Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాశీలో దేవ దీపావళి వేడుకల సుందర దృశ్యాలను పంచుకున్న ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కాశీలో దేవ దీపావ‌ళి వేడుక‌ల సుందర దృశ్యాలను ప్రజానీకంతో క్లుప్తంగా పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“కాశీలో దేవ దీపావళి వేడుకలు అద్భుతం.. అలౌకికం.. ఉత్కంఠభరితం! ఈ పవిత్ర, ప్రాచీన నగరంలో వేడుకలపై క్లుప్తంగా నా మనోభావమిది.” అలాగే…

“ఈ దేవ దీపావళి ప్రత్యేకమైనదేగాక కాశీలో ఇదొక చిరస్మరణీయ వేడుక.. నిత్యసత్యమైన కాశీ నగరంలో వెలుగులీనిన ఈ అద్భుత చిత్రాలను తిలకించి పులకించండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.