Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటకలో 12న తన పర్యటన విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు కర్ణాటకలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో తన పర్యటనపై ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“రేపు… అంటే- మార్చి 12వ తేదీన నేను కర్ణాటకలోని మాండ్య, హుబ్బళ్లి-ధార్వాడ్‌ ప్రాంతాల్లో పర్యటిస్తాను. ఈ సందర్భంగా రూ.16,000 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తాను.

https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1905535

“రేపు… అంటే- మార్చి 12న మాండ్యలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ మార్గం జాతికి అంకితం చేయబడుతుంది. అదే సమయంలో మైసూరు-కుశాల్‌ నగర్‌ హైవే నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుది. ఈ ప్రాజెక్టులతో అనుసంధానం పెరగడంతోపాటు సామాజిక-ఆర్థిక వృద్ధికి ఉత్తేజం లభిస్తుంది.”

“హుబ్బళ్లి-ధార్వాడ్‌లో వివిధ రంగాలకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపడతారు. ఇందులో ఐఐటి-ధార్వాడ్ సహా శ్రీ సిద్ధారూఢ స్వామిజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫామ్‌ జాతికి అంకితం చేయబడతాయి. అలాగే నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయబడుతుంది.”

క‌ర్ణాట‌క‌లో అభివృద్ధి ప‌థ‌కాల‌కు సంబంధించి ఎంపీ ప్ర‌తాప్ సింహా ట్వీట్‌కు ప్ర‌ధానమంత్రి బదులిస్తూ:

“అనుసంధానం, ఆర్థిక ప్రగతి దిశగా మా ప్ర‌భుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ దిశగా మైసూరు-బెంగళూరు మధ్య ఎక్స్‌ప్రెస్ వే ఒక ముందడుగు” అని పేర్కొన్నారు.

మరోవైపు నవీకరించబడిన హోసపేట రైల్వే స్టేషన్‌కు సంబంధించి దూరదర్శన్‌ న్యూస్‌ చానెల్‌ ట్వీట్‌కు బదులిస్తూ:

“హొసపేట ప్రజలకు అభినందనలు. ఈ అదనపు సాంస్కృతిక సంధానంతో వాణిజ్యం, అనుసంధానానికి ఊపు లభిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అదేవిధంగా ధార్వాడ్ సంబంధిత ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషి ట్వీట్‌కు ప్రతిస్పందనగా:

“హుబ్బళ్లి-ధార్వాడ్ ప్రజలకు ‘జీవన సౌలభ్యం’ పెంచే కొత్త  పథకాలు రేపు ప్రారంభించబడతాయి” అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.

***

DS/AK