Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015

కాలిఫోర్నియాలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కార్యక్రమాలు- సెప్టెంబర్ 27, 2015


ఫేస్ బుక్:

కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ఫేస్ బుక్ సీఈవో శ్రీ మార్క్ జుకర్ బర్గ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని వివిధ అంశాలపై వచ్చిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. భారత దేశాన్ని 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రస్తుత ప్రపంచం భారత్ వైపు ఎందుకు చూస్తున్నదనే విషయంపైనా ప్రధాని వివరంగా మాట్లాడారు. గతంలో యాపిల్ సంస్థ సీఈవో శ్రీ స్టీవ్ జాబ్స్ ఓ సందర్భంలో తనకు ఇచ్చిన సలహాను ఫేస్ బుక్ సీఈవో శ్రీ మార్క్ జుకర్ బర్గ్ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాని శ్రీ మోదీకి వివరించారు. భారత దేశంలో ఓ దేవాలయాన్ని సందర్శిస్తే మేలు జరుగుతుందని శ్రీ స్టీవ్ జాబ్స్ సలహా ఇచ్చారని శ్రీ జుకర్ బర్గ్ ప్రధాని శ్రీ మోదీకి చెప్పగానే ప్రధాని వెంటనే స్పందించి శాస్త్రానికి, ఆధ్యాత్మికతకు గల ప్రత్యేకమైన బంధాన్ని ప్రస్తావించారు. గత పదిహేను నెలలుగా భారత దేశంపట్ల తమకుగల అభిప్రాయాన్ని ప్రీపంచ దేశాలు మార్చుకున్నాయని అన్నారు.

సోషల్ మీడియా, ఇంటర్ నెట్ సాంకేతికత పరిపాలనకు ఉపయోగపడుతున్నాయా? ప్రీజలతో కనెక్ట్ కావడానికి సహకరిస్తున్నాయా? అన్న ప్రశ్నకు స్పందించిన ప్రధాని, తన పాలనలో సోషల్ మీడియా సహకారాన్ని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్ వస్తోందని దీనికి కారణం సోషల్ మీడియానే అని ఆయన అన్నారు. చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వియ్బూతో తనకు గల అనుభవాన్ని ప్రధాని వివరిస్తూ ఇజ్రాయిల్ ప్రజలకు ట్విట్టర్ ద్వారా పంపిన అభినందనల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. హనుక్కా పండగ సందర్భంగా తాను ఇజ్రాయిల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతాన్యాహూకు హిబ్రూ భాషలో అభినందనల్ని తెలిపానని అందుకు ప్రతిగా ఆయన హిందీలో స్పందించారని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. దౌత్యరంగంలో ఇది సరికొత్త కోణమని ఆయన అన్నారు. టౌన్ హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రధాని తన తల్లిదండ్రులను గుర్తుచేసుకొని మాట్లాడుతూ ఉద్వేగభరితులయ్యారు. తన తల్లితో తనకు గల అనుబంధాన్నిపిల్లల్ని పెంచడానికి ఆమె పడ్డ కష్టాన్ని ప్రధాని జ్ఞాపకం చేసుకున్నారు. కష్టాలు కన్నీళ్లు పోరాటాలు తన తల్లికే పరిమితమైనవి కావని భారతదేశంలోని మాతృమూర్తులందరూ నిత్యం జీవన పోరాటం చేస్తారని టౌన్ హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన అన్నారు. పరిపాలనలో మహిళల్ని భాగస్వాములను చేయాలనే తన నిబద్ధతను ప్రస్తావించారు..

గూగుల్:

ప్రసిద్ధి చెందిన గూగుల్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానిని గూగుల్ సీఈవో శ్రీ సుందర్ పిచాయ్ సాదరంగా ఆహ్వానించి తమ కార్యకలాపాలను వివరించారు. గూగుల్ సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రధానికి చూపారు. ఈ కార్యక్రమంలో ఐటీ దిగ్గజాలైన శ్రీ ఎరిక్ స్కిమిడ్, శ్రీ లారీ పేజ్ పాల్గొన్నారు. గూగుల్ మ్యాప్ సాంకేతికతద్వారా ప్రపంచంలోని ఎక్కడి వీధులనైనా దగ్గరగా చూడొచ్చని, ఈ సాంకేతికతను ప్రధానికి గూగుల్ ప్రతినిధులు వివరించారు. గూగుల్ ఎర్త్లో ఖగౌల్ ను గుర్తించాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధులను కోరారు. ఆయన ఇలా కోరడం వెనక ఒక ప్రత్యేక కారణం ఉంది. బిహార్ రాజధాని పాట్నాకు దగ్గరగా ఉండే ఖగౌల్ అనే ప్రాంతం ఒకప్పుడు చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడే భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఖగోళ పరిశోధకుడు ఆర్యభట్టకు పరిశోధనాలయం ఉండేది.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పునర్ వినియోగ ఇంధన వనరుల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం:

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆ దేశ ఇంధన శాఖ మంత్రి శ్రీ ఎర్నెస్ట్ మోయిన్జ్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన పునర్ వినియోగ ఇంధన వనరుల అంశంపై ఏర్పాటయిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి శ్రీ ఎర్నెస్ట్ మోయిన్జ్, ఇంధన శాఖ మాజీ మంత్రి ప్రొఫెసర్ చూ పాల్గొన్నారు. ఈ రంగానికి చెందిన పలు కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరిలో సన్ ఎడిసన్ సిఈవో శ్రీ అహ్మద్ చాటిలా, సాప్ట్ బ్యాంక్ సీఈవో, అధ్యక్షుడు నిఖేష్ అరోరా, బ్లూమ్ ఎనర్జీ సీఈవో కె.ఆర్ శ్రీధర్, సోలాజైమ్ సీఈవో జొనాథన్ వూల్ఫ్ సన్, వెంచర్ క్యాపిటలిస్టు జాన్ డోయర్, డిబిఎల్ పార్టనర్స్కు చెందిన ఇరా ఎహ్రెన్ ప్రియస్ ఉన్నారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అరుణ్ మజుందార్, ప్రొఫెసర్ రోజర్ నాల్, డాక్టర్ అంజని కొచ్ఛర్, ప్రొఫెసర్ శాలీ బెన్సన్ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఈ రంగానికి సంబంధించిన విలువైన సూచనలు చేశారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఇంధనాన్ని అందించడానికి భారతదేశం చేస్తున్నకృషిని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ అభినందించారు. భారతదేశం భవిష్యత్ లో క్లీన్ ఎనర్జీ క్యాపిటల్గా అవతరిస్తుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. విద్యుత్ నిలువను తక్కువ ఖర్చుతోనే చేయగలిగే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది కాబట్టి భవిష్యత్లో పునర్ వినియోగ ఇంధనమనేది తక్కువ ధరకే లభిస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకర ఇంధన వినియోగ విషయంలో భారతదేశంలోని నగరాలు, రాష్ట్రాలు ముందంజ వేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. భారతదేశం 175 గిగావాట్ల పునర్ వినియోగ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న గ్రిడ్ సరిపోదని ఈ విషయంలో మరింత సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. 175 గిగా వాట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రైవేటు రంగ పెట్టుబడులు అవసరమని నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయంలో వారు ఇజ్రాయిల్ ను ఉదాహరణగా తీసుకొని ఆ దేశం ప్రైవేటు పెట్టుబడుల సాయంతో నీటికొరతను ఎలా ఎదుర్కొన్నది వివరించారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్న ప్రధాని 175 గిగావాట్ల పరిశుభ్రమైన పునర్ వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి నిబద్ధతతో పని చేస్తామని స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టడానికి ఈ రంగంలో చక్కటి అవకాశాలున్నాయని రైల్వే రంగంలో నూరుశాతం ఎఫ్డిఐ కు అనుమతి ఉంది కాబట్టి దాని ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన వివరించారు. దేశంలోని డిస్కంల క్రమబద్దీకరణ, వాటి ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. పునర్ వినియోగ ఇంధన రంగంలో భారతదేశం చేపట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రధాని వివరించారు. కేరళ రాష్ట్రంలోని కోచి విమానాశ్రయం సౌర విద్యుత్ సాయంతో పని చేస్తున్నదని చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో కాలువకు సోలార్ ప్యానెళ్లను అమర్చామని అన్నారు. త్వరలోనే జార్ఖండ్ రాష్ట గిరిజన ప్రాంతంలోని ఓ జిల్లా కోర్టు పూర్తిగా సౌర విద్యుత్ తోనే పని చేయబోతున్నదన్నారు. బొగ్గును గ్యాస్గా మార్చే ప్రక్రియపైన పరిశోధన జరుగుతోందని దీన్ని ప్రధానమైన పరిశోధనగా భావించామని అన్నారు. రాబోయే పది సంవత్సరాల్లో పునర్ వినియోగ ఇంధన విప్లవం వస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

స్టార్టప్ కనెక్ట్:

ఔత్సాహికుల సృజనకు పట్టంకట్టే ప్లాట్ఫామే స్టార్టప్ కనెక్ట్. ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. భారతీయ సృజనశీలుర వైవిధ్యతను ఇది వెలికి తీస్తోంది. భారత దేశంలో స్టార్టప్స్ ప్రాధాన్యతను, వాటి విషయంలో తమ ప్రభుత్వానికి ఉన్న ముందు చూపుపై ప్రధాని సవివరంగా మాట్లాడారు.

సాంకేతికతను ఆయా సందర్భాలకు అనుగుణంగా వాడుకోవడం, పలు వైవిధ్యమైన రంగాల్లో అది ఇమిడిపోయేలా చేయడం, స్వరూప స్వభావాల పంపిణీ, ఒక మంచి ఆలోచనకు లభించే మద్దతు..ఇవన్నీ వ్యాపారరంగంలో కొత్త ప్రపంచాన్ని సృష్టించాయని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఆరోగ్యకరమైన వ్యవస్థంతా సిలికాన్ వ్యాలీలోనే జన్మించిందని మోదీ వివరించారు. ఈ ప్రపంచానికి సరికొత్త రూపునిచ్చే పనిలో కాలిఫోర్నియా కమ్యూనిటీదే ప్రముఖ పాత్రని ప్రధాని ప్రశంసించారు. సాంకేతికత రంగంలోని పెద్ద పెద్ద కంపెనీలే కాదు చాలా చిన్నవాళ్లు కూడా తమ అద్భుతమైన ఆలోచనలతో, కళాత్మకతతో మానవ జీవితాన్ని ఉన్నతీకరిస్తున్నారని ప్రధాని అన్నారు. ఇదే అమెరికా విజయానికి ప్రధాన కారణం. ఇదే ప్రపంచానికి స్ఫూర్తినిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. స్టార్టప్స్, సాంకేతికత, నూతన పరిశోధనలు భారతదేశాన్నిమార్చేయబోతున్నాయనేది నా నమ్మకం. యవతకు ఉద్యోగాల కల్పన తప్పకుండా జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎనభై కోట్ల మంది ప్రజలు 35 సంవత్సరాల లోపు వారే. వారు మారడానికి అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త జీవితాన్ని అందుకోవడానికి కావలసిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం వారిలో ఉంది. దేశంలోని ఐదువందలకు పైగా ఉన్న పట్టణాల్లో ప్రతి పట్టణం పది స్టార్టప్లను దేశానికి అందించబోతోంది…అదే సమయంలో దేశంలోని ఆరులక్షల గ్రామాలను తీసుకోండి.. ప్రతి గ్రామం ఆరు చిన్న వ్యాపారాలను కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఆర్ధిక ప్రగతి భారీగా ఊపందుకుంటుంది. లక్షలాది ఉద్యోగాల కల్పన జరిగి తీరుతుంది. భారతదేశానికి సరిపోయేలా స్టార్టప్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఉరిమే ఉత్సాహం, వ్యాపార దక్షత, పరిశోధనా పటిమగల బారతీయ యువతీయువకులు వీటిని ముందుకు తీసుకుపోతున్నారంటూ ఈ సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భారత్ ఫండ్-బెటర్ హెల్త్, అగ్రికల్చర్, రిన్యూవబుల్స్ అండ్ టెక్నాలజీస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడు పరస్పర అవగాహనా పత్రాలపై సంతకాలు జరిగాయి.

భారత కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగం:

శాప్ వేదికమీదనుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం, అమెరికాల మధ్య గల భాగస్వామ్యం గురించి .. ప్రజాస్వామ్యం, పరిశోధనారంగంలో ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్న సహాయం గురించి వివరించారు. గత పదిహేను మాసాలుగా తన ప్రభుత్వం పని చేస్తున్న విధానంపై వారికి అవగాహన కల్పించారు. సిలికాన్ వ్యాలీలో పని చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు దేశానికి చేస్తున్న సేవల్ని ప్రధాని ప్రశంసించారు. వారు సిలికాన్ వ్యాలీలో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి మంచి పేరును సంపాదిస్తున్నారని ప్రధాని అభినందించారు.