Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కస్టమ్స్ సంబంధిత వ్యవహారాలలో సహకారం మరియు పరస్పర సహాయం అనే అంశం పై భారతదేశం, కతర్ ల మధ్య ఒప్పందం పై సంతకాలు, ధ్రువీకరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం


కస్టమ్స్ వ్యవహారాలలో సహకారం మరియు పరస్పర సహాయం అనే అంశం పై భారతదేశం, కతర్ ల మధ్య ఒప్పందం పై సంతకాలు, ధ్రువీకరణ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

కస్టమ్స్ వ్యవహారాల పై భారత దేశం మరియు కతర్ ల మధ్య సహకారం కోసం ద్వైపాక్షిక ఒప్పందం కుదర్చడానికి ఈ ఒప్పందాన్ని ఉద్దేశించారు.

కస్టమ్స్ నేరాల దర్యాప్తునకు, నివారణకు సంబంధిత సమాచారం అందుబాటులోకి రావడానికి ఈ ఒప్పందం తోడ్పడగలదు. అంతే కాకుండా, రెండు దేశాలకు మధ్య వ్యాపారం సాఫీగా సాగేందుకు, వర్తకం జరిగే వస్తువులకు పక్కా క్లియరెన్స్ లభించేందుకు ఈ ఒప్పందం దోహదపడగలదని ఆశిస్తున్నారు.

పూర్వ రంగం:

భారత దేశానికి కతర్ ఒక ముఖ్యమైన వ్యాపార భాగస్వామిగా ఉంది. రెండు దేశాలకు మధ్య వ్యాపారం సంవత్సరాల తరబడి
విస్తరిస్తూ వస్తోంది. ద్వైపాక్షిక వ్యాపారం నిలకడగా వృద్ధి చెందుతున్న సంగతిని దృష్టిలో ఉంచుకొని ఇరు దేశాల కస్టమ్స్ అధికారులు సమాచారం, రహస్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఒక చట్టబద్దమైన యంత్రాంగాన్ని సమకూర్చడం తప్పనిసరి అనే అభిప్రాయానికి వచ్చారు. కస్టమ్స్ చట్టాలను తగిన రీతిన వర్తింప చేయడం, కస్టమ్స్ నేరాల పరిశోధన మరియు నివారణ, చట్టబద్ధమైన వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరచడంలో ఈ యంత్రాంగం సహాయకారి కాగలదు. ఒప్పందం తాలూకు ముసాయిదా పాఠాన్ని పరస్సర చర్చల అనంతరం ఖరారు చేయడమైంది. వెల్లడించిన కస్టమ్స్ యొక్క విలువకు సంబంధించిన వాస్తవికత తాలూకు సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి, అలాగే, వస్తువుల మూలానికి సంబంధించిన ధ్రువ పత్రాల ప్రామాణికతతో పాటు ఇరు దేశాలకు మధ్య వ్యాపారం జరిగే వస్తువుల వివరణ పై భారతీయ కస్టమ్స్ అవసరాలను, వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకొంటుంది.