Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాండ్లా పోర్ట్ ట్రస్ట్ కు చెందిన వివిధ ప్రాజక్టులను ప్రారంభించిన ప్రధాన మంత్రి

కాండ్లా పోర్ట్ ట్రస్ట్ కు చెందిన వివిధ ప్రాజక్టులను ప్రారంభించిన ప్రధాన మంత్రి

కాండ్లా పోర్ట్ ట్రస్ట్ కు చెందిన వివిధ ప్రాజక్టులను ప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని గాంధీనగర్ లో కాండ్లా పోర్ట్ ట్రస్ట్ కు చెందిన వివిధ ప్రాజక్టులను ఈ రోజు ప్రారంభించారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కన్ వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం మరియు 14వ, 16వ జనరల్ కార్గో బెర్త్ అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

కాండ్లా పోర్టు లో – కచ్ఛ్ సాల్ట్ జంక్షన్ వద్ద ఇంటర్ చేంజ్-కమ్-ఆర్ ఒ బి నిర్మాణానికి, రెండు మొబైల్ హార్బర్ క్రేన్ ల మోహరింపునకు, ఎరువులను ఒక చోటు నుండి మరొక చోటుకు చేరవేయడానికి అవసరమైన యాంత్రీకరణ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ మాట్లాడుతూ, సాగరమాల ప్రాజక్టు, పోర్టు ప్రధానంగా చేపట్టిన అభివృద్ధి పనులు గుజరాత్ రాష్ట్రం పైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయని, అదేవిధంగా ఉపాధి కల్పనకు తోడ్పడుతాయన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రుపానీ మాట్లాడుతూ, రాష్ట్రానికి గొప్ప సముద్రపరమైన సంప్రదాయాలు ఉన్నాయని, ఆ స్ఫూర్తి నేటికీ కొనసాగుతోందన్నారు.

హెలీప్యాడ్ నుండి సభాస్థలి వరకు తనకు అపూర్వమైన స్వాగతం పలికిన ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.

నీటికి ఉన్న ప్రాముఖ్యం గురించి కచ్ఛ్ ప్రజలకు చాలా బాగా తెలుసని ఆయన అన్నారు. కచ్ఛ్ ప్రాంతానికి ఉన్నటువంటి గొప్పదీ, అద్భుతమైందీ అయిన చరిత్రను గురించి, సంప్రదాయాన్ని గురించి ఆయన ప్రస్తావించారు.

అంతర్జాతీయ వాణిజ్యం లో స్థానం సంపాదించాలని భారతదేశం ఆశిస్తే అందుకుగాను పోర్ట్ రంగంలో ఉత్తమమైనటువంచి సౌకర్యాలు కలిగివుండాలని ప్రధాన మంత్రి అన్నారు.

పోర్టు రంగం ముందంజ వేయాలంటే మౌలిక సదుపాయాలు, సామర్థ్యం.. ఈ రెండూ అవసరమని, కాండ్లా పోర్టు ఆసియాలోకెల్లా అత్యుత్తమ పోర్టులలో ఒకటిగా నిలిచిందని ఆయన చెప్పారు.

కాండ్లా పోర్టు మరింతగా అభివృద్ధి చెందడానికి, భారతదేశ భాగస్వామ్యంతో ఇరాన్ లో అభివృద్ధి పరుస్తున్న చాబహార్ పోర్ట్ దోహదపడుతుందని ప్రధాన మంత్రి చెప్పారు.

ఈ రోజు శంకుస్థాపన చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కన్వెన్షన్ సెంటర్ గురించి కూడా ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

వచ్చే ఐదేళ్లలో దేశం కోసం ఎవరు ఎంత విరాళం ఇవ్వ గలరో అంత విరాళం ఇవ్వడానికి ప్రజలు తీర్మానించుకోవాలనీ ఆ తరువాత కూడా దానిని 75 వ స్వాతంత్ర్య దినోత్సవం వరకు కొనసాగించాలని ప్రజలకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

దేశప్రజలు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంటున్నారని ప్రధాన మంత్రి పేర్కొంటూ, కాండ్లా పోర్ట్ ట్రస్టుకు ‘‘పండిత్ దీన్ దయాళ్ పోర్ట్ ట్రస్ట్- కాండ్లా’’గా తిరిగి నామకరణం చేయాలని సూచించారు.