ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒడిశాలో రూ.8000 కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో పూరీ-హౌరా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభించటం, పూరీ, కటక్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధికి శంకుస్థాపన, ఒడిశాలో రైల్ నెట్ వర్క్ 100% విద్యుదీకరణని జాతికి అంకితం చేయటం అంగుల్ -సుకినాడ మధ్య కొత్త బ్రాడ్ గేజ్ రైలు మార్గం, మనోహర్ పూర్- రూర్కెలా-జర్సుగూడ – జంగా మధ్య కొత్త మార్గం, బిచ్చుపల్లి-ఝర్తర్భా మధ్య కొత్త బ్రాడ్ గేజ్ మార్గం ఉన్నాయి.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ, ఈ రోజు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రజలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందిస్తున్నామన్నారు. ఇది ఆధునిక, ఆకాంక్షాపూరితమైన భారతదేశానికి నిదర్శనమన్నారు. “భారత దేశపు వేగాన్ని, పురోగతిని వందే భారత్ రైలు రూపంలో చూడవచ్చు” అన్నారు. ఈ వేగాన్ని ఇప్పుడు ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో చూడగలుగుతున్నట్టు చెప్పారు. అభివృద్ధి పట్ల వైఖరిని ఇది పూర్తిగా మార్చి వేయటంతోబాటు ప్రయాణీకుల కొత్త అనుభూతికి కారణమవుతుందన్నారు. కోల్ కత్తా నుంచి పూరీ కి దర్శనం కోసమో మరో పనిమీదనో వెళ్ళేవారికి ప్రయాణ సమయం ఆరున్నర గంటలకు తగ్గిపోతుందన్నారు. దీనివలన సమయం ఆదా కావటంతో బాటు వ్యాపార అవకాశాలు, యువతకు కొత్త అవకాశాలు పెరుగుతాయని ప్రధాని వ్యాఖ్యానించారు.
దూరప్రయాణాలు చేయాలనుకునే పౌరులకు రైళ్ళు తొలి ప్రాధాన్యమని గుర్తు చేశారు. ఈరోజు శంకుస్థాపన చేసిన ఇతర రైల్వే ప్రాజెక్టులలో పూరీ, కటక్ స్టేషన్ల పునరభివృద్ధి, రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు, ఒడిశాలో 100 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ ఉన్నాయని ప్రధాని చెప్పారు.
‘ఆజాదీ కా అమృత్ కాల్’ నడుస్తున్నదని గుర్తు చేస్తూ, దేశ సమైక్యతను, సమగ్రతను సుస్థిరం చేయాల్సిన అవసరముందన్నారు. దేశ ఉమ్మడి సామర్థ్యాలు శిఖర స్థాయికి చేరుకోవాలంటే దేశం యావత్తూ ఒక తాటిమీద నడవాలని పిలుపునిచ్చారు. వందే భారత్ రైలు అలాంటి భావనకు ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి ఇంజన్ గా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అభివర్ణించారు. అది ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదానికి ప్రతీక అన్నారు.
“భారత రైల్వేలు అందరినీ ఒక తానులో దారమై అనుసంధానం చేస్తాయి. వందే భారత్ రైలు కూడా అదే ఆలోచనా ధోరణితో ముందుకు దూసుకుపోతోంది” అన్నారు. ఈ రోజు ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పూరీ- హౌరీ మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాన్ని పెంచుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇప్పటికే 15 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయని గుర్తు చేస్తూ, అవి దేశ ఆర్థికాభివృద్ధిని ముందుకు నడిపిస్తాయన్నారు.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ భారత అభివృద్ధి వేగం కొనసాగుతోందని ప్రధాని అభిప్రాయపవడ్డారు. ప్రతి రాష్ట్రాన్నీ కలుపుకుంటూ ఈ యాత్రలో ప్రతి పౌరుడూ పాల్గొనటమే అందుకు కారణమన్నారు. ఇంతకు ముందున్న పరిస్థితికి భిన్నంగా స్వదేశీ సాంకేతికాభివృద్ధి సాధిస్తూ నవ భారతం దాన్ని దేశంలోని మారుమూల ప్రాంతాలకూ తీసుకు వెళుతోందన్నారు. వందే భారత్ రైళ్ళు కూడా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంక్షోభ సమయంలోనూ భారతదేశం కోవిడ టీకా మందు తయారు చేసిందని, 5 జి టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఈ ఆవిష్కరణలు కొన్ని ప్రాంతాలకో, కొన్ని నగరాలలో పరిమితం కాలేదని, దేశమంతటా సమానంగా అందుబాటులోకి తెచ్చామని చెప్పా రు. అదే విధంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా దేశం నలుమూలలకూ వెళుతున్నాయన్నారు.
అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాలకు ‘సబ్ కా సాథ్ , సబ్ కా వికాస్’ పాలసీ ఎంతగానో ఉపయోగపడుతున్నదని ప్రధాని అన్నారు. ఒడిసాలో రైల్వే పథకాలకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయన్నారు. 2014 కు పదేళ్ళ ముందు ఏటా సగటున 20 కిలోమీటర్ల రైలు మార్గమే నిర్మించగా 2022-23 లో అది 120 కిలోమీటర్లు అయిందన్నారు. దీర్ఘ కాలం పెండింగ్ లో పడిన ఖుర్దా బోలన్ గిర్ లైన్, హరిదాస్ పూర్ -పారాదీప్ లైన్ ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయని గుర్తు చేశారు.
“దేశంలో నూరు శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ సాధించిన రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి” అని చెబుతూ, ఇదే తరహా ప్రగతి సాధించటానికి పశ్చిమ బెంగాల్ లోనూ పనులు జరుగుతున్నాయన్నారు. ఒడిశాలో రైల్వే ప్రాజెక్టులమీద దృష్టిసారించిన ఫలితంగా ప్రయాణ రైళ్లతోబాటు సరకు రవాణా రైళ్ళ వేగం కూడా చెప్పుకోదగినంతగా పెరిగిందన్నారు. ఖనిజ నిల్వలు గణనీయంగా ఉన్న ఒడిశా రాష్ట్రం రైల్వే లైన్ల విద్యుదీకరణ వలన బాగా లాభం పొందుతుందని, అదే సమయంలో డీజిల్ వలన వెలువడే కాలుష్యం తగ్గుతుందని అన్నారు. మొత్తంగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
మౌలిక వసతుల అభివృద్ధి గురించి కూడా ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. “మౌలిక వసతులు ప్రజల జీవితాలను సుఖమయం చేయటంతోబాటు సమాజాన్ని సాధికారం చేస్తాయి” అన్నారు. మౌలిక వసతులు కుంటుబడినప్పుడు ప్రజల అభివృద్ధి కూడా వెనుకబడుతుందన్నారు. “మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే, అభివృద్ధి వేగం పుంజుకొని ప్రజలు అభివృద్ధి చెందుతారు” అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను ప్రస్తావిస్తూ, పిఎం సౌభాగ్య యోజనను గుర్తు చేశారు. “దీనికింద ప్రభుత్వం 2.5 కోట్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించింది. అందులో 25 లక్షల ఇళ్ళు ఒడిశాలో, 7.25 లక్షల ఇళ్ళు పశ్చిమ బెంగాల్ లో ఉన్నాయి” అన్నారు.
దేశంలో విమానాశ్రయాల సంఖ్య 75 నుంచి ఈ రోజు 150 కి చేరిందని చెబుతూ, సామాన్య పౌరులు విమానాల్లో ప్రయాణిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలను గుర్తు చేశారు.
భారతదేశం మౌలిక వసతుల కల్పనలో సాధించిన ప్రగతిని ఇప్పుడు అందరూ అధ్యయనం చేస్తున్నారన్నారు. బడ్జెట్ లో దీనికోసం 10 లక్షల కోట్లు కేటాయించామని చెబుతూ దీనివల్ల లక్షలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి ఫలాలు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయని, రైతులను కొత్త మార్కెట్లతో అనుసంధానం చేస్తాయని, పర్యాటకులు కొత్త కొత్త ప్రదేశాలకు సులువుగా చేరుకోగలుగుతారని, విద్యార్థులు తాము కోరుకున్న కళాశాలలకు వెళ్లగలుగుతారని చెప్పారు.
దేశం ‘మానవ సేవే మాధవ సేవ’ నినాద స్ఫూర్తితో ముందుకు సాగుతోందని ప్రధాని అన్నారు. జగన్నాథ ఆలయం లాంటి దేవాలయాలు, పూరీలాంటి యాత్రా స్థలాలు వేలాది మంది పేదలకు శతాబ్దాల తరబడి ప్రసాదాలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. అదే రకమైన స్ఫూర్తితో పిఎం గరీబ్ కళ్యాణ్ పథకం ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ జరిగిందన్నారు. ఆయుష్మాన్ కార్డ్, ఉజ్జ్వల, జల్ జీవన్ మిషన్, పిఎం ఆవాస్ యోజన లాంటి పథకాలని కూడా ప్రధాని ప్రస్తావించారు. “నిరుపేదలు ఎన్నో ఏళ్ల తరబడి ఎదురుచూసిన ప్రాథమిక సౌకర్యాలు ఇప్పుడు అందుకుంటున్నారు” అన్నారు.
ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, ఒడిశా. పశ్చిమ బెంగాల్ తోబాటు యావత్ దేశంలో అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం సమైక్యంగా ఉండి నవ భారత్ నిర్మాణాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఒడిశా గవర్నర్ శ్రీ గణేశ్ లాల్, ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్, కేంద్ర రైల్వేశాఖామంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి , వ్యాపార దక్షత శాఖామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ప్రధాని నరేంద్ర మోదీ పూరీ-హౌరా మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఒడిసాలోని ఖోర్దా, కటక్, జైపూర్, భద్రక్, బాలాసోర్ జిల్లాల గుండా, పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మేదినీపూర్, పుర్బా, మేదినీపూర్ జిల్లాల గుండా ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో రైలు ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్య వంతమైన, అనుకూలమైన ప్రయాణ అనుభూతినిస్తుంది.అదే విధంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.
పూరీ, కటక్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇలా పునరభివృద్ధి చేసిన స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలుంటాయి. రైలు ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
ఒడిశా లో 100% రైలుమార్గాల విద్యుదీకరణను ప్రధాని జాతికి అంకితం చేశారు. దీనివలన ఒడిశాలో రైలుమార్గాల నిర్వహణ వ్యయం బాగా తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతి భారం తగ్గుతుంది. ప్రధాని సంబల్పూర్-టిట్లాగర్ రైలు మార్గం డబ్లింగ్ ను కూడా జాతికి అంకితం చేశారు. అంగుల్ -సుకిందా మధ్య కొత్త బ్రాడ్ గేజ్ మార్గం ప్రారంభించారు. మనోహర్పూర్ – రూర్కెలా-జర్స్ గూడా -జంగా మూడో లైన్ ప్రారంభించారు. ఉక్కు, విద్యుత్, గనుల త్రవ్వక రంగాలలో వేగంగా సాగుతున్న పారిశ్రామికాభివృద్ధి నేపథ్యంలో ఈ కొత్త మార్గాలు ట్రాఫిక్ డిమాండ్ ను తట్టుకోవటానికి ఉపయోగపడతాయి. దీనివలన ప్రయాణీకుల రవాణా మీద వత్తిడి తగ్గుతుంది.
Railway projects being launched in Odisha will significantly boost connectivity and enhance ‘Ease of Travel’ for the citizens. https://t.co/WWls5vqJNc
— Narendra Modi (@narendramodi) May 18, 2023
वंदेभारत ट्रेन, आधुनिक भारत और आकांक्षी भारतीय, दोनों का प्रतीक बन रही है। pic.twitter.com/wjtQHsOYiX
— PMO India (@PMOIndia) May 18, 2023
बीते वर्षों में भारत ने कठिन से कठिन वैश्विक हालातों में भी अपने विकास की गति को बनाए रखा है। pic.twitter.com/O8yk4MN0D7
— PMO India (@PMOIndia) May 18, 2023
आज का नया भारत टेक्नोलॉजी भी खुद बना रहा है और नई सुविधाओं को तेजी से देश के कोने-कोने में पहुंचा रहा है। pic.twitter.com/96bQksEbwJ
— PMO India (@PMOIndia) May 18, 2023
जहां infrastructure का विकास होता है, वहां लोगों का विकास भी तेजी से होता है। pic.twitter.com/7v1WRyWENU
— PMO India (@PMOIndia) May 18, 2023
जन सेवा ही प्रभु सेवा। pic.twitter.com/zDsViKHHKt
— PMO India (@PMOIndia) May 18, 2023
भारत के तेज विकास के लिए, भारत के राज्यों का संतुलित विकास भी उतना ही आवश्यक है। pic.twitter.com/UnU4xvlMaD
— PMO India (@PMOIndia) May 18, 2023
*****
DS/TS
Railway projects being launched in Odisha will significantly boost connectivity and enhance 'Ease of Travel' for the citizens. https://t.co/WWls5vqJNc
— Narendra Modi (@narendramodi) May 18, 2023
वंदेभारत ट्रेन, आधुनिक भारत और आकांक्षी भारतीय, दोनों का प्रतीक बन रही है। pic.twitter.com/wjtQHsOYiX
— PMO India (@PMOIndia) May 18, 2023
Railway projects being launched in Odisha will significantly boost connectivity and enhance 'Ease of Travel' for the citizens. https://t.co/WWls5vqJNc
— Narendra Modi (@narendramodi) May 18, 2023
बीते वर्षों में भारत ने कठिन से कठिन वैश्विक हालातों में भी अपने विकास की गति को बनाए रखा है। pic.twitter.com/O8yk4MN0D7
— PMO India (@PMOIndia) May 18, 2023
आज का नया भारत टेक्नोलॉजी भी खुद बना रहा है और नई सुविधाओं को तेजी से देश के कोने-कोने में पहुंचा रहा है। pic.twitter.com/96bQksEbwJ
— PMO India (@PMOIndia) May 18, 2023
जहां infrastructure का विकास होता है, वहां लोगों का विकास भी तेजी से होता है। pic.twitter.com/7v1WRyWENU
— PMO India (@PMOIndia) May 18, 2023
जन सेवा ही प्रभु सेवा। pic.twitter.com/zDsViKHHKt
— PMO India (@PMOIndia) May 18, 2023
भारत के तेज विकास के लिए, भारत के राज्यों का संतुलित विकास भी उतना ही आवश्यक है। pic.twitter.com/UnU4xvlMaD
— PMO India (@PMOIndia) May 18, 2023
वंदे भारत ट्रेनें देश की एकता और सामूहिक सामर्थ्य की भावना का प्रतिबिंब हैं। पुरी-हावड़ा के बीच आज शुरू हुई यह ट्रेन बंगाल और ओडिशा के आध्यात्मिक एवं सांस्कृतिक संबंधों को और मजबूती देगी। pic.twitter.com/bEMXOc2142
— Narendra Modi (@narendramodi) May 18, 2023
बीते नौ वर्षों से भारत अपनी प्रगति के लिए सभी राज्यों को साथ लेकर आगे बढ़ रहा है। यही वजह है कि कठिन से कठिन वैश्विक हालात में भी देश में विकास की गति कायम है। pic.twitter.com/0G6pv6vy9C
— Narendra Modi (@narendramodi) May 18, 2023
एक मजबूत इंफ्रास्ट्रक्चर न केवल हर क्षेत्र में विकास को बढ़ावा देता है, बल्कि इससे रोजगार के भी अनेक अवसर बनते हैं। इसी सोच के साथ आज ओडिशा सहित पूरे देश में आधुनिक इंफ्रास्ट्रक्चर पर रिकॉर्ड निवेश किया जा रहा है। pic.twitter.com/TMSyiSMLFb
— Narendra Modi (@narendramodi) May 18, 2023