ప్రియమైన నా తోటి పౌరులారా,
ప్రస్తుతం ప్రపంచమంతా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. సాధారణంగా ఎప్పుడైనా, ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏవో కొన్ని దేశాలకు లేదా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ, ప్రస్తుతం వచ్చిన ఈ సంక్షోభం ప్రపంచ ప్రజలందరినీ విపత్తులోకి ముంచివేసింది. తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ ఇన్ని దేశాలలో ప్రభావం కనిపించలేదు. ఈ రోజు కరోనా దుష్ప్రభావం అనేక దేశాలలో కనిపిస్తోంది.
గత రెండు నెలలుగా నిరంతరం ప్రపంచమంతా కరోనా వైరస్ కు సంబంధించి విషాదకర వార్తలు వస్తున్నాయి. మనం వింటూ ఉన్నాం. గత రెండు నెలలుగా భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా విజృంభించిన కరోనా వైరస్ ను ప్రతిఘటిస్తున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ప్రమాదం నుంచి మనం బయటపడ్డామని అనిపిస్తోంది. అంతా బాగుంది అనిపిస్తోంది. అయితే.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న మహమ్మారి కరోనా గురించి నిశ్చింతగా ఉండడమనేది అంత సులువైన అంశం కాదు. అందువల్ల ప్రతి ఒక్క భారతీయుడు జాగ్రత్తలు పాటించి, అప్రమత్తులై ఉండాలి. ఇది చాలా అవసరం.
మిత్రులారా,
ప్రజలను ఏదైనా కోరినప్పుడు నా దేశవాసులందరూ నా కోరికను మన్నించారు. నన్ను ఏనాడు నిరాశపర్చలేదు. మీ అందరి ఆశీర్వాద బలంతో మన ప్రయత్నాలన్నీ సఫలమవుతున్నాయి. ఈ రోజు నేను భారతీయులందరినీ, ఒక విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. ముందు ముందు రాబోయే మీ సమయం లో కొన్ని వారాలు నాకు కావాలి.
మిత్రులారా,
ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి బతికి బట్టకట్టేందుకు మన విజ్ఞానం ఎలాంటి ఉపాయాన్ని అందించలేకపోయింది. ఈ రోగానికి ఎలాంటి టీకా మందులను ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇలాంటి పరిస్థితిలో మన బాధలు పెరగడం సహజమే. ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కడెక్కడైతే విజృంభించిందో, అక్కడ ఒక విషయం తేటతెల్లమైంది. ఈ దేశాలలో ప్రారంభావస్థలో కొన్నిరోజుల తర్వాత అనుకోకుండా ఉన్నట్టుండి అకస్మాత్తుగా భయంకరమైన రీతిలో వ్యాధి ప్రబలింది. ఈ దేశాలలో కరోనా వ్యాధి సంక్రమించిన వారి సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. భారత ప్రభుత్వం ఈ స్థితిపై నిఘా వేసింది. కరోనా వ్యాప్తి చెందే తీరుపై దృష్టి సారించింది. కొన్ని దేశాలు వెంటనే నిర్ణయం తీసుకున్నాయి. వ్యాధి సోకినవారిని ఇతరులకు దూరంగా పెట్టి ఈ పరిస్థితులను అధిగమించాయి. 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో, నిరంతరం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న మన దేశం ముందుకు కరోనా విపత్తు రావడం సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపించడాన్ని మనం చూస్తున్నాం. అయితే, దీని ప్రభావం భారత్ పై పడదని భావించడం తప్పు. ప్రపంచ స్థాయి లో విజృంభిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు అంశాలు అవసరం.. మొదటిది సంకల్పం, రెండవది సంయమనం. ఈ రోజు 130 కోట్ల మంది దేశ ప్రజలందరూ దృఢ సంకల్పంతో విశ్వజనులను ఇబ్బందులపాలు చేస్తున్న మహమ్మారిని నియంత్రించేందుకు దేశ పౌరులుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అందరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శక సూత్రాలను పాటిద్దాం. ఈ రోజు మనం సంకల్పం చేసుకోవాలి. ఈ వ్యాధి మనకు రాకుండా చూసుకోవాలి. ఇతరులు కూడా ఈ వ్యాధిబారిన పడకుండా చర్యలు చేపట్టాలి.
మిత్రులారా,
ప్రపంచస్థాయిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మనకు కార్యసాధనను అందించే మంత్రం ఒక్కటే. “మన ఆరోగ్యమే ప్రపంచ ఆరోగ్యం”. ఈ వ్యాధికి మందు లేదు. ఈ నేపథ్యంలో మనమంతా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఈ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి తప్పనిసరిగా మనకు కావల్సింది సంయమనం. సంయమనం అంటే ఏమిటి? ‘గుంపుల నుంచి దూరంగా ఉండడం’ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండడం. ఈ రోజుల్లో దీనినే సామాజికంగా దూరంగా ఉండడం అంటారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ తరుణంలో ఇది చాలా అవసరం. మన సంకల్పం, సంయమనం ఈ ప్రపంచ మహమ్మారి దుష్ప్రభావాన్ని తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. అంతమాత్రాన మీరు ఆరోగ్యంగా ఉన్నారని, మీకేం కాదని, మీరు మార్కెట్ లో ఇలాగే తిరుగుతుంటారని, రోడ్ల పై ఎప్పటిలాగే సంచరిస్తూ ఉంటారని, కరోనా నుంచి రక్షింపబడతారని ఆలోచించడం సరైంది కాదు. దానివల్ల మీరు, మీతోపాటు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేసిన వారవుతారు. అందువల్ల మనదేశ పౌరులందరికీ నా మనవి ఏమిటంటే, రానున్న కొన్ని వారాలపాటు బయటకు రాకూడదు. తప్పనిసరైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. సాధ్యమైనంత వరకు మీ పనులను, వాణిజ్య కార్యకలాపాలు కానివ్వండి, ఆఫీసుకు సంబంధించిన పనులను ఇంటి నుంచే చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది క్రియాశీలంగా పనిచేయడం అవసరమే. అయితే, సమాజంలోని ఇతరులందరినీ, మీతోపాటు సమాజానికి దూరంగా ఉంచాలి. నాదొక మనవి.. మన కుటుంబంలోని వయో వృద్ధులు, అరవై అయిదు సంవత్సరాలు పైబడినవారు, వీరంతా ఒక వారం వరకు ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దు. నేటి తరానికి ఈ విషయం తెలియకపోవచ్చు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఈ వేళలో మనం కూడా అటువంటి ప్రక్రియలను అనుసరించక తప్పదు.
స్నేహితులారా,
నేను ప్రతిఒక్క భారతీయ పౌరుడి నుంచి ఒక మద్ధతును కోరుతున్నాను. అదే ‘జనతా కర్ఫ్యూ’ .. ప్రజల కర్ఫ్యూ. ‘ప్రజల కర్ఫ్యూ’ అంటే ప్రజల ద్వారా ప్రజలే విధించుకున్న కర్ఫ్యూ. వచ్చే ఆదివారం అంటే, మార్చి 22వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పౌరులందరూ ‘జనతా కర్ఫ్యూ’ను పాటించాలి. ఈ సమయంలో మనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదు. రోడ్ల మీదకి రాకూడదు. వీధుల్లో సంచరించరాదు. అవసరమైన పనులకు మాత్రమే మార్చి 22న ప్రజలు బయటకు వెళ్లాలి. మార్చి 22వ తేదీన మనం పాటించే ఈ సంయమనం, చేసే ప్రయత్నం, దేశ సంక్షేమానికి చేపట్టిన సంకల్పానికి ప్రతీకగా నిలిచిపోతుంది. మార్చి 22న విధించుకునే ప్రజా కర్ఫ్యూ విజయం, దాని నుంచి నేర్చుకున్న అనుభవాలు మున్ముందు రాబోయే సవాళ్లకు మనల్ని సంసిద్ధుల్ని చేస్తాయి. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ నా మనవి ఏమిటంటే, ప్రజా కర్ఫ్యూ అమలుకు సారధ్యం వహించాలి. ఇందుకోసం, ఎన్ సిసి, ఎన్ఎస్ఎస్ ల సేవలతో సంబంధాలున్న యువతీ యువకులు, పౌర సమాజం, ఇతర సంస్థలు అన్నింటికీ నేను చేసే మనవి ఏమిటంటే.. ఇప్పటి నుంచి రాబోయే రెండు రోజుల వరకు ప్రజా కర్ఫ్యూ ను గురించి ప్రజలలో జాగృతి కలుగజేయాలి. అందుకు వారిని సంసిద్ధులను చేయాలి. అవసరమైతే.. ప్రతి ఒక్క వ్యక్తి కనీసం 10 మందికి ఫోన్ చేసి కరోనా వైరస్ నుంచి తప్పించుకునే ఉపాయాలను వివరించాలి. అలాగే.. జనతా కర్ఫ్యూ గురించి కూడా వివరించాలి.
మిత్రులారా,
ఈ జనతా కర్ఫ్యూ అనేది మనకు, మనదేశానికి ఒక పరీక్షా సమయం లాంటిది. ఇదే సమయంలో ప్రపంచ స్థాయిలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారితో పోరాటం చేయడానికి భారత్ ఏ మాత్రం సంసిద్ధంగా ఉందనే అంశాన్ని తెలుసుకోవాల్సిన తరుణమిది. మీ ప్రయత్నాలు ఈ దిశలో సాగుతుండగా.. ప్రజా కర్ఫ్యూ రోజున మార్చి 22న మీ నుంచి మరొక సహకారం నేను పొందగోరుతున్నాను.
మిత్రులారా,
గత రెండు నెలలుగా లక్షలాది మంది సిబ్బంది ఆస్పత్రులలో, విమానాశ్రయాలలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. వారు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఆస్పత్రి సిబ్బంది కావచ్చు, సఫాయి కర్మచారి సోదర సోదరీమణులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, రైల్వే సిబ్బంది, బస్సు, ఆటోరిక్షా లాంటి సేవలకు సంబంధించిన వ్యక్తులు, హోం డెలివరీ చేసే వారు, వీరంతా తమ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా, ఇతరుల సేవలో నిమగ్నులై ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు చేసే సేవలు అసాధారణమైనవి. వీళ్లకు కూడా వ్యాధి సోకే ముప్పు పొంచి ఉంది. అయినప్పటికీ వీరు తమ కర్తవ్య నిర్వహణలో రేయింబవళ్ళు నిమగ్నమై ఉన్నారు. పరోపకార పరాయణత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. రక్షకులు. మాకు, కొరోనా మహమ్మారి కి మధ్యలో నిలబడి ఉన్నారు. వీరికి దేశమంతా కృతజ్ఞతలు చెబుతోంది. నా కోరిక ఒక్కటే. మార్చి 22వ తేదీ ఆదివారం నాడు మనం ఇటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు సమర్పించాలి. ఆదివారం సరిగ్గా 5 గంటలకు మనం అందరమూ ఇంటి వాకిటి వద్ద నిలబడి, బాల్కనీలో గాని, లేదా కిటికీల దగ్గర గాని నిల్చొని 5 నిమిషాల పాటు ఇటువంటి వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి. చప్పట్లు కొట్టడం ద్వారా, ప్లేట్లను వాయించడం ద్వారా, లేదా గంట కొట్టడం ద్వారా వీరందరికీ వందనాలు సమర్పించాలి. వీరి మనోబలాన్ని ద్విగుణీకృతం చేయాలి. దేశంలోని స్థానిక ప్రభుత్వాలకు నా మనవి ఒక్కటే. మార్చి 22వ తేదీన సరిగ్గా 5 గంటలకు సైరన్ మోత వినిపించడం తోనే ప్రజలకు ఈ సందేశాన్ని అందించాలి. మన సంస్కారం సేవాహీ పరమో ధర్మః. దీనిని ప్రజలందరికీ తెలియచేయాలి. శ్రద్ధ తో ఈ భావాన్ని అభివ్యక్తం చేయాలి.
మిత్రులారా..
ఈ విపత్కర సమయం లో మీరందరూ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అత్యవసర సేవలకు డిమాండ్ పెరిగిపోతోంది. మన ఆస్పత్రులపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. అందువల్ల నా మనవి ఒక్కటే. నియమిత చర్య గా చేసుకునే వైద్య పరీక్షల కోసం వీలైనంత వరకు ఆస్పత్రుల చుట్టూ తిరగడం ఆపివేయాలి. మీకు అత్యవసరమైతే.. మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్లండి. మీ కుటుంబ వైద్యుడి దగ్గరకు వెళ్లవచ్చు. లేదా మీ బంధువులలో ఎవరైనా వైద్యులు ఉంటే.. ఫోన్ చేసి అవసరమైన సలహాలను పొందవచ్చు. మీరు ఏదైనా శస్త్ర చికిత్స చేసుకోవాలనుకుంటే.. ముందుగా తేదీని నిర్ణయించుకుని ఉంటే.. దానిని వాయిదా వేసుకోండి. ఒక నెల రోజుల తరువాత ఆ కార్యక్రమాన్ని పెట్టుకోండి.
మిత్రులారా..
కరోనా మహమ్మారి దుష్ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ ను అతలాకుతలం చేసేసింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థికమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఒక ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టాస్క్ ఫోర్స్ అవసరమైన వారందరితో మాట్లాడుతూ.. ప్రతిస్పందనలను స్వీకరిస్తూ పరిస్థితులను అంచనా వేస్తూ వీలైనంత త్వరలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో అవసరమైన చర్యలను చేపట్టేందుకు ఈ టాస్క్ ఫోర్స్ సముచిత నిర్ణయం తీసుకుంటుంది. వాటిని అమలు చేస్తుంది కూడా. ఈ మహమ్మారి కారణంగా మధ్యతరగతి ప్రజల, పేద ప్రజల ఆర్థికాభివృద్ధి కి విఘాతం కలిగింది. ఈ విపత్కర సమయం లో మన దేశంలోని వ్యాపారవర్గాలకు అత్యధిక ఆదాయమున్న ప్రజలకు మనవి చేసేది ఏమిటంటే అవసరమైతే మీరు ఎవరి నుంచి సేవలు పొందుతున్నారో వారి ఆర్థిక సంక్షేమాన్ని గురించి ఆలోచించండి. ఇటువంటి వారు కొన్ని రోజుల పాటు ఆఫీసు కు రాలేకపోవచ్చు. మీ ఇంటికి రాకపోవచ్చు. ఇలాంటి స్థితి లో వీరి జీతాల లో కోతల ను విధించవద్దు. సంపూర్ణమైన మానవతా దృక్పథంతో స్పందిస్తూ నిర్ణయాలు తీసుకోండి. ఒక సంగతి ని నిరంతరం జ్ఞాపకం పెట్టుకోండి.. వారు కూడా వారి కుటుంబాలను పరిరక్షించుకోవలసి ఉంది. కుటుంబ సభ్యులను కొరోనా బారి నుంచి సంరక్షించుకోవలసి ఉంటుంది. మా దేశ వాసులందరికీ కావలసిన పాలు, తినుబండారాలు, మందులు, జీవితానికి అవసరమైన ఇతర సామగ్రి.. వీటన్నింటి కి ఏ మాత్రం లోటు రాకుండా చూసుకోవాలి. అందువల్ల దేశ ప్రజలందరికీ అనవసరమైన సామగ్రి ని సేకరించే కార్యక్రమాలు చేపట్టవద్దని మనవి చేస్తున్నాం. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే మామూలుగానే కొనుక్కోండి. అంతేగాని నిత్యావసర వస్తువులను భయాందోళనలతో కొనేసి దాచిపెట్టకండి.
మిత్రులారా.. గత రెండు నెలలుగా 130కోట్ల మంది భారతీయులలో ప్రతి ఒక్క పౌరుడు దేశం ఎదుర్కొంటున్న ఈ విపత్తు ను తన విపత్తు గా భావించారు. ప్రతిఒక్కరూ తనకు చేతనైనంతగా సేవలందించారు. మున్ముందు కూడా మీరందరూ మీ కర్తవ్యాలను నిర్వహిస్తారని, బాధ్యతలను నెరవేరుస్తారని నా నమ్మకం. ఇటువంటి సమయాలలో కొన్ని ఇబ్బందులు రావడం సహజం. కొన్ని వదంతులు వ్యాపించి వాతావరణమంతా విచిత్రంగా మారిపోవచ్చు. కొన్నిసార్లు పౌరుడి గా మన కోరికలు కొన్ని తీరకపోవచ్చు. ఏది ఏమైనప్పటికి, ఈ విపత్కర సమయం లో దేశ ప్రజలందరూ ఈ కష్టాల మధ్యలోనే దృఢసంకల్పం తో ఇబ్బందులన్నింటిని ఎదుర్కోవాలి.
మిత్రులారా..
మనమందరమూ కలసి కరోనా ను ఎదుర్కోవడంలో మన సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. దేశం లో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి.. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి.. స్థానిక సంస్థలు కానివ్వండి.. పంచాయతీ లు కావచ్చు.. ప్రజాప్రతినిధులు కావచ్చు.. పౌర సంఘాలు కావచ్చు.. ప్రతి ఒక్కరూ మహమ్మారి ని తరిమి కొట్టడానికి వారి వంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలి. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ వాతావరణం లో మానవాళి కి విజయం చేకూరాలి. మన దేశం విజయపథం లో మున్ముందుకు సాగాలి. ఇంకా కొద్ది రోజులలో నవరాత్రి పండుగ రానుంది. ఇది శక్తి ఉపాసన కు సంబంధించిన పర్వదినం. భారతదేశం దృఢశక్తి తో ప్రగతిపథం లో ముందంజ వేయాలి. మీకు ఇవే నా శుభాకాంక్షలు. మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.
*****
Watch Live! https://t.co/UHSCp7Wcu9
— PMO India (@PMOIndia) March 19, 2020
मेरे प्रिय देशवासियों,
— PMO India (@PMOIndia) March 19, 2020
पूरा विश्व इस समय संकट के बहुत बड़े गंभीर दौर से गुजर रहा है: PM @narendramodi #IndiaFightsCorona
आम तौर पर कभी जब कोई प्राकृतिक संकट आता है तो वो कुछ देशों या राज्यों तक ही सीमित रहता है।
— PMO India (@PMOIndia) March 19, 2020
लेकिन इस बार ये संकट ऐसा है, जिसने विश्व भर में पूरी मानवजाति को संकट में डाल दिया है: PM @narendramodi #IndiaFightsCorona
इन दो महीनों में भारत के
— PMO India (@PMOIndia) March 19, 2020
130 करोड़ नागरिकों ने कोरोना वैश्विक महामारी का डटकर मुकाबला किया है, आवश्यक सावधानियां बरती हैं।
लेकिन,
बीते कुछ दिनों से ऐसा भी लग रहा है जैसे हम संकट से बचे हुए हैं,
सब कुछ ठीक है: PM @narendramodi #IndiaFightsCorona
वैश्विक महामारी कोरोना से निश्चिंत हो जाने की ये सोच सही नहीं है।
— PMO India (@PMOIndia) March 19, 2020
इसलिए,
प्रत्येक भारतवासी का सजग रहना,
सतर्क रहना बहुत आवश्यक है: PM @narendramodi #IndiaFightsCorona
साथियों,
— PMO India (@PMOIndia) March 19, 2020
आपसे मैंने जब भी,
जो भी मांगा है,
मुझे कभी देशवासियों ने निराश नहीं किया है।
ये आपके आशीर्वाद की ताकत है कि हमारे प्रयास सफल होते हैं: PM @narendramodi #IndiaFightsCorona
मैं आप सभी देशवासियों से, आपसे,
— PMO India (@PMOIndia) March 19, 2020
कुछ मांगने आया हूं।
मुझे आपके आने वाले कुछ सप्ताह चाहिए,
आपका आने वाला कुछ समय चाहिए: PM @narendramodi #IndiaFightsCorona
अभी तक विज्ञान,
— PMO India (@PMOIndia) March 19, 2020
कोरोना महामारी से बचने के लिए,
कोई निश्चित उपाय नहीं सुझा सका है और न ही इसकी कोई वैक्सीन बन पाई है।
ऐसी स्थिति में चिंता बढ़नी बहुत स्वाभाविक है: PM @narendramodi #IndiaFightsCorona
इन देशों में शुरुआती कुछ दिनों के बाद अचानक बीमारी का जैसे विस्फोट हुआ है।
— PMO India (@PMOIndia) March 19, 2020
इन देशों में कोरोना से संक्रमित लोगों की संख्या बहुत तेजी से बढ़ी है।
भारत सरकार इस स्थिति पर, कोरोना के फैलाव के इस ट्रैक रिकॉर्ड पर पूरी तरह नजर रखे हुए है: PM @narendramodi #IndiaFightsCorona
आज जब
— PMO India (@PMOIndia) March 19, 2020
बड़े-बड़े और विकसित देशों में हम कोरोना महामारी का व्यापक प्रभाव देख रहे हैं,
तो भारत पर इसका कोई प्रभाव नहीं पड़ेगा,
ये मानना गलत है: PM @narendramodi #IndiaFightsCorona
इसलिए,
— PMO India (@PMOIndia) March 19, 2020
इस वैश्विक महामारी का मुकाबला करने के लिए दो प्रमुख बातों की आवश्यकता है।
पहला- संकल्प
और
दूसरा- संयम: PM @narendramodi #IndiaFightsCorona
आज 130 करोड़ देशवासियों को अपना संकल्प और दृढ़ करना होगा कि हम इस वैश्विक महामारी को रोकने के लिए एक नागरिक के नाते,
— PMO India (@PMOIndia) March 19, 2020
अपने कर्तव्य का पालन करेंगे,
केंद्र सरकार,
राज्य सरकारों के दिशा निर्देशों का पालन करेंगे: PM @narendramodi #IndiaFightsCorona
आज हमें ये संकल्प लेना होगा कि हम स्वयं संक्रमित होने से बचेंगे और दूसरों को भी संक्रमित होने से बचाएंगे।
— PMO India (@PMOIndia) March 19, 2020
साथियों,
इस तरह की वैश्विक महामारी में, एक ही मंत्र काम करता है- “हम स्वस्थ तो जग स्वस्थ”: PM @narendramodi #IndiaFightsCorona
ऐसी स्थिति में,
— PMO India (@PMOIndia) March 19, 2020
जब इस बीमारी की कोई दवा नहीं है,
तो हमारा खुद का स्वस्थ बने रहना बहुत आवश्यक है।
इस बीमारी से बचने और खुद के स्वस्थ बने रहने के लिए अनिवार्य है संयम: PM @narendramodi #IndiaFightsCorona
और संयम का तरीका क्या है- भीड़ से बचना,
— PMO India (@PMOIndia) March 19, 2020
घर से बाहर निकलने से बचना।
आजकल जिसे Social Distancing कहा जा रहा है, कोरोना वैश्विक महामारी के इस दौर में,
ये बहुत ज्यादा आवश्यक है: PM @narendramodi #IndiaFightsCorona
इसलिए मेरा सभी देशवासियों से ये आग्रह है कि आने वाले कुछ सप्ताह तक,
— PMO India (@PMOIndia) March 19, 2020
जब बहुत जरूरी हो तभी अपने घर से बाहर निकलें।
जितना संभव हो सके,
आप अपना काम,
चाहे बिजनेस से जुड़ा हो,
ऑफिस से जुड़ा हो,
अपने घर से ही करें: PM @narendramodi #IndiaFightsCorona
मेरा एक और आग्रह है कि हमारे परिवार में जो भी सीनियर सिटिजन्स हों,
— PMO India (@PMOIndia) March 19, 2020
65 वर्ष की आयु के ऊपर के व्यक्ति हों,
वो आने वाले कुछ सप्ताह तक घर से बाहर न निकलें: PM @narendramodi #IndiaFightsCorona
आज की पीढ़ी इससे बहुत परिचित नहीं होगी,
— PMO India (@PMOIndia) March 19, 2020
लेकिन पुराने समय में जब युद्ध की स्थिति होती थी,
तो गाँव गाँव में
BlackOut किया जाता था। घरों के शीशों पर कागज़ लगाया जाता था, लाईट बंद कर दी जाती थी, लोग चौकी बनाकर पहरा देते थे: PM @narendramodi #IndiaFightsCorona
मैं आज प्रत्येक देशवासी से एक और समर्थन मांग रहा हूं।
— PMO India (@PMOIndia) March 19, 2020
ये है जनता-कर्फ्यू।
जनता कर्फ्यू यानि जनता के लिए,
जनता द्वारा खुद पर लगाया गया कर्फ्यू: PM @narendramodi #IndiaFightsCorona
इस रविवार,
— PMO India (@PMOIndia) March 19, 2020
यानि
22 मार्च को,
सुबह 7 बजे से रात
9 बजे तक, सभी देशवासियों को,
जनता-कर्फ्यू का पालन करना है: PM @narendramodi #IndiaFightsCorona
साथियों,
— PMO India (@PMOIndia) March 19, 2020
22 मार्च को हमारा ये प्रयास, हमारे आत्म-संयम,
देशहित में कर्तव्य पालन के संकल्प का एक प्रतीक होगा।
22 मार्च को जनता-कर्फ्यू की सफलता, इसके अनुभव, हमें आने वाली चुनौतियों के लिए भी तैयार करेंगे: PM @narendramodi #IndiaFightsCorona
संभव हो तो हर व्यक्ति प्रतिदिन कम से कम
— PMO India (@PMOIndia) March 19, 2020
10 लोगों को फोन करके कोरोना वायरस से बचाव के उपायों के साथ ही जनता-कर्फ्यू के बारे में भी बताए।
साथियों,
ये जनता कर्फ्यू एक प्रकार से हमारे लिए,
भारत के लिए एक कसौटी की तरह होगा: PM @narendramodi #IndiaFightsCorona
ये कोरोना जैसी वैश्विक महामारी के खिलाफ लड़ाई के लिए भारत कितना तैयार है, ये देखने और परखने का भी समय है।
— PMO India (@PMOIndia) March 19, 2020
आपके इन प्रयासों के बीच, जनता-कर्फ्यू के दिन,
22 मार्च को मैं आपसे एक और सहयोग चाहता हूं: PM @narendramodi #IndiaFightsCorona
मैं चाहता हूं कि
— PMO India (@PMOIndia) March 19, 2020
22 मार्च, रविवार के दिन हम ऐसे सभी लोगों को धन्यवाद अर्पित करें।
रविवार को ठीक
5 बजे,
हम अपने घर के दरवाजे पर खड़े होकर,
बाल्कनी में,
खिड़कियों के
सामने खड़े होकर
5 मिनट तक ऐसे लोगों का आभार व्यक्त करें: PM @narendramodi #IndiaFightsCorona
पूरे देश के स्थानीय प्रशासन से भी मेरा आग्रह है कि
— PMO India (@PMOIndia) March 19, 2020
22 मार्च को
5 बजे,
सायरन की आवाज से इसकी सूचना लोगों तक पहुंचाएं।
सेवा परमो धर्म के हमारे संस्कारों को मानने वाले ऐसे देशवासियों के लिए हमें पूरी श्रद्धा के साथ अपने भाव व्यक्त करने होंगे: PM @narendramodi #IndiaFightsCorona
संकट के इस समय में,
— PMO India (@PMOIndia) March 19, 2020
आपको ये भी ध्यान रखना है कि हमारी आवश्यक सेवाओं पर,
हमारे हॉस्पिटलों पर दबाव भी निरंतर बढ़ रहा है।
इसलिए मेरा आपसे आग्रह ये भी है कि रूटीन चेक-अप के लिए अस्पताल जाने से जितना बच सकते हैं,
उतना बचें: PM @narendramodi #IndiaFightsCorona
कोरोना महामारी से उत्पन्न हो रही आर्थिक चुनौतियों को ध्यान में रखते हुए, वित्त मंत्री के नेतृत्व में सरकार ने एक
— PMO India (@PMOIndia) March 19, 2020
कोविड-19-Economic Response Task Force
के गठन का फैसला लिया है: PM @narendramodi #IndiaFightsCorona
ये टास्क फोर्स,
— PMO India (@PMOIndia) March 19, 2020
ये भी सुनिश्चित करेगी कि, आर्थिक मुश्किलों को कम करने के लिए जितने भी कदम उठाए जाएं,
उन पर प्रभावी रूप से अमल हो: PM @narendramodi #IndiaFightsCorona
संकट के इस समय में मेरा देश के व्यापारी जगत,
— PMO India (@PMOIndia) March 19, 2020
उच्च आय वर्ग से भी आग्रह है कि अगर संभव है तो आप
जिन-जिन लोगों से सेवाएं लेते हैं, उनके आर्थिक हितों का ध्यान रखें: PM @narendramodi #IndiaFightsCorona
मैं देशवासियों को इस बात के लिए भी आश्वस्त करता हूं कि देश में दूध,
— PMO India (@PMOIndia) March 19, 2020
खाने-पीने का सामान, दवाइयां,
जीवन के लिए ज़रूरी ऐसी आवश्यक चीज़ों की कमी ना हो इसके लिए तमाम कदम उठाए जा रहे हैं: PM @narendramodi #IndiaFightsCorona
पिछले दो महीनों में,
— PMO India (@PMOIndia) March 19, 2020
130 करोड़ भारतीयों ने,
देश के हर नागरिक ने,
देश के सामने आए इस संकट को अपना संकट माना है,
भारत के लिए,
समाज के लिए उससे जो बन पड़ा है,
उसने किया है: PM @narendramodi #IndiaFightsCorona
मुझे भरोसा है कि आने वाले समय में भी आप अपने कर्तव्यों का,
— PMO India (@PMOIndia) March 19, 2020
अपने दायित्वों का इसी तरह निर्वहन करते रहेंगे।
हां, मैं मानता हूं कि ऐसे समय में कुछ कठिनाइयां भी आती हैं, आशंकाओं और अफवाहों का वातावरण भी पैदा होता है: PM @narendramodi #IndiaFightsCorona
कुछ दिन में नवरात्रि का पर्व आ रहा है।
— PMO India (@PMOIndia) March 19, 2020
ये शक्ति उपासना का पर्व है।
भारत पूरी शक्ति के साथ आगे बढ़े, यही शुभकामना है: PM @narendramodi #IndiaFightsCorona
My address to the nation. #IndiaFightsCorona https://t.co/w3nMRwksxJ
— Narendra Modi (@narendramodi) March 19, 2020
The world has seen various crisis and challenges but the situation arising due to COVID-19 is unprecedented.
— Narendra Modi (@narendramodi) March 19, 2020
We in India are leaving no stone unturned to overcome this menace.
Need of the hour is to be alert and vigilant. #IndiaFightsCorona pic.twitter.com/vdK3oYj6sx
Stay at home and do not step out until it is absolutely essential.
— Narendra Modi (@narendramodi) March 19, 2020
I specially urge the elderly to not venture out of their homes. #IndiaFightsCorona pic.twitter.com/ae2ld4VHBW
On 22nd March 2020, let us observe a Janata Curfew and add strength to the fight against COVID-19. #IndiaFightsCorona. pic.twitter.com/qOqhQaJES5
— Narendra Modi (@narendramodi) March 19, 2020
At 5 PM on 22nd March 2020, the day of the Janata Curfew, I have a special request. Will you all help? #IndiaFightsCorona pic.twitter.com/Qi63adPUJh
— Narendra Modi (@narendramodi) March 19, 2020
A COVID-19 Economic Response Task Force would be created to work on aspects relating to the economy and help various stakeholders. #IndiaFightsCorona pic.twitter.com/FaBuIfsefE
— Narendra Modi (@narendramodi) March 19, 2020
A request to the people of India- please do not indulge in panic buying. #IndiaFightsCorona pic.twitter.com/ZG1ho45hQG
— Narendra Modi (@narendramodi) March 19, 2020