ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ కు ఆధికారిక సందర్శన లో భాగం గా ఈ రోజు న దోహా కు చేరుకొన్నారు. దోహా ను ప్రధాన మంత్రి సందర్శించడం ఇది రెండో సారి, ఆయన 2016 వ సంవత్సరం జూన్ లో మొట్టమొదటి సారి గా కతర్ కు వచ్చారు.
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ సుల్తాన్ బిన్ సాద్ అల్-మురైఖీ విమానాశ్రయం లో ప్రధాన మంత్రి కి ఆహ్వానం పలికారు.
ప్రధాన మంత్రి తన రెండు రోజు ల సందర్శన లో భాగం గా, తన గౌరవార్థం కతర్ ప్రధాని శ్రీ శేఖ్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహమాన్ అల్ థానీ ఈ రోజు రాత్రి పూట ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఫిబ్రవరి 15 వ తేదీ న కతర్ యొక్క అమీరు శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ తో ప్రధాన మంత్రి సమావేశం కావడం తో పాటు గా ద్వైపాక్షిక అంశాల పై, ప్రాంతీయ అంశాల పై మరియు ప్రపంచ అంశాల పై చర్చలు జరుపుతారు.
***
Landed in Doha. Looking forward to a fruitful Qatar visit which will deepen India-Qatar friendship. pic.twitter.com/h6QHKpqYcm
— Narendra Modi (@narendramodi) February 14, 2024
هبطت في الدوحة. إنني أتطلع إلى زيارة مثمرة إلى قطر من شأنها تعميق الصداقة بين الهند وقطر. pic.twitter.com/6wzjFPjrph
— Narendra Modi (@narendramodi) February 14, 2024