Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాంపిటిశన్  కమిశన్  ఆఫ్ ఇండియా కు మరియు ఈజిప్శన్ కాంపిటిశన్ అథారిటి కి మధ్య అవగాహన పూర్వక ఒప్పందం పై సంతకాల కు ఆమోదం తెలిపినమంత్రిమండలి


కాంపిటిశన్ కమిశన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కు మరియు ఈజిప్శన్ కాంపిటిశన్ అథారిటి (ఇసిఎ) కి మధ్య అవగాహన పూర్వక ఒప్పందం (ఎంఒయు) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆ సంతకాల కు ఆమోదాన్ని తెలియ జేసింది.

 

అమలు సంబంధి వ్యూహం మరియు లక్ష్యాలు:

ఈ ఎంఒయు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, ఉత్తమం అయినటువంటి అభ్యాసాల ను పరస్పరం వెల్లడి చేసుకోవడం, వేరు వేరు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల మార్గాల లో కాంపిటిశన్ లా ఎండ్ పాలిసీ లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటుగా తత్సంబంధి ప్రోత్సాహాన్ని లక్షిస్తున్నది. ఈ ఎంఒయు సిసిఐ కి, ఇసిఎ కు మధ్య ఉన్నటువంటి సంబంధాల ను అభివృద్ధి పరచడం మరియు పటిష్ట పరచడం అనే లక్ష్యాల ను కూడా కలిగివుంది. ఈ ఎంఒయు ను ఉభయ పక్షాలు సంబంధి కాంపిటిశన్ లా యొక్క అమలు లో వాటి వాటి న్యాయాధికార పరిధుల లో వాటి అనుభవాన్ని ఒక పక్షాని కి మరొక పక్షం వెల్లడి చేసుకోవడం ద్వారాను, సాంకేతిక పరమైనటువంటి సహకారాన్ని అందించుకోవడం ద్వారా ను ఆ అనుభవాల నుండి నేర్చుకొని అమలు పరచాలనే మరొక లక్ష్యాన్ని కూడా కలిగివుంది.

 

ప్రభావం:

అమలు సంబంధి కార్యక్రమాల యొక్క ఆదాన ప్రదానం ద్వారా ఈ ఎంఒయు సిసిఐ కి అవతలి పక్షం అయిన ఈజిప్టు లోని కాంపిటిశన్ ఏజెన్సీ యొక్క అనుభవాన్నుండి పాఠాల ను నేర్చుకోవడాని కి వీలు ను కల్పించనుంది; అదే జరిగితు సిసిఐ 2002 వ సంవత్సరం నాటి కాంపిటిశన్ యాక్టు యొక్క అమలు ను మెరుగు పరచడం సాధ్య పడుతుంది. తత్పర్యవసానాలు వినియోగదారుల కు విశాలమైన ప్రయోజనాల ను అందించడం తో పాటు సమానత్వాన్ని మరియు సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించ గలుగుతాయి.

 

పూర్వరంగం:

2 సిసిఐ కి 002 సంవత్సరం నాటి కాంపిటిశన్ యాక్టు లోని 18 వ సెక్శను ఏదైనా విదేశం లో సదరు చట్టం లో భాగం గా తన విధుల ను మరియు కర్తవ్యాల ను నెరవేర్చడం కోసం ఆ దేశం లోని ఏదైనా ఏజెన్సీ తో ఒక అవగాహన పత్రం గాని లేదా సర్దుబాటు ను గాని కుదుర్చుకొనేందుకు అనుమతి ని ఇస్తున్నది. ఆ ప్రకారం, ప్రస్తుత ప్రతిపాదన సిసిఐ మరియు ఇజిఎ ల మధ్య ఎంఒయు పై సంతకాల కు రంగాన్ని సిద్ధం చేసింది.

 

**