Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐ ఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ లో ప్రతిభ కనబరచిన భారత షూటర్లకు ప్రధాని అభినందనలు


ఐ ఎస్ ఎస్ ఎఫ్  జూనియర్ వరల్డ్ కప్-2023 లో ప్రతిభ ప్రదర్శించిన భారతీయ షూటర్లను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ పోటీల్లో భారతదేశం మొత్తం 15 పతకాలు సాధించి పతకాల జాబితాల్లో అగ్రస్థానంలో నిలిచింది.  

ప్రధాని ఇలా ట్వీట్ చేశారు: 

“మన షూటర్లు మనల్ని గర్వించేలా చేస్తూనే ఉన్నారు ! ఐ ఎస్ ఎస్ ఎఫ్  జూనియర్ వరల్డ్ కప్-2023 లో భారత జట్టు అద్భుతమైన ప్రతిభ కనబరచింది. 15 పతకాలు గెలుచుకొని విజేతల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.  ప్రతి విజయం మన యువ క్రీడాకారుల ఆశక్తికి, అంకిత భావాణికీ, స్ఫూర్తికీ నిదర్శనంగా నిలుస్తోంది. వాళ్ళకు నా  అభినందనలు.”