చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో మిక్స్ డ్ 50ఎమ్ రైఫిల్స్ ప్రోన్ ఎస్ హెచ్-1 పోటీ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ సిద్ధార్థ బాబు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –
‘‘మిక్స్ డ్ 50ఎమ్ రైఫిల్స్ ప్రోన్ ఎస్ హెచ్-1 పోటీ లో మిరుమిట్లు గొలిపే ప్రదర్శన ను ఇచ్చినందుకు గాను మన పారా శూటర్ శ్రీ సిద్ధార్థ బాబు కు ఇవే అభినందనలు.
ఈ స్వర్ణ పతకం ఆయన యొక్క అసాధారణమైన ఖచ్చితత్వాని కి, స్పష్టత కు, అసాధారణమైనటువంటి ప్రతిభ కు మరియు అలుపెరుగని ఉత్సాహాని కి ఒక ప్రమాణం గా ఉంది. భారతదేశం ఉబ్బితబ్బిబ్బు అవుతోంది.’’ అని పేర్కొన్నారు.
**
Congratulations to our Para Shooter @sid6666 for the dazzling performance in Mixed 50m Rifles Prone SH-1 event!
— Narendra Modi (@narendramodi) October 26, 2023
This Gold is a testament to his precision, focus, exceptional talent and relentless spirit. India is elated. pic.twitter.com/VgXil7bY08