Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐఎన్ఎ లో చిర‌కాలం పాటు ప‌ని చేసిన‌ ల‌లిత్ రామ్ జీ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఐఎన్ఎ లో చాలా కాలం పాటు ప‌ని చేసిన శ్రీ ల‌లిత్ రామ్ జీ మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యంత దుఃఖాన్ని వ్య‌క్తం చేశారు.
 
‘‘ఐఎన్ఎ లో దీర్ఘ‌కాల అనుభం క‌లిగిన ల‌లిత్ రామ్ జీ మ‌ర‌ణం గురించి తెలిసి బాధ క‌లిగింది.  ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన సాహసం, భార‌త‌దేశ స్వాతంత్య్ర స‌మ‌రానికి ఆయ‌న అందించిన తోడ్పాటు లు  ఎన్న‌టికీ మ‌ర‌చిపోలేన‌టువంటివి.  ఆయ‌న‌తో నేను జరిపిన భేటీల‌ను  గుర్తు కు తెచ్చుకొంటున్నాను.  ఆయ‌న వంటి మ‌హానుభావులు భార‌త‌దేశ చ‌రిత్ర పై చెరపరాన‌టువంటి ముద్ర ను వ‌ద‌లి వెళ్ళారు’’ అని శ్రీ న‌రేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

 

DS/VJ/AK