Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా లో నూతన ప్రభుత్వ పదవీస్వీకార ప్రమాణం కార్యక్రమానికి హాజరు అయిన ప్రధాన మంత్రి

ఒడిశా లో నూతన ప్రభుత్వ పదవీస్వీకార ప్రమాణం కార్యక్రమానికి హాజరు అయిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా కు ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన శ్రీ మోహన్ చరణ్ మాఝి కి అభినందనలను తెలియజేశారు. శ్రీ కనక్ వర్ధన్ సింహ్ దేవ్ మరియు శ్రీమతి ప్రవాతీ పరిదా లు ఉప ముఖ్యమంత్రులు గా ప్రమాణం చేసినందుకు వారికి కూడా ఆయన తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో ఈ క్రింది విధం గా ఒక సందేశాన్ని నమోదు చేశారు:

‘‘ఇది ఒడిశా లో ఓ చరిత్రాత్మకమైన దినం. ఒడిశాలో నా సోదరీమణులు మరియు నా సోదరుల ఆశీర్వాదాలతో, బిజెపి రాష్ట్రంలోకెల్లా తన ప్రప్రథమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది.

 

భువనేశ్వర్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను హాజరయ్యాను. ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన శ్రీ మోహన్ చరణ్ మాఝి కి మరియు ఉప ముఖ్యమంత్రులుగా పదవీప్రమాణాన్ని స్వీకరించిన శ్రీ కనక్ వర్ధన్ సింహ్ దేవ్ కు, అలాగే శ్రీమతి ప్రవాతీ పరిదా కు కూడాను ఇవే అభినందనలు.  మంత్రులుగా పదవీప్రమాణాన్ని స్వీకరించిన ఇతర ప్రముఖుల కు కూడా అభినందన లు.

‘‘మహాప్రభు జగన్నాథ్ యొక్క దీవెనలతో, ఈ జట్టు ఒడిశా లో రికార్డు స్థాయి లో అభివృద్ధి ని తీసుకు వస్తుందని మరి అసంఖ్యాక ప్రజల జీవనాలను మెరుగుపరుస్తుందని నేను నమ్ముతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

ଓଡ଼ିଶାରେ ଏକ ଐତିହାସିକ ଦିନଓଡ଼ିଶାର ଭାଇ  ଭଉଣୀଙ୍କ ଆଶୀର୍ବାଦରୁ @BJP4Odisha ରାଜ୍ୟରେ ପ୍ରଥମ ଥର ପାଇଁ ସରକାର ଗଠନ କରୁଛି 

ମୁଁ ଭୁବନେଶ୍ରରେ ଶପଥ ଗ୍ରହଣ ସମାରୋହରେ ଅଂଶଗ୍ରହଣ କଲି। ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବେ ଶପଥ ନେଇଥିବା ଶ୍ରୀ ମୋହନ ଚରଣ ମାଝୀ ଏବଂ ଉପମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବେ ଶପଥ ଗ୍ରହଣ କରିଥିବା ଶ୍ରୀ କନକ ବର୍ଦ୍ଧନ ସିଂହଦେଓ ଏବଂ ଶ୍ରୀମତୀ ପ୍ରଭାତୀ ପରିଡ଼ାଙ୍କୁ ଅଭିନନ୍ଦନ ।
ମନ୍ତ୍ରୀ ଭାବରେ ଶପଥ ନେଇଥିବା ଅନ୍ୟମାନଙ୍କୁ ମଧ୍ୟ ଶୁଭେଚ୍ଛା।

ମହାପ୍ରଭୁ ଜଗନ୍ନାଥଙ୍କ ଆଶୀର୍ବାଦରୁ ଏହି ଦଳ ରାଜ୍ୟରେ ବିକାଶର ନୂଆ ରେକର୍ଡ କରିବ ଏବଂ ଅଗଣିତ ଜନସାଧାରଣଙ୍କ ଜୀବନରେ ସୁଧାର ଆଣିବ ବୋଲି ମୋର ବିଶ୍ାସ ରହିଛି 

 

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం కూడా ‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi ఒడిశా లో క్రొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు అయ్యారు. శ్రీ @mohanmajhi_BJP ముఖ్యమంత్రి అయినందుకు ఆయన అభినందనలను తెలియజేశారు. ఈ రోజు న ప్రమాణాన్ని స్వీకరించిన ఇతర మంత్రులను కూడా ప్రధాన మంత్రి అభినందించారు.’’ అంటూ ఒక సందేశాన్ని నమోదు చేసింది.