Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐసీఏ అంతర్జాతీయ సహకార సదస్సు-2024ను ప్రారంభించనున్న ప్రధాని


ఐసీఏ అంతర్జాతీయ సహకార సదస్సు2024తోపాటు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం గంటల సమయంలో ప్రారంభించనున్నారు.

ఐసీఏ అంతర్జాతీయ సహకార సదస్సుఐసీఏ సాధారణ సమావేశాలను అంతర్జాతీయ సహకార కూటమి (ఐసీఏ) 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి భారత్ లో నిర్వహిస్తున్నారుఅంతర్జాతీయ సహకార ఉద్యమంలో అది ప్రధాన సంస్థఐసీఏకేంద్ర ప్రభుత్వంభారతీయ సహకార సంస్థలైన అమూల్క్రిభ్ కో సహకారంతో రైతులుఎరువుల సహకార సంస్థ (ఐఎఫ్ఎఫ్ సీవోనిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సు నవంబరు 25 నుంచి 30 వరకు జరుగుతుంది.

సహకార సంఘాలు అందరి శ్రేయస్సునిస్తాయి’ అన్నది సదస్సు ఇతివృత్తం. ‘సహకార్ సే సమృద్ధి’ అన్న భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా దీనిని రూపొందించారుచర్చలునిపుణుల సదస్సులుకార్యశాలలుఐక్యారాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ప్రపంచవ్యాప్తంగా సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంఅవకాశాల వివరాలు మొదలైనవి ఈ కార్యక్రమంలో ఉంటాయిముఖ్యంగా పేదరిక నిర్మూలనలింగ సమానత్వంసుస్థిర ఆర్థిక వృద్ధి వంటి అంశాలను చర్చిస్తారు.

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంఘాల సంవత్సరం 2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ‘సహకార సంఘాలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి’ అన్న ఇతివృత్తంపై ఇది ప్రధానంగా దృష్టిపెడుతుందిసామాజిక సమ్మిళితత్వంఆర్థిక సాధికారతసుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహకార సంఘాల పరివర్తనాత్మక పాత్రకు ఇవి ప్రాధాన్యం ఇస్తాయిఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సహకార సంస్థలను సుస్థిరాభివృద్ధికి కీలకంగా పరిగణిస్తాయిముఖ్యంగా అసమానతలను తగ్గించడంలోగౌరవంతో కూడిన పనిని ప్రోత్సహించడంలోపేదరిక నిర్మూలనలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయిప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లను పరిష్కరించడంలో సహకార సంస్థల శక్తిని చాటే లక్ష్యంతో అంతర్జాతీయ కార్యక్రమంగా 2025 సంవత్సరం నిలవనుంది.

సహకార ఉద్యమంపై భారతదేశ నిబద్ధతకు ప్రతీకగా ఒక స్మారక పోస్టల్ స్టాంప్‌ను కూడా ప్రధాని ఆవిష్కరిస్తారుస్టాంపులో ఉండే కమలం శాంతిశక్తిపునరుజ్జీవనంవృద్ధికి సంకేతంగా.. సహకార విలువలైన సుస్థిరతసామాజిక అభివృద్ధిని ప్రతిబింబిస్తుందికమలంలోని ఐదు రేకులు ప్రకృతిలోని ఐదు అంశాలను సూచిస్తాయి (పంచతత్వం). పర్యావరణసామాజికఆర్థిక సుస్థిరతకు అవి ప్రతీకలువ్యవసాయంలో ఆధునిక సాంకేతికత పాత్రను సూచించేలా డ్రోన్‌తో వ్యవసాయంపాడిపరిశ్రమమత్స్య పరిశ్రమవినియోగదారుల సహకార సంఘాలుగృహనిర్మాణం వంటి రంగాలను కూడా ఈ నమూనాలో పొందుపరిచారు.

భూటాన్ ప్రధానమంత్రి శ్రీ దాషో షెరింగ్ టొబ్గేఫిజి ఉప ప్రధానమంత్రి శ్రీ మనోవా కామికమికా, 100కు పైగా దేశాల నుంచి 3,000కు పైగా ప్రతినిధులు కూడా పాల్గొంటారు

 

***