Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మెన్స్ 10,000 మీటర్ రేస్ వాక్ లో కంచుపతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సందీప్ కుమార్ కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి


కామన్ వెల్థ్ గేమ్స్, 2022 లో మెన్స్ 10,000 మీటర్ రేస్ వాక్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సందీప్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘బర్మింగ్ హమ్ గేమ్స్ లో మన రేస్ వాకింగ్ దళం రాణించడం బాగుంది. 10,000 మీ. స్పర్ధ లో కాంస్య పతకాన్ని శ్రీ సందేప్ కుమార్ గెలుచుకొన్నందుకు ఇవే అభినందన లు. ఆయన భావి ప్రయాసల లో చక్కని ఫలితాల ను సాధించాలని నేను కోరుకొంటూ, శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.