Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా మరియు భారతదేశ తూర్పు ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధి కి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాన మంత్రి

ఒడిశా మరియు భారతదేశ తూర్పు ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధి కి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాన మంత్రి

ఒడిశా మరియు భారతదేశ తూర్పు ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధి కి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాన మంత్రి

ఒడిశా మరియు భారతదేశ తూర్పు ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధి కి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఒడిశా లోని బలాంగీర్ ను సందర్శించారు. ఆయన 1500 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభించారు; అలాగే, వివిధ ప్రోజెక్టు లకు శంకుస్థాపనలు చేశారు.

ప్రధాన మంత్రి ఈ రోజు ఉదయం రాయ్ పుర్ లో స్వామి వివేకానంద విమానాశ్రయాని కి విచ్చేసి, అక్కడి నుండి బలాంగీర్ కు బయలుదేరారు. బలాంగీర్ లో ఆయన ఝార్సు గూడ మల్టి- మోడల్ లాజిస్టిక్స్ పార్క్ (ఎమ్ఎమ్ఎల్ పి) ని దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ ఎమ్ఎమ్ఎల్ పి ఝార్సు గూడ ను ఆ ప్రాంతాని కి లాజిస్టిక్స్ హబ్ గా మార్చివేయగలుగుతుంది. రైలు ప్రోజెక్టు లకు ఒక ప్రోత్సాహక చర్య గా- బలాంగీర్, బీచుపలీ ల మధ్య 115 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మాణం జరిగిన నూతన రైల్వే లైను ను శ్రీ మోదీ ప్రారంభించారు.

గత మూడు వారాల వ్యవధి లో ఒడిశా ను తాను సందర్శించడం ఇది మూడో సారి అని, ఒడిశా ప్రజల కు తన వచనబద్ధత కు ఇది ఒక నిదర్శనం అని ఆయన చెప్పారు. బలాంగీర్ లో గల రైల్వే యార్డు లో సభికుల ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ‘‘ప్రభుత్వం ఒడిశా అభివృద్ధి కి, భారతదేశ తూర్పు ప్రాంతాల వికాసానికి నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. బలాంగీర్ లో అభివృద్ధి పథకాల పరంపర ను మొదలుపెట్టడం ఈ దిశ గా వేసిన ఒక అడుగు’’ అన్నారు.

నాగావళీ నది మీద నూతన వంతెన ను, బార్ పలీ, దుంగరీపాలీ ల మధ్య మరియు బలాంగీర్, దేవ్ గావ్ ల మధ్య రైలు మార్గాల డబ్లింగ్ పనుల ను, ఝార్సు గుడా- విజయనగరం, సంబల్ పుర్- అంగుల్ లైన్ ల యొక్క 813 కి.మీ. విద్యుదీకరణ జరిగిన మార్గాన్ని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. ఒడిశా లోని సోన్ పుర్ లో 15.81 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మాణం జరుగనున్న కేంద్రీయ విద్యాలయ భవనాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. సంధానం మరియు విద్య ల యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఆయన వివరిస్తూ, ‘‘విద్య మానవ వికాసానికి బాట పరుస్తుంది. అయితే, అటువంటి వనరుల ను అవకాశం గా మార్చేటటువంటిదే సంధానం. 6 రైల్వే ప్రోజెక్టు లను ప్రారంభించడం సంధానాన్ని పెంపొందింపచేయడం కోసం మేం చేస్తున్న కృషి. ఇది ప్రజల రాకపోకలను సుగమం చేయగలుగుతుంది; ఖనిజ వనరుల ను పరిశ్రమ కు మరింత అందుబాటు లోకి తీసుకు రాగలుగుతుంది; అంతేకాదు, రైతులు వారి దిగుబడుల ను దూర ప్రాంతాల లోని విపణుల కు తీసుకు పోవడం లో సహాయకారి కాగలుగుతుంది; తద్వారా ఒడిశా పౌరుల జీవన సౌలభ్యాన్ని అధికం చేస్తుంది’’ అని వివరించారు.

సంస్కృతి మరియు వారసత్వాల పరిరక్షణ కు తాను కట్టుబడి ఉన్నానని ప్రధాన మంత్రి చెప్తూ, ఇది మన సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయగలదని, రాష్ట్రం యొక్క పర్యటక రంగ సామర్థ్యాన్ని పెంపొందించగలదని పేర్కొన్నారు. గంధరాదీ (బౌధ్)లో నీలమాధవ మరియు సిద్ధేశ్వర ఆలయాల జీర్ణోద్ధరణ, ఇంకా నవీనీకరణ సంబంధిత పనుల పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. బలాంగీర్ లో రాణీపుర్ ఝరియల్ కట్టడాల సముదాయం తో పాటు కాలాహాండీ లోని అసుర్ గఢ్ కోట జీర్ణోద్ధరణ, నవీనీకరణ పనులను కూడా ఆయన ప్రారంభించారు.