Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒమన్ సుల్తాన్‌తో ప్రధానమంత్రి సమావేశం

ఒమన్ సుల్తాన్‌తో ప్రధానమంత్రి సమావేశం


   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఒమ‌న్ సుల్తాన్ గౌరవనీయ హైతం బిన్ తారిక్‌తో స‌మావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల‌పై దేశాధినేతలిద్దరూ స‌మీక్షించారు.

   అలాగే వాణిజ్యం, సంస్కృతి, రక్షణ, ఆవిష్కరణలుసహా ఇతరత్రా రంగాల్లో సహకార విస్తరణ మార్గాన్వేషణ గురించి కూడా వారు చర్చించారు.

ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:

‘‘ఒమన్‌ సుల్తాన్ గౌరవనీయ హైతం బిన్ తారిక్‌తో నా సమావేశం ఫలప్రదమైంది. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాలను మేము పూర్తిస్థాయిలో సమీక్షించాం. అదేవిధంగా వాణిజ్యం, సంస్కృతి, రక్షణ, ఆవిష్కరణలు సహా మరిన్ని రంగాల్లో సహకార బలోపేతానికి మార్గాన్వేషణపైనా లోతుగా చర్చించుకున్నాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.