Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కస్టమ్స్ వ్యవహారాలలో పరస్పర సహకారం మరియు సహాయానికి సంబంధించి భారతదేశం, ఉరుగ్వే ల మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి


కస్టమ్స్ వ్యవహారాలలో పరస్పర సహకారానికి, పరస్పర సహాయానికి సంబంధించి భారతదేశం, ఉరుగ్వే ల మధ్య కుదిరిన ఒక ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

కస్టమ్స్ నేరాల దర్యాప్తు మరియు నివారణ ల కోసం ఉపయుక్త సమాచారం లభ్యమయ్యేందుకు ఈ ఒప్పందం దోహద పడగలదు. అలాగే, రెండు దేశాల మధ్య సులభ వ్యాపారానికి మరియు వ్యాపార లావాదేవీలు జరిగే సరుకులు సమర్థమైన రీతిలో విడుదల కావడానికి కూడా ఈ ఒప్పందం మార్గాన్ని సుగమం చేయగలుగుతుందని ఆశిస్తున్నారు.

ప్రకటించిన కస్టమ్స్ విలువ యొక్క సరి అయిన ప్రమాణం తాలూకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, వస్తువుల మూలానికి సంబంధించిన ధ్రువపత్రాల యొక్క వాస్తవికత, ఇంకా రెండు దేశాల మధ్య లావాదేవీలు జరిగే వస్తువుల వివరణ ల విషయంలో భారతదేశ కస్టమ్స్ విభాగం యొక్క అవసరాలను. ఆందోళనలను ఈ ముసాయిదా ఒప్పందం పరిష్కరిస్తుంది.

పూర్వ రంగం:

ల్యాటిన్ అమెరికా లో ఒక వ్యాపార ప్రాంతమైన ఎమ్ఇఆర్ సిఒఎస్ యుఆర్ (MERCOSUR) సభ్యత్వ దేశాలలో ఉరుగ్వే భారతదేశానికి ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. ఎమ్ఇఆర్ సిఒఎస్ యుఆర్ తో భారతదేశం ఒక ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ (పిటిఎ) పై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం 2009 జూన్ 1 నాటి నుండి అమలులోకి వచ్చింది. భారతదేశం, ఉరుగ్వే ల మధ్య వ్యాపారం క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. రెండు దేశాల కస్టమ్స్ అధికారుల మధ్య సమాచారం మరియు నిఘా సంబంధ విషయాల పంపకానికి తాజా ఒప్పందం ఒక చట్టబద్ధమైన స్వరూపాన్ని సమకూర్చగలుగుతుంది. దీనితో పాటు, కస్టమ్స్ చట్టాలు తగిన రీతిలో వర్తించేటట్లు చూడడంలోను, కస్టమ్స్ సంబంధ నేరాల దర్యాప్తు, ఆ నేరాల నివారణలోను, చట్టబద్ద వ్యాపారానికి తగిన వాతావరణాన్ని ఏర్పరచడంలోను ఈ ఒప్పందం తోడ్పడగలుగుతుంది. ప్రతిపాదిత ఒప్పందం యొక్క ముసాయిదా పాఠాన్ని ఉభయ కస్టమ్స్ పాలన యంత్రాంగా సమ్మతితో ఖరారు చేశారు.