ఐబిఎమ్ సిఇఒ శ్రీ అరవింద్ కృష్ణ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు.
ఈ సంవత్సరం మొదట్లో ఐబిఎమ్ కు గ్లోబల్ హెడ్ గా నియమితుడు అయినందుకు గాను శ్రీ అరవింద్ కృష్ణ ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. భారతదేశం తో ఐబిఎమ్ కు గల గట్టి బంధాన్ని గురించి, దేశం లో ఐబిఎమ్ కు గల భారీ ఉనికి ని గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు. ఇరవై నగరాల నుండి ఒక లక్ష మంది కి పైగా ఈ కంపెనీ లో పని చేస్తున్నారు.
వ్యాపార సంస్కృతి పై కోవిడ్ ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘ఇంటి నుండి పని చేయడా’న్ని పెద్ద ఎత్తు న స్వీకరించడం జరుగుతున్నదని, మరి సాంకేతిక సంబంధమైనటువంటి ఈ యొక్క స్థానాంతరణం ఇబ్బంది లేకుండా జరిగేటట్టు గా పూచీ పడడం కోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన ను, సంధానాన్ని, ఇంకా క్రమబద్ధ వాతావరణాన్ని నెలకొల్పే దిశ గా ప్రభుత్వం నిరంతరం గా కృషి చేస్తోందని తెలిపారు. ఐబిఎమ్ తన ఉద్యోగుల లో 75 శాతం మంది వారి ఇళ్ల వద్ద ఉండి పని చేసేటట్టు ఇటీవల తీసుకొన్న నిర్ణయం తో ముడిపడినటువంటి సవాళ్ల ను గురించి, దీనితో సంబంధం కలిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి కూడా ఆయన చర్చించారు.
భారతదేశం లో 200 పాఠశాలల్లో సిబిఎస్ ఇ తో కలసి ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) బోధన ప్రణాళిక ను ప్రారంభించడం లో ఐబిఎమ్ పోషించిన పాత్ర ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. దేశం లో సాంకేతిక సంబంధి వ్యక్తిత్వాన్ని పెంచేందుకు గాను ఎఐ, మశీన్ లర్నింగ్ మొదలైన భావనల ను చాలా ముందు దశ లోనే విద్యార్థినీవిద్యార్థుల కు పరిచయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని మరియు డేటా ను గురించి బోధించడం అనేది బీజగణితం వంటి ప్రాథమిక నైపుణ్యాల శ్రేణి లో ఉండాలని ఐబిఎమ్ సిఇఒ అంటూ, వాటి ని ఆరంభిక దశలోనే ఉద్వేగం తో నేర్పించవలసిన అవసరం ఉందన్నారు.
భారతదేశం లో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక గొప్ప కాలం అని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. సాంకేతిక విజ్ఞానం రంగం లో చోటు చేసుకొంటున్న పెట్టుబడుల ను దేశం ఆహ్వానిస్తూ, వాటికి మద్దతిస్తోందని ఆయన అన్నారు. ప్రపంచం మందగమనాని కి లోనవుతుండగా, భారతదేశం లోకి ఎఫ్ డిఐ ప్రవాహం పెరుగుతోందని ఆయన చెప్పారు. ఒక స్వవిశ్వసనీయ భారతదేశాన్ని ఆవిష్కరించాలనే దృష్టికోణం తో దేశం ముందుకు కదులుతున్నది, తద్ద్వారా ప్రపంచం తో పోటీ పడగలిగే మరియు భంగపాటుల ను తట్టుకొని నిలచే స్థానిక సరఫరా శృంఖలాన్ని అభివృద్ధిపరచేందుకు వీలు ఉంటుంది అని ఆయన చెప్పారు. భారతదేశం లో ఐబిఎమ్ భారీ పెట్టుబడి కి ప్రణాళిక లను రచిస్తోందని ప్రధాన మంత్రి కి ఐబిఎమ్ సిఇఒ వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ దృష్టికోణం పట్ల ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
వెల్ నెస్ ను ప్రోత్సహించడం కోసం, అలాగే ఉత్తమమైన నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ సేవ ప్రజల కు అందుబాటు లోకి వచ్చేటట్టు పూచీ పడటం కోసం గత ఆరు సంవత్సరాల కాలం లో ప్రభుత్వం చేసిన కృషి ని గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఆరోగ్య సంరక్షణ రంగం లో భారతదేశానికి ఉపయోగపడే ఎఐ ఆధారిత సాధనాల ను తయారు చేయడానికి గల అవకాశాల ను, అలాగే వ్యాధి ని ముందు గా అంచనా వేయగల మరియు సంబంధిత అంశాల ను విశ్లేషించగల మెరుగైన నమూనాల ను అభివృద్ధిపరచేందుకు గల అవకాశాల ను గురించి కూడా ఆయన మాట్లాడారు. దేశం ఒక ఏకీకృతమైనటువంటి, సాంకేతికత, ఇంకా సమాచార నిధి చోదకాలు గా ఉండేటటువంటి అవాంతర రహిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ను మరియు తక్కువ ఖర్చు తో కూడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ను తీర్చిదిద్దే దిశ లో పయనిస్తున్నదని ఆయన చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సంబంధి దృష్టికోణాన్ని ముందుకు తీసుకుపోవడం లో ఐబిఎమ్ ఓ ముఖ్య పాత్ర ను పోషించగలుగుతుంది అని ఆయన అన్నారు. ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణాన్ని ఐబిఎమ్ సిఇఒ ప్రశంసించారు; వ్యాధుల ను తొలి దశ లోనే గుర్తించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం గురించి కూడా ఆయన మాట్లాడారు.
డేటా సెక్యూరిటీ, సైబర్ అటేక్స్, గోప్యత కు సంబంధించి నెలకొన్న ఆందోళనల తో పాటు యోగ తాలూకు ప్రయోజనాలు సైతం చర్చ కు వచ్చిన ఇతర అంశాల లో భాగం గా ఉన్నాయి.
**
Had an extensive interaction with CEO of @IBM, Mr. @ArvindKrishna. We discussed several subjects relating to technology, data security, emerging trends in healthcare and education. https://t.co/w9or8NWWbD pic.twitter.com/fCqFbmrzJx
— Narendra Modi (@narendramodi) July 20, 2020
Highlighted reasons that make India an attractive investment destination.
— Narendra Modi (@narendramodi) July 20, 2020
Was happy to know more about @IBM’s efforts in furthering AI among students. I also thank @ArvindKrishna for his encouraging words on efforts like Ayushman Bharat & India’s journey to become Aatmanirbhar.