Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్నాటక లోని  మండ్య ను మరియుహుబ్లీ-ధార వాడ ను మార్చి నెల 12వ తేదీ నాడు సందర్శించనున్న ప్రధానమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 12 వ తేదీ నాడు కర్నాటక ను సందర్శించనున్నారు. అక్కడ ఆయన సుమారు 16,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన కూడా చే యనున్నారు. మధ్యాహ్నం పూట ఇంచుమించు 12 గంటల వేళ కు ప్రధాన మంత్రి మండ్య లో ముఖ్యమైన కొన్ని రహదారి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత, దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల వేళ కు ఆయన హబ్లీ-ధార వాడ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన చేస్తారు.

 

మండ్య లో ప్రధాన మంత్రి

దేశవ్యాప్తం గా ప్రపంచ శ్రేణి సంధానానికి పూచీపడడం తో ముడిపడ్డ ప్రధాన మంత్రి యొక్క దార్శనికత కు వేగవంతం అవుతున్న మౌలిక సదపాయాల పథకాల అభివృద్ధి అనేది ఒక ప్రమాణం గా నిలుస్తోంది. ఈ కృషి ని మరింత ముందుకు తీసుకు పోవడం లో భాగం గా బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వే ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లో ఎన్ హెచ్-275 కు చెందిన బెంగళూరు-నిదాఘట్ట-మైసూరు సెక్శన్ ను ఆరు దోవల తో కూడిన రహదారి గా బలచడం ఒక భాగం గా ఉంది. 118 కిలో మీటర్ ల పొడవైన రహదారి ని నిర్మించడం తో జతపడ్డ ఈ ప్రాజెక్టు ను దాదాపు గా 8480 కోట్ల రూపాయల మొత్తం ఖర్చు తో తీర్చిదిద్దడం జరుగుతుంది. దీనితో బెంగళూరు మరియు మైసూరు ల మధ్య ప్రయాణానికి పట్టే కాలం కాస్తా సుమారు 3 గంటల నుండి ఇంచుమించు 75 నిమిషాల కు కుదించుకుపోనుంది. ఫలితం గా ఆ ప్రాంతం లో సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి కి ప్రోత్సాహం లభిస్తుంది.

 

నాలుగు దోవల తో కూడిన మైసూరు-కుశల్ నగర్ హైవే నిర్మాణ పనుల కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 92 కిలో మీటర్ లలో విస్తరించి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ను దాదాపు గా 4130 కోట్ల రూపాయల వ్యయం తో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు బెంగళూరు తో కుశల్ నగర్ యొక్క రవాణా సంధానాన్ని పెంచడం లో ఒక ముఖ్య పాత్ర ను పోషించనుంది. అంతేకాకుండా, ఇది ప్రయాణ కాలాన్ని దాదాపు గా అయిదు గంటల నుండి రెండున్నర గంటల కు తగ్గించడం లో తోడ్పడనుంది. ఈ ప్రకారం గా, ప్రయాణ కాలం, ఇప్పటి తో పోలిస్తే సగానికి కుదించుకుపోనుంది.

 

హుబ్బళ్లి-ధార వాడ లో ప్రధాన మంత్రి

 

ఐఐటి ధార వాడ ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ సంస్థ కు 2019 ఫిబ్రవరి లో ప్రధాన మంత్రే శంకుస్థాపన చేశారు. 850 కోట్ల రూపాయలకు పైచిలుకు వ్యయం తో అభివృద్ధి పరచిన ఈ సంస్థ ప్రస్తుతం 4 సంవత్సరాల బి.టెక్ ప్రోగ్రాము ను, అయిదు సంవత్సరాల ఇంటర్ డిసిప్లినరీ బిఎస్-ఎమ్ఎస్ ప్రోగ్రాము ను, ఎమ్.టెక్ మరియు పిహెచ్.డి ప్రోగ్రాము ను నిర్వహిస్తున్నది.

 

శ్రీ సిద్ధరూఢ స్వామీజీ హుబ్బళ్లి స్టేశను లో ప్రపంచం లోకెల్లా అత్యంత పొడవైనదైనటువంటి రైల్ వే ప్లాట్ ఫార్మ్ ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీని ని ఇటీవలే గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 1507 మీటర్ ల పొడవు తో ఉన్న ఈ ప్లాట్ ఫార్మ్ ను సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడమైంది.

 

 

ప్రధాన మంత్రి హోసపేటె-హుబలీ-తీనాయిఘాట్ సెక్శన్ తాలూకు విద్యుదీకరణ మరియు ఉన్నతీకరణ జరిగిన హోసపేటె స్టేశను ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. దీనితో ఆ ప్రాంతం లో సంధానం జోరందుకోనుంది. 530 కోట్ల రూపాయలకు పైచిలుకు వ్యయం తో అభివృద్ది పరచిన ఈ విద్యుదీకరణ పథకం విద్యుత్తు మార్గం లో ఎటవంటి అంతరాయాలు ఎదురవని విధం గా రైళ్ళ రాకపోకల కు వీలు ను కల్పిస్తుంది. పునరభివృద్ధి పరచినటువంటి హోసపేటె స్టేశన్ యాత్రికుల కు సౌఖ్యాన్ని ఇచ్చేది గా ఉండి ఆధునిక సదుపాయాల ను అందిస్తుంది. ఈ స్టేశను ను హంపి స్మారకాల ను పోలి ఉండే విధం గా రూపొందించడం జరిగింది.

 

ప్రధాన మంత్రి హుబ్బళ్లి-ధారవాడ స్మార్ట్ సిటీ లో వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం సుమారు 520 కోట్ల రూపాయలు. ఈ ప్రయాస లు సార్వజనిక స్థానాల ను స్వచ్ఛమైనవి గా, సురక్షితమైనవిగా మరియు సౌకర్యవంతం గా తీర్చిదిద్ది జీవనం లో నాణ్యత ను పెంచడం తో పాటు పట్టణం రూపురేఖల ను భవిష్యత్తు అవసరాల కు అనుగుణంగా ఉండే విధం గా మార్చివేయనున్నాయి.

 

జయదేవ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్ కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ఆసుపత్రి ని దాదాపు గా 250 కోట్ల రూపాయల వ్యయం తో అభివృద్ది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ ప్రాంత ప్రజల కు గుండె సంబంధి వ్యాధుల కోసం తృతీయ‌ స్థాయి సంరక్షణ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. ఆ ప్రాంతం లో నీటి సరఫరా సదుపాయాన్ని మరింత గా పెంపొందింపజేసేందుకు గాను ధార వాడ మల్టి విలేజ్ వాటర్ సప్లయ్ స్కీము కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనిని 1040 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఆయన తుప్పారీహల్లా ఫ్లడ్ డేమేజ్ కంట్రోల్ ప్రాజెక్టు కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీనిని ఇంచుమించు 150 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వరదల కారణం గా వాటిల్లే నష్టాన్ని తగ్గించేందుకు ఉద్దేశించింది. దీని లో భాగం గా గోడల ను పరిరక్షించడం తీరప్రాంతాల లో గట్ల ను నిర్మించడం జరుగుతుంది.

 

**