Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా లోని చండీఖోల్‌ లో, క‌ర్నాట‌క‌ లోని పాదుర్‌ లో 6.5 ఎమ్ఎమ్ టి పెట్రోలియమ్ వ్యూహాత్మ‌క అద‌న‌పు నిల్వ సదుపాయాల క‌ల్ప‌న‌ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఒడిశా లోని చండీఖోల్‌ లోను, క‌ర్నాట‌క‌ లోని పాదుర్‌ లోను 6.5 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల (ఎంఎం టి) వ్యూహాత్మ‌క పెట్రోలియమ్ నిల్వ‌ (స్ట్రేటెజిక్ పెట్రోలియమ్ రిజర్వ్ స్.. ఎస్ పిఆర్) సదుపాయాల‌ను అదనంగా ఏర్పాటు చేసేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ రెండు వ్యూహాత్మ‌క పెట్రోలియమ్ నిల్వ కేంద్రాల వ‌ద్ద వీటి కోసం ప్ర‌త్యేకంగా ఎస్‌ పిఎమ్ (సింగిల్ పాయింట్ మువరింగ్‌)ల నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చండీఖోల్‌, పాదుర్‌ ల వ‌ద్ద ఏర్పాటు చేసే ఎస్‌పిఆర్ సౌక‌ర్యాలు అండర్ గ్రౌండ్ రాక్ కేవర్న్ ల రూపంలో ఉంటాయి. చండీఖోల్‌ సామ‌ర్ధ్యం 4 ఎంఎం టి గాను, పాదుర్‌ సామ‌ర్ధ్యం 2.5 ఎంఎం టి గాను ఉంటుంది. మరో రెండు ఎస్‌పిఆర్‌ ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు 2017-2018 బ‌డ్జెటు సందర్భంగా కేంద్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

భార‌త ప్ర‌భుత్వం నుండి బ‌డ్జెటు మ‌ద్ద‌తు ను త‌గ్గించేందుకు ఈ ప్రాజెక్టు ను పిపిపి ప‌ద్ధ‌తిలో చేప‌ట్టేందుకు సూత్ర‌ప్రాయ అనుమ‌తి అవ‌స‌ర‌మైంది. ఆస‌క్తి చూపే ఇన్వెస్ట‌ర్ లను, మార్కెట్ అవ‌స‌రాల‌ను తెలుసుకొనేందుకు రోడ్‌ శో లను నిర్వ‌హించిన అనంత‌రం ఆర్థిక మంత్రిత్వ‌ శాఖ‌ తో పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంప్ర‌దింపులు జరిపి అప్పుడు ఇందుకు సంబంధించిన నిబంధ‌న‌లను, ష‌ర‌తులను నిర్ణ‌యిస్తుంది.

ఇండియన్ స్ట్రేటెజిక్ పెట్రోలియమ్ రిజర్వ్ స్ లిమిటెడ్ (ఐఎస్‌పిఆర్ఎల్) ఇప్ప‌టికే భూగ‌ర్భం లో మూడు ప్రాంతాలలో.. విశాఖ‌ప‌ట్నం (1.33 ఎంఎంటి), మంగ‌ళూరు (1.5 ఎంఎంటి) పాదుర్ (2.5 ఎంఎంటి) వ‌ద్ద మూడు ప్రాంతాల‌లో 5.33 ఎఎంటి నిల్వ సామ‌ర్ధ్యం గ‌ల పెద్ద గుహ ల‌ను నిర్మించింది. ఎస్‌పిఆర్ తొలిద‌శ కార్య‌క్ర‌మం కింద మొత్తం 5.33 ఎంఎంటిల సామ‌ర్ధ్యంగ‌ల క్రూడ్ స‌ర‌ఫ‌రా చేయ‌డానికి వీలు క‌లుగుతుంది. ఇది 2016-2017 ఆర్థిక సంవ‌త్స‌రం వినియోగ అంచ‌నాల ప్ర‌కారం భార‌తదేశ ముడి చ‌మురు అవ‌స‌రాల లెక్క‌ ప్ర‌కారం సుమారు 10 రోజుల స‌ర‌ఫ‌రా స‌ర‌ఫ‌రాల‌ను స‌మ‌కూర్చ‌గ‌ల‌దు.

అద‌నంగా 6.5 ఎంఎంటి ల వ్యూహాత్మ‌క పెట్రోలియమ్ నిల్వ సౌక‌ర్యాల ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గం తెలిపిన ఆమోదం వ‌ల్ల అద‌నంగా మ‌రో 12 రోజుల ముడిచ‌మురు స‌ర‌ఫ‌రాలు అందుబాటులో ఉంటాయి. ఇది భార‌త‌దేశ‌పు ఇంధ‌న భ‌ద్ర‌త‌ ను మ‌రింత పెంచుతుంది.

చండీఖోల్‌, పాదుర్‌ ల‌లో వ్యూహాత్మ‌క పెట్రోలియమ్ నిల్వ‌ల అద‌న‌పు సౌక‌ర్యాల క‌ల్ప‌న‌ వల్ల ఒడిశా, క‌ర్నాట‌క ల‌లో ప్ర‌త్య‌క్షంగాను, ప‌రోక్షంగాను గణనీయమైన స్థాయిలో ఉపాధి అవ‌కాశాలకు ఆస్కారం ఏర్పడగలదు.