Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కార్డియాక్ సర్జన్ డాక్టర్ కె.ఎం. చెరియన్ మృతికి ప్రధానమంత్రి సంతాపం


ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ కె.ఎం. చెరియన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘మన దేశంలోో గుండెకు సంబంధించిన అత్యంత ప్రముఖ శస్త్ర వైద్యుల్లో ఒకరైన డాక్టర్ కె.ఎం. చెరియన్ మనను వీడి వెళ్లారని తెలిసి బాధ పడ్డాను. హృదయవ్యాధి చికిత్స రంగానికి ఆయన అందించిన సేవ ఎప్పటికీ మహత్తరమైందే. ఆయన ఎంతో మంది ప్రాణాలను రక్షించడం ఒక్కటే కాకుండా, రాబోయే కాలంలో వైద్యులుగా ఎదిగే అవకాశం ఉన్న ఎంతో మందికి గురువుగా కూడా మెలిగారు. టెక్నాలజీ, నవకల్పన.. వీటికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం సదా గుర్తుపెట్టుకోదగ్గది. ఆయన కుటుంబానికి, ఆయన మిత్రులకు ఈ దు:ఖ ఘడియలో మన:స్థైర్యాన్నివ్వాల్సిందిగా దైవాన్ని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ (@narendramodi)”

 

 

***

MJPS/SR