Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు వెయిట్ లిఫ్టర్ శ్రీ అచింత్ శివులి కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి


బర్మింగ్ హమ్ లో జరుగుతున్నటువంటి కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు వెయిట్ లిఫ్టర్ శ్రీ అచింత్ శివులి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. భారతదేశం క్రీడాకారిణుల మరియు క్రీడాకారుల దళం కామన్ వెల్థ్ గేమ్స్ కు బయలుదేరివెళ్లే సందర్భంలో ఇటీవల శ్రీ అచింత్ శివులి తో శ్రీ నరేంద్ర మోదీ తాను జరిపిన సంభాషణ తాలూకు వివరాల ను కూడా శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

 

‘‘ప్రతిభావంతుడైన శ్రీ అచింత్ శివులి కామన్ వెల్థ్ గేమ్స్ లో పసిడి పతకాన్ని గెలిచారు. ఈ సంగతి తెలిసి సంతోషిస్తున్నాను. ఆయన తన యొక్క శాంతియుత స్వభావానికి మరియు దృఢత్వానికి గాను పేరు తెచ్చుకొన్నారు. ఈ విశిష్ట కార్యసాధనకై ఆయన చాలా కఠోరం గా శ్రమించారు. ఆయన తన భావి ప్రయాసల లో రాణించాలి అని నేను కోరుకొంటూ ఆయన కు ఇవే శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.’’

 

‘‘మన క్రీడాకారిణుల మరియు క్రీడాకారుల దళం కామన్ వెల్థ్ గేమ్స్ కు బయలుదేరి వెళ్లే కంటే ముందు గా అచింత్ శివులి గారి తో నేను మాట్లాడాను. ఆయన తన తల్లి గారి నుంచి మరియు సోదరుడి నుంచి అందుకొన్న సమర్థన ను గురించి మేం చర్చించాం. ఆయన ఇప్పుడు ఒక పతకాన్ని చేజిక్కించుకొన్నారు కాబట్టి ఇక ఒక సినిమా ను చూసేందుకు ఆయన కు అవకాశం లభిస్తుందని నేను ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST