Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో  లాన్ బౌల్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకుగాను  లవ్ లీ చౌబే, పింకీ సింహ్,నయన్ మోనీ సైకియా మరియు రూపా రాణీ తిర్కీ గారు లను ప్రశంసించినప్రధాన మంత్రి


బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో లాన్ బౌల్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను లవ్ లీ చౌబే, పింకీ సింహ్, నయన్ మోనీ సైకియా మరియు రూపా రాణీ తిర్కీ గారు లను ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘బర్మింగ్ హమ్ లో చరిత్రాత్మకమైన గెలుపు లభించింది. లాన్ బౌల్స్ క్రీడ లో ప్రతిష్టాత్మక పసిడి పతకాన్ని సంపాదించి స్వదేశాని కి తీసుకు వస్తున్నటువంటి లవ్ లీ చౌబే, పింకీ సింహ్, నయన్ మోనీ సైకియా మరియు రూపా రాణీ తిర్కీ లను చూసుకొని భారతదేశం గర్వపడుతున్నది. జట్టు ఘనమైన ప్రావీణ్యాన్ని చాటింది, దీనితో పాటు జట్టు క్రీడాకారిణుల యొక్క సాఫల్యం మరింత మంది భారతీయుల కు లాన్ బౌల్స్ ఆట ను ఎంపిక చేసుకొనేందుకు ప్రేరణ ను కూడా అందించగలదు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH