కాకినాడ లోని నౌకాదళ సంబంధి భూమి గుండా వెళ్లే స్టేట్ హైవే-149 దారి మళ్లింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందుకు సంబంధించి ఈ కింద పేర్కొన్న నిర్ణయాలను కూడా తీసుకొన్నారు:-
ఎ. కాకినాడ లో నౌకాదళ సంబంధి భూమి గుండా వెళ్తున్న ప్రస్తుత హైవే కింద ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన 11.25 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం.
బి. కాకినాడ లోని 5.23 ఎకరాల నౌకాదళ సంబంధి భూమిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం.
సి. ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సంబంధించిన మరియు భూమి కొనుగోలుకు అనువుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపరిహారంగా రూ.1882.775 లక్షలు చెల్లించడం.
కాకినాడ లో స్టేట్ హైవే యొక్క మార్గం మళ్లింపు ఫలితంగా ఆటంకాలు ఉండని శిక్షణ సాధ్యపడుతుంది. ప్రమాదాలు తగ్గుతాయి; అంతే కాక సంస్థ భద్రతలో మెరుగుదలకు వీలు ఉంటుంది. జల స్థల సంగ్రామ శిక్షణ కేంద్రం యొక్క మరియు సంబంధిత మౌలిక సదుపాయాల యొక్క రక్షణను, భద్రతను ఇది పటిష్టం చేయగలుగుతుంది.