కస్టమ్స్ కన్ వెన్శన్ ఆన్ ఇంటర్ నేషనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండర్ కవర్ ఆఫ్ టిఐఆర్ కార్నెట్స్ (టిఐఆర్ కన్ వెన్శన్)లో భారతదేశపు ప్రవేశానికి మరియు తత్సంబంధిత అనుమోదానికి అవసరమైన విధానాలను పూర్తి చేయడానికి, భారతదేశపు ప్రవేశం అమలు కావడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఒడంబడికలో భాగస్వాములైన ఇతర పక్షాల (దేశాల) భూభాగాల వెంబడి రహదారి మార్గాన లేదా బహుళ విధ మార్గాలలో వస్తువుల కదలికకు ఉద్దేశించిన వేగవంతమైన, సులువైన, విశ్వసించదగిన మరియు అవాంతరాలకు తావు ఉండనటువంటి ఒక అంతర్జాతీయ వ్యవస్థ భారతీయ వ్యాపారులకు అందుబాటులోకి రావడానికి ఈ అంతర్జాతీయ ఒప్పందం తోడ్పడగలుగుతుంది.
ఈ అంతర్జాతీయ ఒప్పందంలో చేరడం ద్వారా కస్టమ్స్ సంబంధి నియంత్రణల గుర్తింపు యొక్క ఆదాన ప్రదానం చోటు చేసుకొంటుంది; దీనితో మధ్యస్థ సరిహద్దుల వద్దే కాకుండా మార్గమధ్యంలోని ఫిజికల్ ఎస్కార్ట్ ల వద్ద సరుకుల తనిఖీ నివారణకు ఆస్కారం ఏర్పడుతుంది. అంతర్గత కస్టమ్స్ స్థానాల వద్దే కస్టమ్స్ క్లియరెన్సు పూర్తి అవుతుంది. తద్వారా సరిహద్దు కూడలి ప్రాంతాలలోను, తరచుగా రద్దీగా ఉండే నౌకాశ్రయాల లోను క్లియరెన్సులు పొందవలసిన అవసరం ఉండబోదు. సామాను ఎక్కించిన గది, లేదా కంటెయినర్ ల యొక్క ముద్రలను, బయటి స్థితిగతులను సరిచూసినంత మాత్రాననే టిఐఆర్ పరిధిలో సామగ్రి కదలికలను అనుమతించడానికి కుదురుతుంది. అంటే, సరిహద్దుల వద్ద జాప్యాలు, రవాణా మరియు లావాదేవీల వ్యయాలను తగ్గించుకోవచ్చు; స్పర్థ పెరిగి వ్యాపారం, రవాణా రంగాలలో వృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
అంతర్జాతీయ ఒప్పందానికి కట్టుబడడం సప్లయ్ చైన్ కు భద్రతను పెంపొందించగలదు. ఎలాగంటే, ఒప్పందం నియమాలను బట్టి కేవలం ఆమోదం లభించిన రవాణాదారు సంస్థలు మరియు వాహనాలను అనుమతించడం జరుగుతుంది. కస్టమ్స్ సుంకాలకు, పన్నులకు మరియు ట్రాఫిక్ ఇన్ ట్రాన్ సిట్ కు టిఐఆర్ కార్నెట్ పూచీ పడుతుంది కాబట్టి, దారి మధ్యలో ఏ విధమైన పన్నులను చెల్లించవలసిన అవసరం ఉండదు. కస్టమ్స్ డిక్లరేషన్ గా కూడా టిఐఆర్ కార్నెట్ ఉపయోగపడుతుంది. వేరు వేరు ట్రాన్సిటింగ్ దేశాల తాలూకు జాతీయ చట్టాలకు అనుగుణంగా ఒకటికి మించిన డిక్లరేషన్ లను దాఖలు చేసే పని తప్పుతుంది కూడా. ఇంటర్ నేషనల్ ‘‘నార్త్- సౌత్’’ ట్రాన్స్ పోర్ట్ (ఐఎన్ ఎస్ టిసి) కారిడర్ పొడవునా సామగ్రి కదలికకు టిఐఆర్ కన్ వెన్షన్ ఒక సాధనంగా మారుతుంది. మధ్య ఆసియా గణతంత్ర దేశాలతోను, ఇతర కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సిఐఎస్) దేశాలతోను- మరీ ముఖ్యంగా ఇరాన్ లోని చాబహార్ నౌకాశ్రయం వంటి నౌకాశ్రయాలను ఉపయోగించుకొంటూ- వ్యాపారాన్ని ఇబ్బడిముబ్బడిగా వర్ధిల్లజేసుకోవడానికి ఇది ఉపయోగకారి కాగలదు.
ఈ ప్రతిపాదన ఒక అంతర్జాతీయ ఒప్పందంలో భారతదేశం ప్రవేశించడానికి సంబంధించింది కావడంతో, భారతదేశ ప్రభుత్వం పైన ఎటువంటి ప్రత్యక్ష ఆర్థిక ప్రభావాన్ని ప్రసరించబోదు.
పూర్వ రంగం :
కస్టమ్స్ కన్ వెన్శన్ ఆన్ ఇంటర్ నేషనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండర్ కవర్ ఆఫ్ టిఐఆర్ కార్నెట్స్, 1975 (టిఐఆర్ కన్ వెన్శన్) అనేది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరోప్ (యుఎన్ఇసిఇ) ఆధ్వర్యంలోని ఒక అంతర్జాతీయ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండే పక్షాల మధ్య, ఆయా దేశాల లోపల వస్తువుల రవాణా ఎటువంటి అంతరాలు లేకుండా కొనసాగేలా చూడడం యుఎన్ఇసిఇ
ఉద్దేశం. ప్రస్తుతానికి ఈ ఒప్పందంలో యూరోపియన్ యూనియన్ తో సహా 70 పక్షాలు చేరివున్నాయి.