న్యూఢిల్లీలో (ఆగష్టు31, 2015) ఈ రోజు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు 70వ అధ్యక్షుడుగా ఎన్నికైన మెగెన్స్ లిక్కెటాఫ్ట్ ను భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2030 అభివృద్ది ఎజెండాగా పునాదులు వేయడానికి ఐక్యరాజ్య సమితి
అంతర్జాతీయ సమావేశానికి, ఈ సర్వప్రతినిధి సభ మొదటి మొట్టుగా ప్రధాని అభివర్ణించారు. ఈ సభకు 70వ అధ్యక్షుడుగా ఎన్నికైన మెగెన్స్ లిక్కెటాఫ్ట్ కు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 15, 2015 లో జరగనున్న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సమావేశానికి హాజరుకావాలనుకుంటున్నట్టు ప్రధాని తెలిపారు.
ఐక్యరాజ్య సమితి 2030 అభివృద్ది ఎజెండాలో ఉన్న లక్ష్యాలను భారత ప్రభుత్వం ముఖ్యమైన పథకాలైన స్వచ్ భారత్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, జన్ ధన్ యోజన పథకాల ద్వారా ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను ఎప్పుడో సాధించిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు.
ఐక్యరాజ్య సమితికి 70వ సర్వప్రతినిధి సభ ముఖ్య భూమిక పోషిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సర్వ ప్రతినిధి సభపై అనేక దేశాల ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారని, ఎన్నో యేండ్లుగా పరిష్కారం కాని దీర్ఘకాల సమస్యలైన అంతర్జాతీయ ఉగ్రవాదం, భద్రతా మండలి లో చోటు పై బలమైన చట్టబద్దమైన, సమగ్రమైన ఒప్పందం దిశగా చర్చ జరగాలని ఆయన కోరారు.
మెగెన్స్ లిక్కెటాఫ్ట్ ప్రపంచ వాతావరణంలో మార్పు, అంతర్జాతీయ శాంతి, రక్షణ చర్యలు, మానవతా విలువలు 70వ సర్వప్రతినిధి సభ మఖ్య ఉద్దేశాలుగా ప్రధానికి వివరించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ , ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో ఇండియా ముఖ్యమైన పెద్దన్న పాత్ర పోషిస్తోందని ఐక్యరాజ్య సమితి 70వ సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు మెగెన్స్ లిక్కెటాఫ్ట్ అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితిలో అత్యంత వేగంగా తొందరగా నిర్ణయాలు తీసుకొనే దేశాలలో భారతదేశం ముందుదని ఆయనన్నారు. శాంతి కోసం ఐక్యరాజ్య సమితి తీసుకొనే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని ప్రధాని పునరుద్ఘాటించారు.
పారిస్ లో జరగున్న కాప్ 21 లో నైనా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్టు ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతకు ప్రధాని నరేంద్రమోదీ, ఐక్యరాజ్య సమితి 70వ సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు మెగెన్స్ లిక్కెటాఫ్ట్ ఇరువురు వాతావరణ మార్పు పై తీసుకొనే చర్యలపై చర్చించుకున్నారు.
MVVS/PR/ARDHA
President-elect of @UN General Assembly Mr. Mogens Lykketoft & I had a meeting today. @lykketoft pic.twitter.com/hBM7RGcIqr
— Narendra Modi (@narendramodi) August 31, 2015