Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఓడీఎఫ్‌ ప్లస్‌ ఆదర్శ కేటగిరీ సాధనపై అండమాన్‌-నికోబార్‌.. లక్షద్వీప్.. దాద్రా-నాగర్‌హవేలి కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రధానమంత్రి అభినందనలు


   అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్, దాద్రా-నాగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు  స్వచ్ఛభారత నిర్మాణంపై విశేష నిబద్ధత ప్రదర్శించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓడీఎఫ్‌ ప్లస్‌ స్థాయిని సాధించిన గ్రామాల సంఖ్య కేవలం ఏడాది వ్యవధిలో ఐదు రెట్లు పెరగడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పోస్ట్‌ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశంలో:

“అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్, దాద్రా-నాగర్ హవేలీ, దమన్-దయ్యూ ప్రాంతాల ప్రజలు ఈ విషయంపై గర్వపడుతున్నారు. స్వచ్ఛభారత్‌ నిర్మాణంలో వారు విశేష నిబద్ధత ప్రదర్శించడం ప్రశంసనీయం” అని పేర్కొన్నారు.