Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు

కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు


టైగర్ పోజెక్టు 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ర్ణాట‌, మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. “ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (.బీ.సీ.)” ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ సమర్థతపై రూపొందించిన 5 సారాంశ నివేదిక – ‘పులుల సంరక్షణ కోసం అమృత్ కాల్ దృష్టిప్రచురణలను ప్రధానమంత్రి విడుదల చేశారు. సందర్భంగా విడుదల చేసిన అఖిల భారత పులుల (5) అంచనా సారాంశ నివేదికలో పులుల సంఖ్యను ప్రకటించారు. టైగర్పాజెక్టు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.

ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారదేశంలో పులుల నాభా పెరుగుతున్న ప్రతిష్టాత్మ సంఘటనకు లేచి నిలబడి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అపూర్వ విజయానికి ప్రతి ఒక్కరూ సాక్షులనీ, విజయం భారతదేశంతో పాటు, యావత్ ప్రపంచానికి గర్వకారణమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశం కేవలం పులుల జనాభా తగ్గకుండా కాపాడడమే కాకుండా పులులు వృద్ధి చెందే పర్యావరణ వ్యవస్థను కూడా పెంపొందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరంలో ప్రపంచంలోని పులుల జనాభాలో 75% భారతదేశంలోనే ఉండడం పట్ల కూడా ప్రధానమంత్రి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో పులుల నివాస ప్రాంతాలు 75 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించడంతో పాటు, గత పది నుంచి పన్నెండేళ్లలో దేశంలో పులుల సంఖ్య 75 శాతం పెరగడం కూడా యాదృచ్ఛికమేనని ప్రధానమంత్రి వివరించారు.

  • ఉన్న లేదా క్షీణిస్తున్న ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో పెరుగుతున్న పులుల జనాభా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ఔత్సాహికుల మదిలో ఉన్న ప్రశ్నకు జీవవైవిద్యం, పర్యావరణం పట్ల సహజ కోరికతో పాటు, భారతదేశ సంప్రదాయాలు, సంస్కృతిలో సమాధానం దాగి ఉందని ప్రధానమంత్రి చెప్పారు. “జీవావరణ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థల మధ్య వైరుధ్యాన్ని భారతదేశం విశ్వసించదు, రెండింటి సహజీవనానికి భారతదేశం సమాన ప్రాముఖ్యత నిస్తుందిఅని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశ చరిత్రలో పులుల ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, మధ్యప్రదేశ్లోని పదివేల సంవత్సరాల నాటి రాతి కళాఖండాలపై పులుల రేఖాపట నిరూపణలు దర్శనమిచ్చాయని ప్రధానమంత్రి చెప్పారు. మధ్య భారతదేశానికి చెందిన భరియా సమాజం, మహారాష్ట్రకు చెందిన వర్లీ సమాజం ఇతర దేవతలతో పాటు పులిని కూడా పూజిస్తున్నాయని, అదే విధంగా, భారత దేశంలోని అనేక సమాజాలకు చెందిన వ్యక్తులు పులిని ఒక స్నేహినిగా, ఒక సోదరునిగా కూడా పరిగణిస్తున్నారాణి, ఆయన తెలియజేశారు. ఇంకా, దుర్గా మాత, అయ్యప్ప స్వామి పులి పై స్వారీ చేస్తారని కూడా ఆయన చెప్పారు.
  • సంరక్షణలో భారతదేశం సాధించిన అద్వితీయ విజయాలను ప్రస్తావిస్తూ, “ప్రకృతిని రక్షించడం భారతదేశ సంస్కృతిలో ఒక భాగంఅని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ భూభాగంలో భారతదేశం కేవలం 2.4 శాతాన్ని మాత్రమే కలిగి ఉందని, అయితే ఇది ప్రపంచ జీవవైవిధ్యానికి 8 శాతం దోహదపడుతోందనీ ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పులులు భారతదేశంలో ఉన్నాయనీ, దాదాపు ముప్పై వేల ఏనుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆసియా ఏనుగులు గల దేశం, అలాగే, దాదాపు మూడు వేలకు పైగా అతిపెద్ద ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఉన్న దేశం కూడా మనదే అని ఆయన తెలియజేశారు. అదేవిధంగా, ప్రపంచంలోనే ఆసియాటిక్ సింహాలను కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశమనీ, వాటి జనాభా 2015 లో 525 ఉండగా 2020 నాటికి 675 కి పెరిగిందని, ఆయన చెప్పారు. భారతదేశం లోని చిరుతపులి జనాభా గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ, వాటి సంఖ్య నాలుగు సంవత్సరాల్లో 60 శాతానికి పైగా పెరిగిందని ప్రధానమంత్రి తెలియజేశారు. గంగా వంటి నదుల ప్రక్షాళన కోసం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ, ఒకప్పుడు ప్రమాదంలో ఉన్నట్లు భావించిన కొన్ని జలచరాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయని, ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు. విజయాలకు ప్రజల భాగస్వామ్యం, పరిరక్షణ సంస్కృతి తోడయ్యాయని, ఆయన అభినందించారు.

భారతదేశంలో జరిగిన కృషిని గుర్తిస్తూ, “వన్యప్రాణులు అభివృద్ధి చెందాలంటే పర్యావరణ వ్యవస్థలు వృద్ధి చెందడం చాలా ముఖ్యం“, అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశం తన రామ్సర్ ప్రాంతాల జాబితాలో 11 చిత్తడి నేలలను చేర్చిందని, దీంతో మొత్తం రామ్సర్ ప్రాంతాల సంఖ్య 75 కి చేరిందని ఆయన చెప్పారు. 2019 తో పోలిస్తే 2021 నాటికి భారతదేశంలో అదనంగా 2,200 చదరపు కిలోమీటర్లకు పైగా అడవులు, చెట్లను పెంచినట్లు, ఆయన తెలియజేశారు. కేవలం గత దశాబ్ద కాలంలో, సామాజిక అడవుల సంఖ్య 43 నుండి 100 కి పైగా పెరిగిందని, పర్యావరణసున్నిత ప్రాంతాలుగా ప్రకటించిన జాతీయ పార్కులు, అభయారణ్యాల సంఖ్య 9 నుంచి 468 కి పెరిగిందని, ప్రధానమంత్రి చెప్పారు.

  • ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా సింహాల జనాభా కోసం పని చేయడం గురించి, తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితం చేయడం వల్ల అడవి జంతువును రక్షించలేమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, జంతువుల మధ్య భావోద్వేగంతో పాటు ఆర్థిక సంబంధాన్ని కూడా సృష్టించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. గుజరాత్లో వన్యప్రాణి మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో, వేట వంటి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నగదు బహుమతిని ప్రకటించిన అంశాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు. గిర్ సింహాల కోసం పునరావాస కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, గిర్ ప్రాంతంలో అటవీ శాఖలో మహిళా బీట్ గార్డులు, ఫారెస్టర్లను నియమించడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం గిర్లో నెలకొల్పిన పర్యాటకం, పర్యావరణ పర్యాటకానికి సంబంధించి, భారీ పర్యావరణ వ్యవస్థ గురించి కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు.

టైగర్ ప్రాజెక్టు విజయంలో పర్యాటక కార్యకలాపాలు, అవగాహన కార్యక్రమాలతో పాటు, టైగర్ రిజర్వ్లలో మానవజంతు సంఘర్షణలను తగ్గించడానికి దారితీసే అంశాలు మొదలైన అనేక కోణాలు ఉన్నాయని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. “బిగ్ క్యాట్స్ ఉనికి ప్రతిచోటా స్థానిక ప్రజల జీవితాలతో పాటు, జీవావరణ శాస్త్రంపై సానుకూల ప్రభావం చూపిందిఅని శ్రీ మోదీ తెలిపారు.

  • క్రితం భారతదేశంలో చిరుత అంతరించిపోయిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తీసుకువచ్చిన చిరుతలను ఉదహరిస్తూ, ఇది ఖండాంతరాల నుంచి తరలించి, విజయవంతమైన తొలి బిగ్ క్యాట్ స్థానభ్రంశం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం కునో జాతీయ పార్కు లో నాలుగు అందమైన చిరుత పిల్లలు జన్మించాయని ఆయన గుర్తు చేశారు. 75 ఏళ్ల క్రితం అంతరించిపోయిన చిరుత తిరిగి భారత దేశంలో జన్మించిందని ఆయన అన్నారు. జీవవైవిధ్య రక్షణ, శ్రేయస్సు కోసం అంతర్జాతీయ సహకారం ఆవశ్యకతను, ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.
  • కూటమి ఆవశ్యకతపై ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ, “వన్యప్రాణుల పరిరక్షణ అనేది ఒక దేశ సమస్య కాదు, సార్వత్రికమైనదిఅని నొక్కి చెప్పారు. ఆసియాలో వేట, వన్యప్రాణుల అక్రమ వ్యాపారానికి వ్యతిరేకంగా 2019 సంవత్సరంలో గ్లోబల్ టైగర్ డే రోజున కూటమి ఏర్పాటుకు తాను ఇచ్చిన పిలుపు అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు స్ఫూర్తి అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశంతో సహా వివిధ దేశాల అనుభవాల నుండి ఉద్భవించిన పరిరక్షణ, రక్షణ ఎజెండాను సులభంగా అమలు చేయడం ద్వారా బిగ్ క్యాట్ తో అనుబంధంగా ఉన్న మొత్తం పర్యావరణ వ్యవస్థకు ఆర్థిక, సాంకేతిక వనరులను సమీకరించడం సులభమని దాని ప్రయోజనాలను గమనించిన ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. “పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్, చిరుతలతో సహా ప్రపంచంలోని ఏడు ప్రధాన బిగ్ క్యాట్స్ సంరక్షణపై అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ దృష్టి కేంద్రీకరిస్తుందిఅని ప్రధానమంత్రి పేర్కొంటూ, అవి నివాసంగా ఉన్న దేశాలు కూటమిలో భాగస్వాములౌతాయని తెలియజేశారు. సభ్య దేశాలు తమ అనుభవాలను పంచుకోగలవని, తమ తోటి దేశానికి మరింత త్వరగా సహాయం చేయగలవని, పరిశోధన, శిక్షణ, సామర్థ్య పెంపుదలకు ప్రాధాన్యతనిస్తాయని ఆయన వివరించారు. “మనందరం కలిసి జాతులు అంతరించి పోకుండా కాపాడుదాం. సురక్షితమైన, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిద్దాంఅని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

భారతదేశం జి-20 అధ్యక్ష పదవిని చేపట్టిన నేపథ్యంలోఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తునినాదాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొంటూ, మన పర్యావరణం సురక్షితంగా ఉండి, మన జీవవైవిధ్యం విస్తరిస్తున్నప్పుడే మానవాళికి మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందనే సందేశాన్ని ఇది విస్తృతం చేస్తుందని చెప్పారు. “ బాధ్యత మనందరిది, ఇది మొత్తం ప్రపంచానికి చెందినదిఅని ఆయన పునరుద్ఘాటించారు. భారతదేశం భారీ, ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకుందనీ, పర్యావరణ పరిరక్షణకు చెందిన ప్రతి లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే పరస్పర సహకారంపై సి..పి-26 తన విశ్వాసం వ్యక్తం చేసిందనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు.

కార్యక్రమానికి విచ్చేసిన విదేశీ అతిథులు, ప్రముఖులను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత దేశానికి చెందిన గిరిజన జీవితం, సాంప్రదాయాల నుండి కొంత స్వీకరించవలసిందిగా వారిని కోరారు. గిరిజనులు నివసించే సహ్యాద్రి, పశ్చిమ కనుమల ప్రాంతాలను ఆయన ప్రముఖంగా పేర్కొంటూ, శతాబ్దాలుగా వారు పులులతో సహా ప్రతి జీవవైవిధ్యాన్ని సుసంపన్నం చేయడంలో నిమగ్నమై ఉన్నారని తెలియజేశారు. ప్రకృతి నుండి ఇచ్చిపుచ్చుకునే సమతుల్యతతో కూడిన గిరిజన సమాజ సంప్రదాయాన్ని ఇక్కడ అనుసరించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి తమ ప్రసంగం ముగించే ముందు ఆస్కార్ అవార్డు పొందిన డాక్యుమెంటరీది ఎలిఫెంట్ విస్పర్స్గురించి ప్రస్తావించారు. ఇది ప్రకృతి, జీవరాసుల మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని, మన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. “మిషన్లైఫ్ అంటే పర్యావరణం కోసం జీవనశైలి యొక్క దృక్పథాన్ని అర్థం చేసుకోవడంలో గిరిజన సమాజం యొక్క జీవనశైలి కూడా చాలా సహాయపడుతుంది”, అని పేర్కొంటూ ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు.

కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ప్రభృతులు పాల్గొన్నారు.

నేపథ్యం

ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (.బి.సి.) ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆసియాలో వన్యప్రాణుల వేట, అక్రమ వ్యాపారాన్ని దృఢంగా అరికట్టాలని ప్రధానమంత్రి 2019 జూలై నెలలో ప్రపంచ నాయకుల కూటమికి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు, పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్, చిరుత వంటి జాతులకు ఆశ్రయం కల్పించే దేశాల శ్రేణి సభ్యత్వంతో, ప్రపంచంలోని ఏడు బిగ్ క్యాట్స్ సంరక్షపై దృష్టి సారించే అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ప్రారంభించడం జరుగుతోంది.