Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాంస్య పతకాన్ని గెలిచిన జూడో క్రీడాకారుడు శ్రీ కపిల్ పరమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు


 

 పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల 60 కిలో గ్రాముల జె1 పోటీలో  క్రీడాకారుడు శ్రీ కపిల్ పరమార్ కంచు పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ఆయనకు అభినందనలను తెలియజేశారు.

శ్రీ కపిల్ పరమార్ ఆట తీరు మరవరానిదిగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొంటూ, భావి ప్రయత్నాలలోనూ ఆయన రాణించాలని ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘చాలా స్మరణీయమైన క్రీడా ప్రదర్శన; అంతేకాదు, ఒక విశిష్ట పతకమిది.

కపిల్ పరమార్ కు అభినందనలు,  పారాలింపిక్స్  లో జూడో పోటీలో పతకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయునిగా నిలిచారాయన.  పారాలింపిక్స్ 2024 (#Paralympics2024)లో పురుషుల 60 కిలోల జె1 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచినందుకు ఆయనకు ఇవే అభినందనలు.  భావి ప్రయత్నాలలో సైతం ఆయన రాణించాలి అని కోరుకొంటున్నాను.

చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)’’