Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా లోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి ప్రాణ నష్టం జరగడంపై తీవ్ర వ్యథను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి; రాష్ట్రానికి సాధ్యమైన అన్ని విధాలుగానూ సహాయాన్ని అందిస్తామని హామీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా లోని ఒక ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి ప్రాణ నష్టం జరగడం పట్ల తీవ్ర వ్యథను వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మరియు బాధిత కుటుంబాలకు కేంద్రం నుండి వీలైన అన్ని రకాలుగానూ తోడ్పాటును అందిస్తామని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా హామీని ఇచ్చారు.

“ఒడిశాలో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి ప్రాణ నష్టం జరిగినందుకు నేను ఎంతో కలత చెందుతున్నాను. ఈ విషాదం మనస్సును స్తబ్దతకు లోను చేసింది. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల శోకంలో నేను పాలు పంచుకుంటున్నాను.

మంత్రి శ్రీ జె.పి.నడ్డా తో మాట్లాడాను; ప్రమాదంలో గాయపడిన వారిని అందరినీ ఎ ఐ ఐ ఎమ్ ఎస్ కు తరలించడంలో సహాయపడవలసిందని సూచించాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

అలాగే, మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తోనూ మాట్లాడాను. ప్రమాదంలో గాయపడిన వారికి, బాధితులకు చేతనైనంత సహాయం అందేటట్లుగా చూడవలసిందంటూ ఆయనను కోరాను.

ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటనను గురించి ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ తో కూడా నేను సంభాషించాను. కేంద్రం నుండి సాధ్యమైన అన్ని విధాలుగానూ సహాయాన్ని అందజేస్తామంటూ ఆయనకు మాట ఇచ్చాను” అని ప్రధాన మంత్రి తెలిపారు.