ఈ సంవత్సరంలో నిర్వహిస్తున్న కాశీ తమిళ సంగమం-2025 లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
కాశీ తమిళ సంగమం మొదలైందని శ్రీ మోదీ అన్నారు. కాశీకి, తమిళనాడుకు మధ్య చిరకాలంగా కొనసాగుతూ వస్తున్న నాగరికత పరమైన బంధాలను ఒక సంబురంగా జరుపుకొనే వేదిక ఇది అని ప్రధాని అభివర్ణించారు. శతాబ్దాల నుంచి వర్ధిల్లుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చరిత్ర ప్రసిద్ధ సంబంధాల్ని ఈ ఉత్సవం ఒక చోటుకు తీసుకువస్తోందని కూడా ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘కాశీకి, తమిళనాడుకు మధ్య ఉన్న చిరకాల నాగరికత పరమైన బంధాలను ఒక సంబురంలా జరుపుకొనే వేదిక ఇది. ఈ వేదిక, వందల సంవత్సరాలుగా వర్ధిల్లుతూ వస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చరిత్ర ప్రసిద్ధ సంబంధాల్ని ఒకేచోటులో మన సమక్షానికి తీసుకువస్తోంది. ఈ ఉత్సవం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావనను సైతం ప్రధానంగా చాటిచెబుతోంది.
కాశీ తమిళ సంగమం-2025 లో పాలుపంచుకోండి అంటూ మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
@KTSangamam”
Kashi Tamil Sangamam begins…
— Narendra Modi (@narendramodi) February 15, 2025
A celebration of the timeless civilizational bonds between Kashi and Tamil Nadu, this forum brings together the spiritual, cultural and historical connections that have flourished for centuries. It also highlights the spirit of ‘Ek Bharat, Shrestha…