Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాశీ విశ్వనాథ్ ఆలయం లో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు

కాశీ విశ్వనాథ్ ఆలయం లో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు

కాశీ విశ్వనాథ్ ఆలయం లో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు

కాశీ విశ్వనాథ్ ఆలయం లో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లోని కాశీ విశ్వనాథ్ ఆలయం లో అర్చనలు చేశారు. కాశీ విశ్వనాథ్ ఆలయం లో ప్రతీకాత్మకం గా భూమి పూజ కార్యక్రమం జరిగిన అనంతరం, జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాశీ విశ్వనాథ్ ధామ్ పథకం తో అనుబంధం ఏర్పడినందుకు నిజానికి తాను ఆశీర్వాదం లభించినట్టు భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ పథకం తో ప్రమేయం ఉన్నటువంటి అధికారులు వారికి అప్పగించిన కార్యాన్ని సమర్పణ భావంతో పూర్తి చేసినందుకు వారి ని ఆయన అభినందించారు. ఆలయం చుట్టుపక్కల ఆస్తి ని కలిగివున్నటువంటి వారు, దానిని ఈ పథకం కోసం భూ సేకరణ కు అనుమతించినందుకుగాను వారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

కాశీ విశ్వనాథ్ ఆలయం శతాబ్దాల తరబడి జరిగిన పరిణామాల కు తట్టుకొని మనగలిగిందని ఆయన చెప్పారు. రెండు శతాబ్దాల కిందట కాశీ విశ్వనాథ్ ఆలయం సంబంధిత కృషి ని చేసిన రాణి అహిల్యబాయి హోల్కర్ ను ఆయన గుర్తు కు తెచ్చి, రాణి ని ప్రశంసించారు.

అప్పటి నుండి ఆలయం చుట్టూరా ఉన్న యావత్తు ప్రాంతాన్ని గురించి అధికారం లో ఉన్న వారు పెద్ద గా ఆలోచన చేసిందంటూ ఏమీ లేదు అని ఆయన అన్నారు.

కాశీ విశ్వనాథ్ ఆలయం సమీపంలో సుమారు 40 ఆలయాలు ఉన్నాయని, అవి కాల క్రమం లో అతిక్రమణ కు లోనయ్యాయని, మరి ప్రస్తుతం వాటిని ఆ అతిక్రమణ బారి నుండి విముక్తం చేయడం జరిగిందని ఆయన చెప్పారు. యావత్తు ఆలయ సముదాయం ప్రస్తుతం పునశ్శక్తి ని సంతరించుకొనే ప్రక్రియ లో ఉందని, ఫలితాలు కంటి కి కనుపిస్తున్నాయని ఆయన చెప్పారు. గంగా నది కి మరియు కాశీ విశ్వనాథ్ ఆలయానికి నడుమ ఒక నేరు లంకె ను ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన అన్నారు.

ఈ పథకం మరేదైనా చోటు లో ఇదే తరహా పథకాల కు ఒక నమూనా గా మారగలుగుతుందని, మరి అలాగే కాశీ కి ప్రపంచ స్థాయి లో ఒక నూతన గుర్తింపు ను ఇస్తుందని ఆయన అన్నారు.