Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కశ్మీర్ యొక్క సంపన్న సంస్కృతి ని, కళల ను  మరియు హస్తకళల ను కళ్ళకుకట్టే ‘‘వితస్తా–కశ్మీర్ మహోత్సవం’ను ప్రశంసించిన ప్రధాన మంత్రి


కశ్మీర్ యొక్క సంపన్నమైనటువంటి సంస్కృతి ని, కళల ను మరియు హస్తకళల ను కళ్ళకు కట్టే ‘‘వితస్తా-కశ్మీర్ మహోత్సవం’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

కశ్మీర్ యొక్క సంపన్నమైన కళల ను, సంస్కృతి ని, సాహిత్యాన్ని, హస్తకళల ను మరియు వంటకాల ను యావత్తు దేశం లో ప్రదర్శించడం కోసం ‘వితస్తా’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

చెన్నై లో మొదలై శ్రీనగర్ లో ముగించిన పలు కార్యక్రమాలు యువత లో కశ్మీరీ సంస్కృతి ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరియు ఉత్సాహాన్ని రేకెత్తించాయి. కశ్మీర్ సంస్కృతి ని సామాన్య ప్రజల చెంత కు చేర్చడం కోసం కార్యశాలలు, కళల కు సంబంధించిన శిబిరాలు, చర్చాసభ లు, హస్తకళల ప్రదర్శన లు వంటి వివిధ కార్యక్రమాల ను ఏర్పాటు చేయడం జరిగింది. కశ్మీర్ సంస్కృతి ని అవగాహన చేసుకోవడం కోసం ప్రజలు వీటి లో పాలుపంచుకొన్నారు.

వితస్తా కార్యక్రమాన్ని గురించి అమృత్ మహోత్సవ్ చేసిన కొన్ని ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ఈ అద్భుత ప్రయాస కు గాను అనేకానేక అభినందన లు. ఎన్నో సంవత్సరాల తరువాత, ‘‘వితస్తా- కశ్మీర్ మహోత్సవం’’ దేశవ్యాప్తం గా ప్రజానీకాని కి ఆ రాష్ట్రం యొక్క సమృద్ధ సంస్కృతి మరియు వారసత్వం ల గురించి తెలుసుకొనే అవకాశాన్ని కల్పించింది. దానితో పాటు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దేశవాసుల ను ఒక సూత్రం లో చేర్చేటటువంటి ఒక పెద్ద కార్యక్రమం కూడాను అని చెప్పాలి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*******

DS/ST