Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐక్య రాజ్య సమితి అధికారిక గణాంకాల మౌలిక సూత్రాలకు అంగీకారం


ఐక్య రాజ్య సమితి నిర్దేశిత అధికారిక గణాంకాల మౌలిక సూత్రాల అమలుకు కేంద్ర మంత్రిమండలి అంగీకారం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఈ సూత్రాలను అమలుపరచడానికి ముందుకు రావడం వల్ల అధికారిక గణాంకాల సేకరణ, సంపుటీకరణ, పంపిణీ లలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంతో పాటు వృత్తిపరమైన స్వాతంత్ర్యం, నిష్పాక్షికత్వం, బాధ్యతాయుత ధోరణి, పారదర్శకత లు నెలకొంటాయి. అలాగే వ్యవస్థలను, పద్ధతులను, సంస్థలను తీర్చి దిద్ది వాటిని ఈ సూత్రాలకు సరిపోలేవిగా చేసేందుకు నేషనల్ పాలసీ ఆన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ ను రూపొందించేందుకు కూడా వీలు కలుగుతుంది.

అధికారిక గణాంకాలకు చెందిన.. ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఆమోదం లభించిన.. పది మౌలిక సూత్రాలు ఈ కింది విధంగా ఉన్నాయి.. :

ఒకటో సూత్రం : ప్రజాస్వామిక సమాజంలో అధికారిక గణాంకాలు సమాచార వ్యవస్థ నుంచి విడదీయలేని ఒక భాగం. ప్రభుత్వానికి, ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు ఆర్థిక, వయోవర్గాలకు సంబంధించిన, సామాజిక, పర్యావరణ సంబంధిత అంశాలలో సరైన సమాచారాన్ని అందజేసేందుకు అధికారిక గణాంకాలు పక్షపాతానికి తావు లేని విధంగాను, ఆచరణ యోగ్యంగాను ఉండాలి.

రెండో సూత్రం : అధికారిక గణాంకాలలో విశ్వసనీయతను పెంచేందుకు గణాంకాలను రూపొందించే సంస్థలు కచ్చితమైన వృత్తి నైపుణ్యాల ప్రమాణాలను అలవరచుకోవాలి. గణాంకాల సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీలలో శాస్త్రీయ సిద్ధాంతాలను, వృత్తిపరమైన నైతికతను ఈ సంస్థలు అనుసరించాలి.

మూడో సూత్రం : డాటాను సరిగా విడమరచి చెప్పేటందుకు స్టాటిస్టికల్ ఏజెన్సీలు సమాచారాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో, పద్ధతులతో, విధానాలతో ఆవిష్కరించగలగాలి.

నాలుగో సూత్రం : గణాంకాలను రూపొందించే సంస్థలు ఏవైనా తప్పిదాలు చేసినా, గణాంకాల దుర్వినియోగం జరిగినా అటువంటి వాటిని గురించి వెల్లడించే అధికారం కలిగి ఉండాలి.

అయిదో సూత్రం : గణాంకాలను అన్ని రకాల మార్గాల ద్వారా.. అది స్టాటిస్టికల్ సర్వేలు కావచ్చు లేదా పరిపాలన సంబంధమైన రికార్డుల నుంచి కావచ్చు.. పొందేందుకు వీలు ఉండాలి. గణాంకాలను
సేకరించే సంస్థలు నాణ్యతను, కాలానుగుణ్యతను, వ్యయాలను, ఆ గణాంకాలు ఎవరి వద్ద నుంచయితే తీసుకొంటున్నారో వారిపై పడే భారాన్ని.. ఆలోచించి మరీ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి.

ఆరో సూత్రం : స్టాటిస్టికల్ ఏజెన్సీలు గణాంకాల కూర్పు కోసం సేకరించే వ్యక్తిగత సమాచారం అది సహజమైన వ్యక్తుల డాటా కావచ్చు, లేదా లీగల్ పర్సన్స్ కు సంబంధించిన డాటా కావచ్చు.. ఆ డాటాను రహస్యంగానే ఉంచాలి; మరియు ఆ డాటాను నిర్దేశిత ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించాలి.

ఏడో సూత్రం : గణాంకాల వ్యవస్థలకు వర్తించే చట్టాలను, నిబంధనలను, పద్ధతులను సమాజానికి తెలియనివ్వకుండా ఉంచకూడదు; వాటిని బహిరంగపరచాలి.

ఎనిమిదో సూత్రం : గణాంకాల వ్యవస్థ లో నిలకడతనం, నిపుణత ల కోసం వివిధ దేశాలకు చెందిన గణాంకాల సేకరణ సంస్థల మధ్య సమన్వయం నెలకొనడం అవసరం.

తొమ్మిదో సూత్రం : వివిధ దేశాలకు చెందిన గణాంకాల సేకరణ సంస్థలు గణాంకాల వినియోగం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి గణాంకాల సేకరణ విధానాలు, వర్గీకరణ అన్నింటిలోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలి.

పదో సూత్రం : అన్ని దేశాలలోను అధికారిక గణాంకాల మెరుగుదలకు ద్వైపాక్షిక సహకారాన్ని, బహుముఖీన సహకారాన్ని పెంపొందించుకోవాలి.

పూర్వ రంగం:

ఈ సూత్రాలలోని చాలా అంశాలను గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ (ఎమ్ ఒ ఎస్ పి ఐ) ఇప్పటికే ఆచరిస్తోంది.

అధికారిక గణాంకాల మౌలిక సూత్రాలపై ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ తీర్మానం ముసాయిదా ను గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి సమాచారాన్ని అందుకొన్న ఎమ్ ఒ ఎస్ పి ఐ, ఆ తీర్మానానికి మద్దతు పలికింది. ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 2014 జనవరిలో ఈ సూత్రాలకు ఆమోద ముద్ర వేసింది.

ఆ తరువాత 2015 మార్చి నెలలో న్యూ యార్క్ లో జరిగిన ఐక్య రాజ్య సమితి గణాంకాల సంఘం 46వ సదస్సులో ఈ సూత్రాలపై సమీక్ష జరిపారు. ఆ సమావేశంలో భారతదేశపు ప్రతినిధిగా గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పాల్గొన్నారు. ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అమలులో పురోగతిని 2017లో జరుగనున్న ఐక్య రాజ్య సమితి గణాంకాల సంఘం 48వ సదస్సులో యు ఎన్ స్టాటిస్టిక్స్ డివిజన్ కు భారతదేశం తెలియచేయవలసివుంటుంది. అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన వాగ్దానానికి తగినట్టు ఈ సూత్రాలను అమలు చేయడం, వాటిని అమలు చేస్తున్న సంగతిని నివేదించడం కోసం ముందుగా ఈ సూత్రాలను భారత ప్రభుత్వం అంగీకరించవలసివుంటుంది..