Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాన్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోని 6.5628 ఎకరాల రక్ష‌ణ శాఖ భూమిని పాఠశాల భవన నిర్మాణం కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కు లీజు పై బదలాయించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


కాన్పూర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (ఎఎఫ్ఎస్ కాన్పూర్) కు చెందిన 6.5628 ఎకరాల రక్ష‌ణ శాఖ భూమిని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) కు లీజు పై బదిలీ చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ అధ్యక్ష‌తన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ భూమిని పాఠశాల భవనం నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. అంతేకాకుండా ఇంతకు ముందు ఎఎఫ్ఎస్, కాన్పూర్ లో 8.90 ఎకరాల రక్ష‌ణ శాఖ భూమిని కెవిఎస్ కు బదిలీ చేసేందుకు ఆమోదం తెలుపుతూ 2011 జూన్ 16వ తేదీన తీసుకున్న నిర్ణయాన్ని పాక్ష‌ికంగా సవరిస్తూ పాఠశాల సంబంధిత ఇతరేతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించనున్నారు.

రక్ష‌ణ శాఖ భూమిని ఈ విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ విధానానికి లోబడి ఎటువంటి లాభం లేకుండా సంవత్సరానికి ఒక రూపాయి నామమాత్రపు అద్దెకు లీజు ప్రాతిపదికన బదిలీ చేయడం జరుగుతోంది. పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కెవిఎస్ తన సొంత నిధులతో మరియు తనదైన నియమాల ప్రకారం నిర్మించనుంది.

ఎఎఫ్ఎస్ కాన్పూర్ లో కేంద్రీయ విద్యాలయ 1985 ఆగస్టు నుండి ఒక తాత్కాలికమైన బారకాసు తరహా వసతి సముదాయంలో విధులను నిర్వహిస్తూ వస్తోంది. ఈ వసతి ఒక బడికి నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేదు. అంతకంతకు పెరుగుతున్న విద్యార్థుల అవసరాలను ప్రస్తుత వసతి సదుపాయం పూర్తిగా తీర్చలేకపోతోంది. తాజాగా భూమిని బదలాయించడంతో విద్యార్థులకు, టీచర్లకు.. ఈ ఇరు పక్ష‌ాలకు.. కావలసిన సౌకర్యాలతో తన సొంత పాఠశాల భవనాన్ని నిర్మించుకొనే అవకాశాన్ని కెవిఎస్ కు కల్పించినట్లు అవుతుంది.

భూమిని కెవిఎస్ కు బదలాయించడానికి సంబంధించిన లాంఛనాలు రెండు నెలల లోపల పూర్తి కానున్నాయి. ఆ తరువాత కెవిఎస్ తన ప్రత్యేక లక్ష‌ణాల ప్రకారం సొంత ఖర్చుతో పాఠశాల భవనాలను, ఇతర సదుపాయాలను నిర్మిస్తుంది.