Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐరోపా మండలి.. ఐరోపా కమిషన్‌ అధ్యక్షులతో ప్రధానమంత్రి సమావేశం

ఐరోపా మండలి.. ఐరోపా కమిషన్‌ అధ్యక్షులతో ప్రధానమంత్రి సమావేశం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో  కొమొరెజ్‌ సమాఖ్య అధ్యక్షులు మాననీయ అజలీ అసౌమనితో 2023 సెప్టెంబరు 10న సమావేశమయ్యారు. జి-20 కూటమిలో ఆఫ్రికా సమాఖ్య శాశ్వత సభ్యత్వం పొందడంలో ప్రధానమంత్రి కృషికి ఈ సందర్భంగా అధ్యక్షులు అసౌమని కృతజ్ఞతలు తెలిపారు. అందునా ఆఫ్రికాతో భారతదేశానికి లోతైన సంబంధాలున్న నేపథ్యంలో జి-20కి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సమయాన చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రత్యేక ఆనందాన్నిచ్చిందని ఆయన చెప్పారు. తద్వారా భారత్‌-కొమొరెజ్‌ సంబంధాలకు ఉత్తేజం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని ఆయన అభినందించారు.

   జి-20 కూటమిలో శాశ్వత సభ్యత్వం పొందడంపై ఆఫ్రికా సమాఖ్యతోపాటు కొమొరెజ్‌కు  ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. దక్షిణార్థ గోళ దేశాల గళం వినిపించడంలో తమ కృషిని ఈ సందర్భంగా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. తదనుగుణంగా 2023 జనవరిలో దక్షిణార్థ గోళ గళంపై శిఖరాగ్ర సదస్సు నిర్వహించడాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో భాగంగా భారత్‌-కొమొరెజ్‌ ద్వైపాక్షిక సంబంధాలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. సంబంధాల విస్తరణ దిశగా చేపట్టిన పలు చర్యల ప్రగతిపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సముద్ర భద్రత, సామర్థ్య వికాసం, ప్రగతి భాగస్వామ్యం తదితర రంగాల్లో సహకారానికిగల అవకాశాలపైనా వారు  చర్చించారు.

 

***