Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కరవుపైనా,నీటి ఎద్దడి స్థితి పైనా ఒడిశా ముఖ్యమంత్రి తో ప్రధాన మంత్రి సమీక్షా సమావేశం

s2016052183668


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఒడిశా రాష్ట్రంలో నెలకొన్న కరవు, నీటి ఎద్దడి పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ తో పాటు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఒడిశా రాష్ట్రానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్ డి ఆర్ ఎఫ్) కింద రూ.600.52 కోట్ల ను విడుదల చేశారు. ఇది 2015-16 సంవత్సరంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్ డి ఆర్ ఎఫ్)కి అందించిన రూ. 560.25 కోట్ల కు అదనం. అలాగే 2016-17 కాలానికి ఎస్ డి ఆర్ ఎఫ్ కోసం మొదటి విడతగా రూ. 294.375 కోట్ల ను విడుదల చేశారు.

నీటి సంరక్షణ చర్యలలో భాగంగా ఇప్పటి వరకు ఒడిశా 25,000 నీటి చెరువులను నిర్మించింది. అలాగే 7,000 చెక్ డ్యామ్ లు, 4,000 ఇంకుడు గుంతలు, 400 నీటి పారుదల నిర్మాణాలు, 350 సామాజిక చెరువులను నిర్మించారు.

‘ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన’ కింద ఒడిశాలో 30 జిల్లాలకు సంబందించి సాగు నీటి ప్రణాళికలను పూర్తి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం అమలుకు ఒడిశా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ సమావేశంలో వివిధ వ్యవసాయ పథకాలు, పైపుల ద్వారా నీటి సరఫరా, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సదుపాయాల కల్పన తదితర విషయాలపై చర్చించారు. చివరగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు.