Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా పూర్వముఖ్య మంత్రి శ్రీ బీజూ పట్ నాయక్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని అర్పించినప్రధాన మంత్రి


ఒడిశా యొక్క పూర్వ ముఖ్య మంత్రి శ్రీ బీజూ పట్ నాయక్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

మహానుభావుడు శ్రీ బీజూ పట్ నాయక్ గారి దూరదర్శి నాయకత్వం మరియు ఆయన యొక్క అజేయమైనటువంటి స్ఫూర్తి తరాల తరబడి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

‘‘నేను మహానుభావుడు శ్రీ బీజూ పట్ నాయక్ జీ కి ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను. ఆయన దూరదర్శి నాయకత్వం తో పాటు ఆయన యొక్క అజేయమైనటువంటి స్ఫూర్తి భావి తరాల కు సదా ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి. మన దేశ ప్రజల కు ఆయన అందించిన తోడ్పాటు మరియు అభివృద్ధి పట్ల ఆయన కు గల అచంచలమైన నిబద్ధత అనేవి మార్గదర్శకప్రాయం అయినటువంటివి గా ఉన్నాయి. ఈ రోజు న, ఈ యొక్క విశేషమైనటువంటి రోజు న, నేను చండీఖోల్ లో వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించే వేళ ఒడిశా లోని ప్రజల మధ్యన ఒకరు గా ఉండడానికి ఆశ పడుతున్నాను. నేను @BJP4Odisha జన సభ ను ఉద్దేశించి ప్రసంగించనున్నాను.’’ అని పేర్కొన్నారు.