Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒక లక్ష కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ ను కేవలం ఒక సంవత్సర కాలం లో దక్కించుకొన్నందుకుగవర్నమెంట్ ఇ- మార్కెట్ ప్లేస్ (జిఇఎమ్) ను ప్రశంసించిన ప్రధాన మంత్రి 


 

ఆర్థిక సంవత్సరం 2021-22 లో ఒక లక్ష కోట్ల రూపాయల వార్షిక కొనుగోళ్ళ ను సంపాదించినందుకు గవర్నమెంట్ ఇ- మార్కెట్ ప్లేస్ (జిఇఎమ్) ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. జిఇఎమ్ ప్లాట్ ఫార్మ్ ప్రత్యేకించి సూక్ష్మ, లఘు మరియు మధ్య తరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) లను పటిష్టపరచే కార్యాన్ని నిర్వహిస్తోందని, ఆర్డరు ల మొత్తం విలువ లో 57 శాతం ఈ రంగం నుంచే వచ్చిందని కూడా ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఒక లక్ష కోట్ల రూపాయల విలువైన ఆర్డరు ను @GeM_India ఒక సంవత్సర కాలం లోనే దక్కించుకొందని తెలిసి సంతోషం వేసింది. ఇది వెనుకటి సంవత్సరాల తో పోల్చి చూసినప్పుడు మహత్త్వపూర్ణమైనటువంటి వృద్ధి అని చెప్పవచ్చు. జిఇఎమ్ ప్లాట్ ఫార్మ్ ప్రత్యేకించి సూక్ష్మ, లఘు మరియు మధ్య తరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) లను పటిష్టపరుస్తోంది; మరి ఆర్డరు ల మొత్తం విలువ లో 57 శాతం ఎమ్ఎస్ఎమ్ఇ రంగం నుంచే వచ్చింది.’’ అని పేర్కొన్నారు.