Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒసాము సుజుకి మృతికి ప్రధానమంత్రి సంతాపం


అంతర్జాతీయ ఆటోమోటివ్ పరిశ్రమ దిగ్గజం ఒసాము సుజుకీ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారుఒసాము సుజుకి దూరదృష్టి వాహన రంగంలో ప్రపంచ దృక్పథాన్ని మార్చేసిందని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారుఆయన నాయకత్వంలో సుజుకీ మోటార్ కార్పొరేషన్ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని ఆవిష్కరణలువిస్తరణతో అంతర్జాతీయ శక్తిగా ఎదిగిందని అన్నారు.

‘‘ఎక్స్‌’’లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమ దిగ్గజం ఒసాము సుజుకీ మరణం దిగ్భ్రాంతి కలిగించిందిఆయన దూరదృష్టి వాహన రంగంలో ప్రపంచ దృక్పథాన్ని మార్చేసిందిఆయన నాయకత్వంలో సుజుకీ మోటార్ కార్పొరేషన్ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని ఆవిష్కరణలువిస్తరణతో అంతర్జాతీయ శక్తిగా ఎదిగిందిభారత్ అంటే ఆయనకు అవ్యాజమైన ప్రేమమారుతీతో ఆయన భాగస్వామ్యం దేశంలో ఆటోమొబైల్ మార్కెట్లో విప్లవాన్ని తీసుకొచ్చింది’’.

‘‘సుజుకీతో నిర్వహించిన చర్చల జ్ఞాపకాలను మనసులో నిక్షిప్తం చేసుకుంటూఆయన ఆచరణాత్మకమైనవినయపూర్వక విధానాన్ని గౌరవిస్తానుకష్టపడి పనిచేసే తత్వంప్రతి అంశంపై నిశిత దృష్టినాణ్యతలో రాజీలేని తత్వంతో ఉదాహరణగా నిలిచారుఆయన కుటుంబానికిసహచరులకుఅసంఖ్యాకమైన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’.