Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్నాటక రాజ్యోత్సవ దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక రాజ్యోత్సవ దినం సందర్భం గా ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.

కర్నాటక ను రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం పరిధి లో 1956వ సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాడు స్థాపించడం జరిగింది.

దేశ పురోగతి కి విశిష్ట తోడ్పాటు ను ఈ రాష్ట్రం అందించాలి అని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.

‘‘భారతదేశ పురోగతి లో కర్నాటక యొక్క శ్రేష్ఠ తోడ్పాటు ను వేడుక గా జరుపుకోవలసినటువంటి రోజే ఈ కర్నాటక రాజ్యోత్సవ దినం. ఈ రాష్ట్రం యొక్క ప్రాకృతిక శోభ మరియు ప్రజల విశాల హృద‌యం సుపరిచితమైనటువంటివి. రానున్న కాలం లో కర్నాటక అభివృద్ధి చెందాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.