ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటక లోని చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎస్ ఎం ఎస్ ఐ ఎం ఎస్ ఆర్) ను ప్రారంభించారు. ఎస్ ఎం ఎస్ ఐ ఎం ఎస్ ఆర్ అందరికీ వైద్య విద్య , నాణ్యమైన వైద్య సంరక్షణను పూర్తి ఉచితంగా 2023 విద్యాసంవత్సరం నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆధునిక నవీన భారత దేశ శిల్పులలో ఒకరైన సర్ ఎం.ఎం.విశ్వేశ్వరయ్య జన్మస్థలం చిక్ బల్లాపూర్ అని, ఆయన సమాధికి నివాళులు అర్పించడానికి, ఆయన మ్యూజియాన్ని సందర్శించే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
“ఈ పుణ్యభూమి ముందు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు. సర్ విశ్వేశ్వరయ్య కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావడానికి, రైతులు, సాధారణ ప్రజల కోసం కొత్త ఇంజనీరింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి చిక్ బల్లాపూర్ భూమి ప్రేరణ అని ఆయన ఉద్ఘాటించారు.
సత్యసాయి గ్రామ్ ఒక అద్భుతమైన సేవా నమూనా అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. విద్య, ఆరోగ్య కార్యక్రమాల ద్వారా సంస్థ చేపడుతున్న మిషన్ ను ఆయన ప్రశంసించారు. నేడు వైద్య కళాశాల ప్రారంభోత్సవం ఈ మిషన్ ను మరింత బలోపేతం చేసిందని ఆయన అన్నారు.
అమృత్ కాల సమయంలో దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చేసిన తీర్మానాన్ని ,ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ సంకల్పం చేసుకోవడంలో ప్రజల్లో ఉన్న ఉత్సుకతను ప్రధాని ప్రస్తావించారు. ఇందుకు “సబ్ కా ప్రయాస్ అనే బలమైన, దృఢమైన, సమర్ధవంతమైన సమాధానం ఒక్కటే
ఉందని అన్నారు. దేశ ప్రజల లో ప్రతి ఒక్కరి కృషి ద్వారా ఇది ఖచ్చితంగా సాకారమవుతుంది” అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు.
‘విక్షిత్ భారత్’ ను సాధించే ప్రయాణంలో సామాజిక, మత సంస్థల పాత్రను, సాధువులు, ఆశ్రమాలు, మఠాల గొప్ప సంప్రదాయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సామాజిక, ధార్మిక సంస్థలు, విశ్వాసం, ఆధ్యాత్మిక అంశాలతో పేదలు, దళితులు, వెనుకబడినవారు, ఆదివాసీలకు సాధికారత కల్పిస్తున్నాయని అన్నారు. .
‘మీ సంస్థ చేస్తున్న కృషి ‘సబ్ కా ప్రయాస్’ స్ఫూర్తిని బలపరుస్తుంది’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం నినాదం ‘యోగ కర్మసు కౌశలం’ అంటే కర్మలో నైపుణ్యం అంటే యోగా అని అర్థం అని ప్రధాన మంత్రి వివరించారు. వైద్యరంగంలో ప్రభుత్వ కృషితో శ్రీ మోదీ ఆ విషయాన్ని వివరించారు. 2014కు ముందు దేశంలో 380 కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 650కి పెరిగిందన్నారు. ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడిన ఆకాంక్షిత జిల్లాల్లో 40 మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేశామన్నారు.
గడచిన తొమ్మిదేళ్లలో దేశంలో మెడికల్ సీట్ల సంఖ్య రెట్టింపు అయిందని ప్రధాని పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో దేశం తయారు చేసే. వైద్యుల సంఖ్య స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్ లో తయారైన వైద్యుల సంఖ్యతో సమానంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో చేపట్టిన అభివృద్ధి ఫలాలను కర్ణాటక కూడా పొందుతోందని, దేశం లోని సుమారు 70 మెడికల్ కాలేజీలు కర్ణాటక రాష్ట్రం లో ఉన్నాయని, చిక్ బల్లాపూర్ లో ఈ రోజు ప్రారంభించిన మెడికల్ కాలేజీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయత్నాలకు నిదర్శనమని ప్రధాని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్ లో భాగంగా దేశంలోని 150కి పైగా నర్సింగ్ ఇన్ స్టిట్యూట్ లను అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయం నర్సింగ్ రంగంలో యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు.
వైద్య విద్యలో భాష సవాలును ప్రస్తావిస్తూ, వైద్య విద్యలో స్థానిక భాషలను ప్రోత్సహించడానికి గతంలో తగిన ప్రయత్నాలు జరగలేదని విచారం వ్యక్తం చేశారు. గ్రామాలు, వెనుకబడిన ప్రాంతాలకు చెందిన యువత వైద్య, ఇంజినీరింగ్ వృత్తుల్లో చోటు దక్కించుకోవడాన్ని ఈ రాజకీయ పార్టీలు ఇష్టపడటం లేదని ఆయన అన్నారు.
‘‘అయితే మా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తోంది. కన్నడతో సహా అన్ని భారతీయ భాషల్లో వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించింది” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
దేశంలో చాలా కాలంగా పేదలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించే ఆచారం కొనసాగుతోందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు సేవ చేయడమే అత్యున్నత కర్తవ్యంగా తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ‘పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. జన ఔషధి కేంద్రాలు లేదా తక్కువ ధరల మందుల ఉదాహరణను ఆయన వివరించారు. నేడు దేశవ్యాప్తంగా సుమారు 10,000 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 1000 కి పైగా కర్ణాటకలో ఉన్నాయని తెలియజేశారు.
ఇలాంటి చొరవతో పేదలు మందుల పై వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకోగలిగారని ఆయన అన్నారు.
పేదలు వైద్యం కోసం ఆసుపత్రుల వ్యయాన్ని భరించలేని గత పరిస్థితులను కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం పేదల ఈ దుస్థితిని గమనించి ఆయుష్మాన్ భారత్ యోజనతో దానిని పరిష్కరించిందని, ఇది పేద కుటుంబాలకు ఆసుపత్రుల తలుపులు తెరిచిందని ఆయన చెప్పారు. కర్ణాటకలో కూడా లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్దిపొందారని, పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. గుండె శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి, డయాలసిస్ వంటి ఖరీదైన శస్త్రచికిత్స విధానాలను ఉదాహరణలుగా చూపిన ప్రధాని, ఖరీదైన ఫీజులను తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు.
“ఆరోగ్య సంబంధిత విధానాలలో తల్లులు సోదరీమణులకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మన తల్లుల ఆరోగ్యం, పోషణ మెరుగుపడినప్పుడు మొత్తం తరం ఆరోగ్యం మెరుగుపడుతుందని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం, ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించడం, ఉచిత శానిటరీ ప్యాడ్లు అందించడం, పౌష్టికాహారం కోసం నేరుగా బ్యాంకుకు డబ్బు పంపడం వంటి పథకాలను ఉదాహరణగా పేర్కొన్నారు రొమ్ము కేన్సర్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గ్రామాల్లో హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు ప్రారంభ దశలోనే ఇలాంటి వ్యాధులను పరీక్షించేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 9,000కు పైగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై ని, ఆయన బృందాన్ని ప్రధాన మంత్రి అభినందించారు.
ఎ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లను బలోపేతం చేసి సాధికారత కల్పిస్తున్న కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రధాని ప్రశంసించారు. కర్ణాటకలో 50 వేల మంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, లక్ష మంది రిజిస్టర్డ్ నర్సులు, హెల్త్ వర్కర్లకు అధునాతన పరికరాలు అందజేశామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు.
ఆరోగ్యంతో పాటు మహిళల ఆర్థిక సాధికారతపై డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పూర్తి దృష్టి సారించిందని ప్రధాని చెప్పారు. కర్ణాటకను పాలు, పట్టు (మిల్క్ అండ్ సిల్క్) భూమిగా అభివర్ణించిన ప్రధాన మంత్రి, పశువుల పెంపకం కోసం కిసాన్ క్రెడిట్ కార్డు, 12 వేల కోట్ల వ్యయంతో పశువులకు భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి తెలియజేశారు. పాడిపరిశ్రమ సహకార సంఘాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గ్రామాల్లోని మహిళల స్వయం సహాయక బృందాలకు కూడా సాధికారత కల్పిస్తున్నామని ప్రధాని తెలిపారు. దేశం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ‘సబ్ కా ప్రయాస్’ అభివృద్ధికి అంకితమైనప్పుడు, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని మనం వేగంగా సాధిస్తాము” అని ఆయన అన్నారు.
భగవాన్ సాయిబాబాతో, సంస్థాన్ తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “నేను ఇక్కడ అతిథిని కాదు, నేను ఈ ప్రదేశం , భూమిలో భాగం. నేను మీ మధ్యకు వచ్చిన ప్రతిసారీ బంధం బలపడుతూ ఉంటుంది. హృదయంలో బలమైన బంధాల కోరిక ఉద్భవిస్తుంది”, అని ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ చైర్మన్ డాక్టర్ సి.శ్రీనివాస్, సద్గురు మధుసూదన్ సాయి తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ ప్రాంతంలో విద్యార్థులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందించడానికి సహాయపడే చొరవలో, శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎస్ ఎం ఎస్ ఐ ఎం ఎస్ ఆర్) ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. చిక్కబళ్లాపూర్ లోని ముద్దెనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ దీన్ని స్థాపించింది. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణను వ్యాపార దృష్టి లేకుండా ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటైన ఎస్ఎమ్ఎస్ఐఎమ్ఎస్ఆర్ అందరికీ వైద్య విద్య , నాణ్యమైన వైద్య సంరక్షణను పూర్తి ఉచితంగా అందిస్తుంది. 2023 విద్యాసంవత్సరం నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం ఆవుతాయి.
Elated to be in Karnataka! Speaking at inauguration of Sri Madhusudan Sai Institute of Medical Science & Research in Chikkaballapur. https://t.co/wcv8Mttjjb
— Narendra Modi (@narendramodi) March 25, 2023
PM @narendramodi pays tributes to Sir M. Visvesvaraya. pic.twitter.com/0E1p6Ug6T5
— PMO India (@PMOIndia) March 25, 2023
With ‘Sabka Prayaas’, India is on the path of becoming a developed nation. pic.twitter.com/v4g8Z9EJqk
— PMO India (@PMOIndia) March 25, 2023
Our effort has been on augmenting India’s healthcare infrastructure. pic.twitter.com/NGI6IepxkG
— PMO India (@PMOIndia) March 25, 2023
We have given priority to the health of the poor and middle class. pic.twitter.com/Bwl9VerK2a
— PMO India (@PMOIndia) March 25, 2023
***
DS/TS
Elated to be in Karnataka! Speaking at inauguration of Sri Madhusudan Sai Institute of Medical Science & Research in Chikkaballapur. https://t.co/wcv8Mttjjb
— Narendra Modi (@narendramodi) March 25, 2023
PM @narendramodi pays tributes to Sir M. Visvesvaraya. pic.twitter.com/0E1p6Ug6T5
— PMO India (@PMOIndia) March 25, 2023
With 'Sabka Prayaas', India is on the path of becoming a developed nation. pic.twitter.com/v4g8Z9EJqk
— PMO India (@PMOIndia) March 25, 2023
Our effort has been on augmenting India's healthcare infrastructure. pic.twitter.com/NGI6IepxkG
— PMO India (@PMOIndia) March 25, 2023
We have given priority to the health of the poor and middle class. pic.twitter.com/Bwl9VerK2a
— PMO India (@PMOIndia) March 25, 2023
Spirit of Sabka Prayas will take India to new heights. pic.twitter.com/mPmAeU0zHT
— Narendra Modi (@narendramodi) March 25, 2023
Here is how India’s healthcare infra has been significantly ramped up in the last 9 years. pic.twitter.com/ULUeSwWA79
— Narendra Modi (@narendramodi) March 25, 2023
Now, medical and engineering degrees can also be studied in regional languages. This has helped countless students. pic.twitter.com/H8YChH3alg
— Narendra Modi (@narendramodi) March 25, 2023
Our efforts for a strong public health infrastructure place topmost emphasis on welfare of women and children. pic.twitter.com/ecy8u956sG
— Narendra Modi (@narendramodi) March 25, 2023