రెండో ఇండియా-నార్డిక్ సమిట్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో ఐస్ లాండ్ ప్రధాని శ్రీ కెట్ రీన్ జేకోబ్ స్దోతిర్ తో ఒక ద్వైపాక్షిక సమావేశం లో పాల్గొన్నారు.
ఒకటో ఇండియా-నార్డిక్ సమిట్ 2018వ సంవత్సరం ఏప్రిల్ లో స్టాక్ హోమ్ జరిగినప్పుడు మొదటిసారి వారు సమావేశమైన సంగతి ని గుర్తు కు తెచ్చుకొన్నారు. ఈ సంవత్సరం లో రెండు దేశాలు దౌత్య సంబంధాల ను ఏర్పరచుకొని 50వ వార్షికోత్సవం జరుపుకోనున్నాయన్న సంగతి ని వారు లెక్క లోకి తీసుకొన్నారు.
ఆర్థిక సహకారాన్ని మరింత గా బలపరచుకోవడం గురించి, విశేషించి జియో థర్మల్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, ఆర్క్ టిక్, పునర్ నవీకరణ యోగ్య శక్తి, మత్స్య పరిశ్రమ, ఫూట్ ప్రోసెసింగ్, విద్యా బోధన, సంస్కృతి వంటి రంగాల లో దృష్టి సారించాలి అని నేతలు ఇద్దరు చర్చించుకొన్నారు. ఐస్ లాండ్ కు ప్రత్యేకమైన ప్రావీణ్యం ఉన్నటువంటి జియో థర్మల్ ఎనర్జీ రంగం లో రెండు దేశాల విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం కోసం కృషి చేయాలి అనే అంశాన్ని ఉభయ పక్షాలు గుర్తించాయి.
పురుషుల కు, మహిళల కు సమానమైనటువంటి అవకాశాలు లభించేటట్లు చూడటం లో ప్రధాని జేకోబ్ స్దోతిర్ స్వీయ ప్రయాసల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు ఈ విషయం లో భారతదేశం చేపడుతున్న కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ఆమె కు వివరించారు.
ఇండియా-ఇఎఫ్ టిఎ వ్యాపార సంప్రదింపుల ను వేగవంతం చేయడం అనే అంశం మీద కూడా చర్చలు జరిగాయి.
ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచం లో ఘటన క్రమాలు కూడా చర్చల లో చోటు చేసుకొన్నాయి.
****
Prime Minister @narendramodi held talks with PM @katrinjak of Iceland. They discussed boosting ties in areas like trade, energy, fisheries and more. pic.twitter.com/kw2koKnm9t
— PMO India (@PMOIndia) May 4, 2022