నుండి బయట పాడేందుకు నిరంతర ప్రయత్నాలను చేయడం జరిగింది. దాని ఫలితం గా 1500 కు పైగా పాతబడ్డ శాసనాల ను రద్దు చేయడం జరిగింది. గతం లో కంపెనీ ల చట్టాని కి సంబంధించి చిన్న చిన్న సాంకేతిక తప్పిదాల కు కూడా నవ పారిశ్రామికవేత్తల పై క్రిమినల్ చర్య లు తీసుకోవడానికి సంబంధించిన వివరాల లోకి నేను వెళ్ళదలచుకోలేదు. ఇప్పుడు అటువంటి తప్పుల ను నేరం గా పరిగణించడం లేదు. ఇప్పుడు కార్మిక న్యాయస్థానాల పని జరుగుతున్నది. వాటి పనితీరు ను కూడా సులభం చేయడం జరుగుతోంది. దానివల్ల అటు పరిశ్రమ కు, ఇటు శ్రామిక వర్గాల కు లేక కార్మికుల కు.. ఈ రెండు పక్షాల కు కూడాను ప్రయోజనం కలుగుతుంది.

మిత్రులారా,

భారతీయ ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేయడానికి దీర్ఘకాలిక పరిష్కారాల తో పాటు స్వల్పకాలిక చర్యల ను ఏక కాలం లో తీసుకోవడం జరుగుతోంది. దేశం లో ఇప్పుడు నిర్ణయాల ను ప్రస్తుతానికే మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాల కు ప్రయోజనం చేకూర్చేలా తీసుకోవడం జరుగుతోంది.

మిత్రులారా,

గడచిన అయిదు సంవత్సరాల లో చిత్తశుద్ధి తో పని చేసే వాతావరణం మరియు పూర్తి పారదర్శకత్వం దేశం లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. ఈ వాతావరణం దేశం ఉన్నత లక్ష్యాల ను నిర్దేశించుకోవడాన్ని మరియు వాటిని నిర్ణీత అవధి లో సాధించడాన్ని ప్రోత్సహించింది. భారతదేశం లో 21వ శతాబ్దం లో 100 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల తో మౌలిక సదుపాయాల ఏర్పాటు కు పనులు జరుగుతున్నాయి. ప్రజల కు జీవన సౌలభ్యాన్ని కల్పించేందుకు మరియు దేశ మానవ వనరుల పై పెట్టుబడి పెట్టేందుకు ప్రతి స్థాయి లో ప్రణాళికల ను రూపొందించడం జరిగింది. ప్రతి రంగం లో మునుపటి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వేగం తో పని జరుగుతోంది.

మిత్రులారా,

నేను చెప్తున్న ‘పరివర్తన తీవ్రత’ గణాంకాల లో కూడా కనిపిస్తోంది. అట్టడుగు స్థాయి నుండి పనిచేయడం వల్ల గత అయిదు సంవత్సరాల లో వ్యాపార నిర్వహణ సౌలభ్యం ర్యాంకుల లో భారతదేశం 79 స్థానాలు ఎగసింది. విధానాల రూపకల్పనలోను, నిర్ణయాలు తీసుకోవడం లోను వేగం దేశం లో నూతన ఆవిష్కరణ ల ప్రోత్సాహానికి దోహదపడింది. దాని ఫలితం గా కేవలం అయిదు సంవ్సతరాల లో ప్రపంచ నూతన ఆవిష్కరణ సూచీ లో భారతదేశం 20 స్థానాలు ఎగసింది. దానికి తోడు భారతదేశం సాధించిన మరొక ఘనత ఏమిటంటే ప్రపంచం లో వరుస సంవత్సరాల లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ను సాధించిన 10 అగ్రగామి దేశాల లో భారతదేశం కూడా ఒకటి కావడం.

మిత్రులారా,

గడచిన కొద్ది సంవత్సరాల లో దేశం లో మరో ముఖ్యమైన మార్పు చోటు చేసుకొంది. ఈ మార్పు యువ నవ పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుదల లో కనిపించింది. ఈ రోజు న దేశం లోని యువ నవ పారిశ్రామికవేత్త లు క్రొత్త యోచనల తోను, క్రొంగ్రొత్త వ్యాపార నమూనాల తోను ముందుకు వస్తున్నారు. గతం లో కేవలం ఉత్పత్తులు, గనుల తవ్వకం, భారీయంత్రాల తయారీ వంటి రంగాల పై దృష్టి ని కేంద్రీకరించే శకం ముగుస్తోంది. ఇప్పుడు మన యువత కొత్త రంగాల కు విస్తరిస్తున్నారు. మరి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ యువత దేశం లోని చిన్నపట్టణాల నుండి వచ్చి భారీ లక్ష్యాల ను సాధిస్తున్నారు.

మిత్రులారా,

అప్పట్లో దేశం లోని నవ పారిశ్రామికవేత్తల కు మరియు వారి వ్యాపార అభిరుచి కి బాంబే క్లబ్ ప్రాతినిధ్యాన్ని వహించేది. ఇప్పుడు అటువంటి క్లబ్ గనక ఏర్పాటైతే దాన్ని భారత్ క్లబ్ అని పిలవాలి. అది వివిధ రంగాల కు, వివిధ క్షేత్రాల కు, పాత దిగ్గజాల కు మరియు కొత్త పారిశ్రామికవేత్తల కు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశం లో మారుతున్న వ్యాపార సంస్కృతి, దాని విస్తరణ మరియు దాని సామర్ధ్యం మంచి ఉదాహరణ లు అవుతాయని నా నమ్మకం. అందువల్ల ఎవరైనా భారతదేశం యొక్క శక్తి ని తక్కువ అంచనా వేసినట్లయితే వారు పొరబాటు చేస్తున్నట్లు లెక్కకు వస్తుంది. నూతన సంవత్సరం ఆరంభం లో ఈ రోజు ఈ వేదిక మీది నుండి భారతీయ పారిశ్రామిక రంగాని కి నేను చెప్పేది ఏమిటంటే ఎటువంటి పరిస్థితులలోను నిరాశ నిస్పృహల ను మీలో ప్రవేశించనివ్వరాదు అనే. నవీనమైనటువంటి శక్తి తో ముందడుగు వేయండి. విస్తరణ దిశ లో మీరు ఎక్కడకు వెళ్ళినా, మీ ప్రతి అడుగు లో భారత ప్రభుత్వం మీతో భుజం భుజం కలిపి నడుస్తుంది. అవును, దీనిని మరికొంత వివరిస్తాను. లక్ష్మణ్ రావు గారి జీవితం నుండి స్పూర్తి ని పొంది మీ మార్గాన్ని ఎంచుకోండి.

మిత్రులారా,

దేశం అందించిన స్పూర్తిదాయక వ్యక్తుల లో లక్ష్మణరావు గారు ఒకరు. సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం లో, భారతీయ అవసరాల కు తగినట్లుగా యంత్రాల ను తయారు చేయడం లో వారు ఆద్యులు. దేశ అవసరాలు అనే భావన భారతదేశం యొక్క అభివృద్ధి గతి ని, భారతీయ పరిశ్రమ అభివృద్ధి ని త్వరితం చేస్తుంది. ‘జీరో డిఫెక్ట్, జీరో ఇఫెక్ట్’ అనే మంత్రాన్ని అనుసరించి మనం ప్రపంచ శ్రేణి ఉత్పత్తుల ను తయారు చేయాలి. అప్పుడు మాత్రమే మనం మన ఎగుమతుల ను పెంచుకోగలం మరియు ప్రపంచ స్థాయి లో మన విపణి ని విస్తరించుకోగలం. ప్రపంచానికి అనువర్తించే విధం గా భారతీయ పరిష్కారాల ను మనం యోచించాలి మరియు మన ప్రణాళికల ను ఆ విధంగా అమలు చేయాలి. ఈ సందర్భం లో నేను ఇక్కడ రెండు పథకాల ను గురించి చర్చించదలచాను. ఆర్ధిక లావాదేవీల కు సంబంధించిన యుపిఐ పథకం ఒకటోది కాగా దేశవ్యాప్తంగా ఎల్ఇడి బల్బుల ను అందించడానికి సంబంధించిన ఉజాలా పథకం రెండోది.

మిత్రులారా,

ప్రస్తుతం భారతదేశం బ్యాంకు లావాదేవీలు త్వరగా జరగాలని కోరుకుంటోంది. అలాగే అన్నిటి కన్నా ఉత్తమమైనటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించాలని కూడా కోరుకొంటోంది. రోజు రోజు కు పెరుగుతున్న యుపిఐ యంత్రాంగం, ఆ కోరిక ను కేవలం మూడు సంవత్సరాల లో తీర్చివేసింది. ఇవాళ దేశం లో పరిస్థితి ఏమిటంటే దేశ ప్రజలు ప్రతి వారం లో ప్రతి గంటా (24×7) ఆన్ లైన్ లావాదేవీల ను జరుపుతున్నారు. ఈ రోజు న భీమ్ యాప్ అనేది ఒక బ్రాండ్ పేరు గా మారిపోయింది.

మిత్రులారా,

యుపిఐ ద్వారా 2018-19 ఆర్ధిక సంవత్సరం లో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల లావాదేవీ లు జరిగాయి. వర్తమాన ఆర్ధిక సంవత్సరం లో డిసెంబర్ వరకు సుమారు 15 లక్షల కోట్ల రూపాయల లావాదేవీ ల ను యుపిఐ ద్వారా చేయడం జరిగింది. దేశం ఎంత వేగం గా డిజిటల్ లావాదేవీల ను అనుసరిస్తున్నదీ మీరు అంచనా వేసుకోవచ్చును.

మిత్రులారా,

తక్కువ విద్యుత్తు ను వినియోగించుకొంటూ, తక్కువ ఖర్చు లో ఎక్కువ కాంతి ని ఇచ్చేది దేశాని కి కావలసింది. ఈ అవసరం ఉజాలా పథకం పుట్టుక కు దారితీసింది. ఎల్ఇడి బల్బు ల తయారీ ని ప్రోత్సహించడానికి తగిన చర్యల ను తీసుకోవడం జరిగింది. తదనుగుణం గా విధానాల లో మార్పు లు జరిగాయి. దాని ఫలితం గా బల్బు ధర తగ్గింది. ఒకసారి దాని ప్రయోజనాలు ప్రజల అనుభవం లోకి వచ్చాక బల్బుల కు డిమాండ్ పెరిగింది. ఉజాలా పథకం నిన్ననే అయిదు సంవత్సరాలను పూర్తి చేసుకొంది. దేశవ్యాప్తం గా 36 కోట్ల ఎల్ఇడి బల్బుల ను పంపిణీ చేయడం మనందరికి అపారమైన సంతృప్తి ని ఇచ్చేటటువంటి అంశం. అంతేకాకుండా ఈ కార్యక్రమం గత అయిదు సంవత్సరాలు గా నడుస్తూ వీధి దీపాల వ్యవస్థ ను ఎల్ఇడి బల్బుల పై ఆధారపడే విధం గా మార్చింది. దీని లో భాగం గా ఇప్పటి వరకు ఒక కోటి కి పైగా ఎల్ఇడి వీధి దీపాలను ఏర్పాటు చేయడమైంది. ఈ ఉభయ ప్రయత్నాల కారణం గా దాదాపు 5,500 కోట్ల కిలోవాట్ / అవర్ మేర విద్యుత్తు ప్రతి సంవత్సరమూ ఆదా అవుతున్నది. ఫలితం గా ప్రతి ఏటా వేల కోట్ల కొద్దీ రూపాయల విద్యుత్తు కొనుగోలు వ్యయం మిగులుతోంది. అంతేకాక బొగ్గుపులుసు వాయువు ఉద్గారం లో సైతం భారీ తగ్గుగల కనిపించింది. భారతదేశం లో పుట్టిన, యుపిఐ గాని లేక ఉజాలా గాని, అటువంటి నూతన ఆవిష్కరణ లు ప్రపంచం లో అనేక దేశాల కు స్పూర్తిదాయకం గా మారుతున్నట్లు తెలిస్తే మనం అందరం కూడా ఎంతో సంతోషిస్తాం.

మిత్రులారా,

అటువంటి విజయ గాధ లు మరియు మేక్ ఇన్ ఇండియా వంటి ప్రచారోద్యమాలే మన పరిశ్రమ కు ఉన్న బలం. భారతీయ పరిశ్రమ లోని ప్రతి క్షేత్రం నుండి అటువంటి విజయ గాధ లు పుట్టాలని నేను కోరుకుంటున్నాను. జల్ జీవన్ మిశన్, అక్షయ శక్తి, విద్యుత్తు తో పని చేసే వాహనాలు, ప్రకృతి వైపరీత్యాల ను ఎదుర్కోవడం లేక రక్షణ వంటి ప్రతి రంగం లో ఎన్నో విజయ గాధ లు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రతి క్షేత్రం లో, మీ ప్రతి అవసరం లో ప్రభుత్వం మీతో ఉంది.

దేశం లో ప్రస్తుతం నెలకొన్న ఈ సానుకూల వాతావరణం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందండి; నిరంతరం నూతన ఆవిష్కరణ లకు పాటు పడి పెట్టుబడుల ను పెట్టండి; మరి జాతి సేవ కు తోడ్పాటు ను అందించండి. ఈ అపేక్ష తో నేను నా ప్రసంగాన్ని ముగిస్తూ, కిర్లోస్కర్ గ్రూపు వారి కి మరియు కిర్లోస్కర్ కుటుంబాని కి శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. శత వార్షికోత్సవాల సందర్భం గా కూడా మీకు అభినందన లు తెలియజేస్తున్నాను.

మీకు ధన్యవాదాలు.