Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ గేమ్స్లో 71 పతకాల ను గెలిచినందుకు క్రీడాకారుల కు అభినందనలను తెలియజేసిన ప్రధాన మంత్రి


ఏశియాన్ గేమ్స్ లో 71 పతకాల ను గెలిచినందుకు క్రీడాకారుల కు ఈ రోజు న అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ఇది ఏశియాన్ గేమ్స్ లో భారతదేశం ఇప్పటి వరకు నమోదు చేసిన అత్యుత్తమమైన మొత్తం సంఖ్య అని ఆయన అభివర్ణించారు.

క్రీడాకారుల సాటి లేనటువంటి సమర్పణ భావానికి, దృఢత్వానికి మరియు ఆటల సంబంధి ఉత్సాహానికి ఒక ప్రమాణం గా ఈ మొత్తం సంఖ్య ఉంది అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో –

‘‘ఏశియాన్ గేమ్స్ లో భారతదేశం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత గా తళుకులీనింది.

71 పతకాల తో, మనం మన అత్యుత్తమ పతకాల సంఖ్య ను సంబురం గా జరుపుకొంటున్నాం; మన క్రీడాకారుల, మన క్రీడాకారిణుల సాటి లేనటువంటి సమర్పణ భావానికి, దృఢత్వానికి మరియు ఆటల సంబంధి ఉత్సాహానికి ఒక ప్రమాణం గా ఈ మొత్తం సంఖ్య ఉంది.

ప్రతి ఒక్క పతకం కఠోర శ్రమ మరియు మక్కువ లతో నిండిన జీవన యాత్ర ను ప్రముఖం గా ప్రకటిస్తోంది.

యావత్తు దేశ ప్రజలు గర్వించేటటువంటి క్షణం. మన ఎథ్ లీట్ లకు అభినందన లు.’’ అని పేర్కొన్నారు.